For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీ పిల్లల స్టడీ-రూమ్ అలంకరించేందుకు పాటించవలసిన చిట్కాలు !

  |

  ఒక వ్యక్తి యొక్క జీవితంలో చదువు అనేది ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉందో మనందరికీ బాగా తెలుసు. అందువల్ల తల్లిదండ్రులుగా ఉన్న మనం, మన పిల్లలు చదువుల్లో బాగా రాణించాలని ఉద్దేశాన్ని ఎప్పుడూ కలిగి ఉంటాము. ఒక వ్యక్తి జీవితంలో మొదటిసారిగా అభ్యసించడమనేది ఇంటి నుంచే మొదలవుతుంది, అలా వారు ఒక నిర్దిష్టమైన వయసుకు వచ్చిన తర్వాత స్కూల్లో చేరతారు.

  మీ పిల్లలు ఒక స్కూల్లో చేరిన తర్వాత, వారు ఇంట్లో చదవడానికి ఏమీ ఉండదని అర్థం కాదు. వాస్తవానికి, సంవత్సరాలు గడిచేకొద్ది మీ పిల్లలు ఒక తరగతి నుండి మరొక తరగతికి చేరుకుంటారు, అలా మీ పిల్లలు మరింత ఎక్కువగా నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది.

  చదువుల (స్టడీస్) యొక్క స్వభావం ఇంటిపని (హోమ్వర్క్) నుండి ప్రాజెక్టు వర్క్ మరియు ఎసైన్మెంట్స్ వరకూ ఉంటుంది, అయితే మీ పిల్లలు ఈ చదువుల భారాన్ని ఎక్కువగా ఇంటి వద్దనే కలిగి ఉంటారు. ఈ పరిస్థితులను గూర్చి పిల్లల యొక్క తల్లిదండ్రులే కాకుండా, భారతీయ విద్యా వ్యవస్థ కూడా నిర్థారిస్తుంది.

  Simple tips to decorate your child’s study area

  ఇప్పుడు మీరు పిల్లల భుజాలపై విద్యాసంబంధమై ఉన్న ఒత్తిడులను తగ్గించటం కోసం, మీ పిల్లలు సౌకర్యవంతంగా ఇంట్లోనే చదువుకునేట్లుగా కొన్ని ప్రక్రియలను చేపట్టాలి. ఎలా మీ పిల్లలు అనుకున్న లక్ష్యాలను సాధించడం కోసం, మరియు మీ పిల్లలు మరింత శ్రద్ధగా చదవడానికి, మీ ఇంట్లోనే శాంతియుతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయటం ద్వారానే మొదలవుతుంది.

  ఇలాంటి పరిస్థితుల్లో, మీ పిల్లలు పాఠాలను గొప్పగా అభ్యసించి మంచి విద్యార్హతను పొందేలా ప్రేరేపించడం కోసం, పిల్లల యొక్క స్టడీ-రూమ్ను సరైన రీతిలో అలంకరించాలి. ఇక్కడ సూచించబడిన చిట్కాలను అనుసరించి స్టడీ-రూమ్ను అలంకరించడం ద్వారా మీ పిల్లలు చాలా శ్రద్ధగా చదవగలుగుతారు.

  లైటింగ్ :

  లైటింగ్ :

  మీరు మీ పిల్లల చదువుకోవాలనుకున్న గదిలో అలంకరణకు (డెకరేషన్కు) రూపకల్పన చేస్తే, మీరు గుర్తుంచుకోవలసిన మొదటి విషయం ఆ గది యొక్క లైటింగ్. స్టడీ-రూమ్లో సహజసిద్ధమైన కాంతిని ప్రసరించేలా చెయ్యటం చాలా మంచి పద్ధతి. కానీ మనము కృత్రిమ లైటింగ్ గురించి మాట్లాడేటప్పుడు, ఏ ఇతర రంగులను ప్రయత్నించకుండా కేవలం తెలుపు రంగును మాత్రమే స్థిరముగా వుంచండి.

  కూలర్లు మరియు ఎయిర్-కండిషనర్లు :

  కూలర్లు మరియు ఎయిర్-కండిషనర్లు :

  మీరు నగరాల్లో నివసిస్తున్నట్లయితే, మీరు వేసవి కాలంలో మరింత ఎక్కువ వేడిని కలిగి ఉంటారు. అందుకోసం మీ పిల్లలు చదివే గదిలో కూలర్ను (లేదా) ఎయిర్-కండిషనర్ను ఏర్పాటు చేసుకోవడం చాలా మంచి ఆలోచన. ఇవి మీ పిల్లలు వేసవి కాలంలో కూడా బాగా చదువుకునేటట్లుగా ప్రోత్సహిస్తుంది. అలా మీ పిల్లలు ఎక్కువ సమయాన్ని చదవడం కోసం కేటాయించడాన్ని దీర్ఘకాలంలో మీరు చూస్తారు.

  గోడల రంగు :

  గోడల రంగు :

  మీ పిల్లల స్టడీ-రూమ్లో ఉన్న లైటింగ్కు తగ్గా, ఆహ్లాద భరితమైన రంగును కలిగి ఉండాలి. అందుకోసం మీరు చాలా ప్రకాశవంతమైన రంగులను (లేదా) ముదురు రంగులను ఎంపిక చేసుకోవద్దు. మీరు నిజంగా ఉత్సాహపూరితమైన రంగులను కోరుకున్నట్లయితే, ఒక గోడ మీద చూడగానే ఉత్తేజపరిచేలా ఉండే రంగును చిత్రీకరించవచ్చు. ఇలా మీరు ఏమి చేసినా అది కేవలం గోడకు మాత్రమే కట్టుబడి ఉండేలా నిర్ధారించుకోండి.

  చిన్న లైబ్రరీని నిర్మించండి :

  చిన్న లైబ్రరీని నిర్మించండి :

  మీ పిల్లలు, వారి చుట్టూ ఉన్న పుస్తకాలను చూస్తూ ఎదుగుతున్నట్లయితే, వారికి చదవాలనిపించేలా కోరికలు మరింతగా పెరుగుతాయి. ఈరోజు పుస్తకాల్లో చదివే మన పిల్లలే, పెద్దయ్యాక సమాజం గూర్చి మంచిగా ఆలోచిస్తారని మనందరికీ బాగా తెలిసిన వాస్తవం. పిల్లల కోసం మీరు నిర్మించే ఈ లైబ్రరీ, దీర్ఘకాలంలో ఎంతో కొంత ఫలితాన్ని మీకు అందజేస్తుంది. మీరు సాధ్యమైనంత వరకూ అన్ని రకాల పుస్తకాలను మీ పిల్లలకు అందుబాటులో ఉంచారని నిర్ధారించుకోండి.

  ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను దూరంగా ఉంచండి :

  ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను దూరంగా ఉంచండి :

  మీ పిల్లల ప్రాజెక్టుల కోసం డెస్క్టాప్ (లేదా) ల్యాప్టాప్ అవసరమయితే తప్ప, ఏదైనా ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల రూపంలో ఉన్న వస్తువులను వారి యొక్క స్టడీ-రూమ్కు దూరంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఈ స్టడీ-రూమ్లో తక్కువ సంఖ్యలో ప్లగ్గింగ్ పాయింట్లను ఉంచండి. ఇది వారి యొక్క దృష్టిని పూర్తిగా విద్యావేత్తల లాగా మార్చెలా ఉందని నిర్థారిస్తుంది మరియు అనవసరమైన విషయాల కోసం మీ పిల్లల దృష్టిని మరల్చకుండా చేస్తుంది.

  English summary

  Simple tips to decorate your child’s study area

  In order to increase your child's interest in studies there should be things that are inspiring and also motivating. As a parent you can work on the lighting, the wall colour, furniture and also build a library to develop interest in studies.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more