For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ శరీరంలో ఈ ప్రమాదకరమైన లక్షణాలను మీరు కనుగొంటే, అది మీ ఆహారం వల్లనే...

మీ శరీరంలో ఈ ప్రమాదకరమైన లక్షణాలను మీరు కనుగొంటే, అది మీ ఆహారం వల్లనే...

|

ఆరోగ్యం విషయంలో మాంసాహారం కంటే శాకాహారం చాలా మంచిదని పరిగణింపబడుతోంది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో ప్రజలు అధిక మాంసాహారంగా ఉన్న ప్రజలు ఇప్పుడు శాఖాహారులుగా మారుతున్నారు. అందులోనూ ముఖ్యంగా కూరగాయలు మన ఆరోగ్యంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కూరగాయలు మరియు పండ్లలో అధిక స్థాయిలో పోషకాలు ఉన్నందున వీటిని మన ఆహారంలో క్రమం తప్పకుండా వాడాలి.

కానీ ఈ రోజుల్లో, ఎక్కువగా మాంసాహార వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, కూరగాయల వినియోగం తగ్గుతోంది. మన శరీరానికి కావలసినంత పండ్లు, కూరగాయలు తింటామని అనుకున్నాం. కానీ ఇది మన శరీరానికి ఎక్కువ కూరగాయలు మరియు పండ్లు అవసరమని సూచన ఇస్తుంది. ఎందుకంటే శరీరంలో పోషకాలు లేకపోవడం వల్ల, ఖచ్ఛితంగా పండ్లు, కూరగాయలు ఖచ్చితంగా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందువల్ల ఈ వ్యాసంలో కూరగాయలను ఎంత ప్రమాణంలో ఎలా తినాలో ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం ....

రోజుకు ఎంత కూరగాయలు తినాలి?

రోజుకు ఎంత కూరగాయలు తినాలి?

రోజులో శరీరానికి కావల్సిన కూరగాయలను తిన్నారని మీరు అనుకోవచ్చు, కాని ఖచ్చితంగా కాదు. సగటున, మనం రోజుకు రెండుసార్లు మాత్రమే కూరగాయలు తింటాము. అయితే పెద్దలు సుమారు ఐదు కప్పులు (సుమారు 75 గ్రాముల కూరగాయలు, సగం కప్పు వండిన మరియు ఒక కప్పు సలాడ్ రూపంలో) మరియు రెండు కప్పుల పండ్లు (ఒక కప్పు 150 గ్రా ఉండాలి ఒక ఆపిల్ లేదా నేరేడు పండు) తినాలి. పోషకాలు లేకపోవడం వల్ల మీ మొత్తం ఆరోగ్యాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది.

త్వరగా గాయపడటం

త్వరగా గాయపడటం

విటమిన్ సి తక్కువ తీసుకోవడం వల్ల గాయాలు త్వరగా అవుతాయి, చిగుళ్ళ చుట్టూ రక్తస్రావం పెరుగుతుంది మరియు గాయాన్ని మాన్పడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి విటమిన్ సి అధికంగా ఉన్న రెడ్ క్యాప్సికమ్, కాలే, ఎర్ర మిరియాలు, ముదురు ఆకుపచ్చ కూరగాయలు, బ్రోకలీ, టమోటాలు ను రోజువారి ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

అలసట పెరుగుతుంది

అలసట పెరుగుతుంది

శరీరంలో ఫొల్లెట్ (ఫొల్లెట్ ఆమ్లం) తక్కువగా ఉంటే, కానీ దీని లోపం వల్ల ఎల్లప్పుడూ అలసట మరియు నీకసంను కలిగిస్తుంది. బ్లాక్ ఐడ్ బఠానీలు, కిడ్నీ బీన్స్, లిమా బీన్స్, నేవీ బీన్స్, ఆస్పరాగస్ మరియు కాయధాన్యాలు, ఆకుపచ్చ కూరగాయలు, చిక్కుళ్ళు మరియు పిండి కూరగాయలలో ఫాలెట్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఈ కూరగాయలను రోజూ తీసుకోవాలి.

జలుబు త్వరగా నివారణ కాదు

జలుబు త్వరగా నివారణ కాదు

ఆహారంలో కూరగాయలు తక్కువగా ఉంటే మరియు శరీరానికి కీలకమైన విటమిన్లు లభించకపోతే, శరీరానికి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి ఉండదు, దీనివల్ల జలుబు వస్తుంది మరియు మళ్లీ నయం కాదు. అందువల్ల, మీ ఆహారాన్ని ఆరోగ్యకరమైన ఆహారంతో భర్తీ చేయండి, ఇందులో విటమిన్ సి అధికంగా ఉండేలా చూసుకోండి, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు కోలుకోవడానికి సహాయపడుతుంది.

జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది

జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది

ఇది అన్నివయస్సులవారిలో ఏదో ఒక సందర్భంలో మతిమరుపు రావడం సాధారణం. పర్వాలేదు. మీ వయసు పెరిగేకొద్దీ మెదడు ప్రతిస్పందన వేగం మరియు పనితీరు మసకబారుతుందని మీరు అనుకుంటే, పోషకాలు లేకపోవటానికి ఇది ఖచ్చితంగా కారణం. కూరగాయలు, క్యారెట్లు, బ్రోకలీ, మొక్కజొన్న మరియు టమోటాలలో ల్యూటేన్ అనే పోషకం ఉంటుంది. వారానికి ఒకసారైనా ఈ కూరగాయలను మీ డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోండి.

ఒత్తిడిని ఎదుర్కోవడం కష్టం

ఒత్తిడిని ఎదుర్కోవడం కష్టం

ఒత్తిడి అనేది మీరు పిలవని అతిథి. కానీ శరీరం ప్రతిచర్య మనం ఈ అతిథిని ఎలా పరిగణిస్తామో దానిపై ఆధారపడి ఉంటుంది. శరీరంలో ఒత్తిడి పెరిగిన వెంటనే మంట మొదలవుతుంది. దీని నుండి ఒత్తిడిని సరిగ్గా నిర్వహించకపోతే మంట ఖచ్చితంగా శరీరాన్ని ప్రభావితం చేస్తుంది.

అధిక సంతృప్త కొవ్వు ఆమ్లాలు (సాల్మన్ మరియు ట్యూనా), యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ మరియు కెరోటినాయిడ్లు (ఆకుపచ్చ కూరగాయలు మరియు ముదురు రంగు క్యాప్సికమ్), ఇవి రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి, ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి మరియు ఒత్తిడికి సహాయపడతాయి.

కండరాల తిమ్మిరి

కండరాల తిమ్మిరి

కూరగాయలు మరియు పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది, మీరు ఎక్కువ వ్యాయామం చేస్తే లేదా ఎండలో ఎక్కువ సమయం గడిపినట్లయితే కండరాల తిమ్మిరి వస్తుంది. ఒక మధ్య తరహా అరటి పండులో సుమారు 422 మి.గ్రా పొటాషియం ఉందని తెలుసుకోండి.

బరువు తగ్గడం

బరువు తగ్గడం

పండ్లు మరియు కూరగాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది మరియు ఇది ఎప్పుడూ మీ కడుపు నింపిన అనుభూతిని కలిగిస్తుంది.ఎక్కువ పండ్లు మరియు కూరగాయలలో కిలోఔల్స్ తక్కువగా ఉంటాయి. తీపి తినాలనే కోరిక పండ్లను తగ్గించడమే. మీరు ఐస్ క్రీం తినడానికి బదులుగా ఒక కప్పు స్ట్రాబెర్రీ తింటే, మీరు 800 కిలోఔన్స్ ఆదా చేయవచ్చు.

ద్రవాలు తీసుకోవడం మీరు గమనించారా?

ద్రవాలు తీసుకోవడం మీరు గమనించారా?

ప్రతి ఆదివారం మీకు ఇష్టమైన కూరగాయలను గ్రిల్ చేయండి, మీరు సలాడ్ లేదా లంచ్ బాక్స్ కోసం ఉపయోగించవచ్చు. ఇది శరీరం బాగా పనిచేయడానికి మరియు అవసరమైన విటమిన్లు పొందడానికి సహాయపడుతుంది.

ప్రతి భోజనంలో ఒక కప్పు కూరగాయలు తినండి

ప్రతి భోజనంలో ఒక కప్పు కూరగాయలు తినండి

మీ ఆహారంలో రంగు మరియు పోషకాలు అధికంగా ఉండే కూరగాయలు మరియు పండ్లను తప్పనిసరిగా చేర్చుకోవల్సి ఉంటుంది. దీని కోసం మీరు బఠానీలు, ఆపిల్ లేదా రంగు బెర్రీలను ఆహారంలో చేర్చాలి.

ప్రాసెస్ చేసిన కూరగాయ

ప్రాసెస్ చేసిన కూరగాయ

తాజా కూరగాయలు తినడానికి చాలా మంది వెనుకాడతారు. కానీ మీరు దానిని కొంతకాలం మార్కెట్ నుండి ఇంటికి తీసుకువచ్చిన కొంత సమయానే పాడైపోతాయి, అందుకోసం ఘనీభవించిన(ప్రొసెస్ చేసిన) కూరగాయలను కొనడమే దీనికి మంచి మార్గం. కూరగాయలను కత్తిరించడంలో మీకు సమస్య ఉంటే, కట్ చేసి మరియు రెడీగా ఉంచిన కూరగాయలు మార్కెట్లో లభిస్తాయి.

మీరు ఇంకా కూరగాయలు తినడానికి సంకోచించిస్తుంటే, మీరు వీటిని పేస్ట్ చేసి లేదా వెజిటేబుల్ జ్యూ లేదా షేక్ తయారుచేసుకోవచ్చు. పండు మరియు పండ్ల రసం వాడటం వల్ల కూరగాయల వాసన మాయమవుతుంది. మెరుగైన ఫిట్‌నెస్ కోసం పైన పేర్కొన్న కూరగాయలను తినండి మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

English summary

Clear Signs You Are Not Eating Enough Vegetables

You know veggies are good for you. You may also think you’re eating enough. The truth is, you probably aren’t. Read on to discover the many ways in which your body is telling you that it needs more fruit and vegetables, and what nutrients it craves. How many veggies do you need to eat, anyway?
Desktop Bottom Promotion