ప్రసవానంతరం డిప్రెషన్ తగ్గించుకోవడానికి 10 సహజ మార్గాలు

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

కొత్తగా బిడ్డకు జన్మనిచ్చిన తల్లుల్లో దాదాపు 70-80 శాతం మంది ఒకరకమైన ప్రతికూల భావాలు కలిగి ఉంటారని అంచనా వేయడమైనది. దీన్నే ప్రసవానంతర డిప్రెషన్ అంటారు, బిడ్డకు జన్మను ఇచ్చిన తరువాత వారి మనసు పరిపరి విధాలుగా ఉండడం అనేది చాలా మంది స్త్రీలలో సర్వ సాధారణంగా జరుగుతుంది.

మానసిక అనారోగ్యం లాగా ప్రసవానంతర డిప్రెషన్ కూడా ఏ తల్లికైనా జరగవచ్చు, ఇది ఇప్పటికీ ఒక అపవాదుగా ఉంది. అసమర్ధత, బాధ కలిగి ఉన్న చాలామంది స్త్రీలలో ఇది శాశ్వత మాంద్యంగా మారుతుంది. ఈ ప్రసవానంతర డిప్రెషన్ తల్లి, బిడ్డల మధ్య అనుబంధానికి ఆటంకం ఏర్పరుస్తుంది.

natural ways to treat postpartum depression

బిడ్డకు జన్మనిచ్చిన తరువాత తల్లిలో శారీరికంగా, మానసికంగా తీవ్రమైన మార్పులు వస్తాయి. ఈ మార్పులను అనుభవిస్తూ, వాటి భావోద్వేగాలు, సవాళ్ళ గురించి మాట్లాడడం అనేది ప్రసవానంతర డిప్రెషన్ ని పోగొట్టే ఉత్తమమైన మార్గాలలో ఒకటి.

కొంతమంది ప్రసవానంతర ఒత్తిడిని జనమనిచ్చిన 4-5 రోజుల తరువాత పొందితే, కొంతమంది ముందే పొందవచ్చు. ప్రసవానంతర డిప్రెషన్ తో ఉన్న తల్లులు తరచుగా వాటి లక్షణాలను గురించలేకపోవచ్చు.

నిద్రలేమి, ఏడుపు, నిరాశ, అలసట, ఆందోళన, ఆహారపు అలవాట్లలో మార్పు మొదలైనవి ప్రసవానంతర డిప్రెషన్ లక్షణాలు.

ప్రసవానంతర డిప్రెషన్ ను గుర్తించిన వెంటనే చికిత్స చేయాలి. ప్రసవానంతర డిప్రెషన్ చికిత్సకు 10 సహజ మార్గాల గురించి మేము చెప్తాము.

1.సహాయం చేయమని అడగడం

1.సహాయం చేయమని అడగడం

చాలామంది తల్లులు సిగ్గుతో సహాయం చేయమని అడగరు, కానీ మీకు కష్టంగా అనిపించినపుడు, బైటికి చెప్పడం చాలా అవసర౦. మీకు సహయంచేసే కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడాలి. కొంతకాలం మీ శిశువును జాగ్రత్తగా చూసుకోవడానికి వారు మీకు సహాయం చేస్తారు. దీనివల్ల మీరు కొద్దిసమయం విశ్రాంతి తీసుకోవడ౦, కొద్దిసేపు వంటరిగా గడపడ౦ వంటి ఇతర పనులకు మీకు సమయం దొరుకుతుంది.

2.నిద్ర

2.నిద్ర

కొత్తగా బిడ్డకు జన్మనిచ్చిన తల్లులు పిల్లల సంరక్షణ చాలా కష్టమైన విషయం కాబట్టి సరైన నిద్ర ఉండదు. మంచి నిద్ర లేకపోతే, పనులలో మీ సామర్ధ్యం, మీ మనసుని నేరుగా దెబ్బతీస్తుంది. కాబట్టి, మీ బిడ్డ పడుకున్నపుడే మీరు కాసేపు కునుకు తీస్తే, డిప్రెషన్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

3.కొద్దిసేపు బైటికి నడవండి

3.కొద్దిసేపు బైటికి నడవండి

బయటకి వెళ్లి కాసేపు నడవడం ద్వారా మనసు ప్రశాంతత పొందడం అనేది తల్లులకు చాలా ముఖ్యం. లోపలే వంటరిగా ఎక్కువసేపు గడపడానికి బదులుగా, మీ బిడ్డతో కొద్దిసేపు తాజా గాలిని ఆస్వాదిస్తూ నడవండి. ప్రసవానంతర డిప్రెషన్ సమయంలో తాజా గాలి, సూర్యరశ్మి ని ఎదుర్కోవడం కష్టం.

4.వ్యాయామం

4.వ్యాయామం

బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ప్రసవానంతర డిప్రెషన్ కు గురైన స్త్రీలకూ వ్యాయామం ఒక సహజ చికిత్స, థెరపీ లాంటిది. మీరు బైటికి జాగింగ్ కి వెళ్ళకపోతే, DVD వ్యాయామాలు చూసి, మీ ఇంట్లోనే వ్యాయామం చేయడం ప్రారంభించండి. యోగా కూడా మీకు మానసిక ప్రసాంతతను అందిస్తుంది, ప్రసవానంతర డిప్రెషన్ కు సహజమైన చికిత్స మార్గాలలో ఒకటిగా పనిచేస్తుంది.

5.ఆహారమే ముందు

5.ఆహారమే ముందు

ప్రాసెస్ చేసిన పదార్ధాల జోలికి వెళ్ళకండి, అవి త్వరగా అలసటను కలుగచేస్తాయి. బదులుగా, ప్రసవానంతర డిప్రెషన్ నుండి ఉపశమనం పొందడానికి సాధ్యమైనంత వరకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారపదార్ధాలు తినడం వల్ల మనసుకి స్దిమితాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది, సెరొటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. మీరు ప్రసవానంతర డిప్రెషన్ చికిత్సకు ఒమేగా-3 ఫాటీ పదార్ధాలను కూడా కలపండి.

6.ధ్యానం

6.ధ్యానం

ధ్యానం అనేది ప్రసవానంతర డిప్రెషన్ చికిత్సకు మరో మార్గం. మీ దైనందిన కార్యక్రమాల నుండి 20 నిమిషాలు పక్కన పెట్టి, మిమ్మల్ని మీరు అనుసంధానించుకోండి. ధ్యానం మీ మనసు నుండి ప్రతికూల ఆలోచనలను దూరంచేసి, మీరు ప్రశాంతమైన, విశ్రాంతి స్థితిలో ఉంచుతుంది.

7.నవ్వుతూ ఉండండి

7.నవ్వుతూ ఉండండి

నవ్వు నిజానికి మంచి మందు. మీరు నిరాశలో ఉన్నపుడు నవ్వడం ఎంతో కష్టం. కాబట్టి, మిమ్మల్ని మీరు మంచి మూడ్ లో ఉంచుకోవడానికి, ఒక కామెడీ షో ని లేదా మీకు ఇష్టమైన హాస్య సన్నివేశాలను చూడండి. అది మీలో అనుకూల వాతావరణాన్ని ఏర్పరచి, మీరు సంతోషంగా ఉండేట్టు చేస్తుంది.

8.ఎసెన్షియల్ ఆయిల్స్

8.ఎసెన్షియల్ ఆయిల్స్

ప్రసవానంతర డిప్రెషన్ చికిత్స కి మార్గాలలో ఎసెన్షియల్ ఆయిల్స్ ఒకటి. నిరాస, ఆదుర్దా పోగొట్టడానికి సహాయపడే వివిధ రకాల ఎసెన్షియల్ ఆయిల్స్ ఇక్కడ ఉన్నాయి. లావెండర్, చమోమిల్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ నిరాశతో కూడిన మనసుకు స్వాంతన చేకూర్చడానికి సహాయపడతాయి. వీటిని మీరు గాలిలో స్ప్రే చేయవచ్చు లేదా మీమీద చల్లుకోవచ్చు.

9.ఆక్యుపంక్చర్

9.ఆక్యుపంక్చర్

సంపూర్ణ ఆరోగ్య విధానంలో ఆక్యుపంక్చర్ ఒకటి, దీన్ని డిప్రెషన్ కి చికిత్సగా వాడతారు. ప్రసవానంతర డిప్రెషన్ చికిత్సకి ఆక్యుపంక్చర్ విధానాన్ని అనేకమంది వైద్యులు సిఫార్సుచేసారు, ఇది ఒత్తిడిని తగ్గించి, హార్మోన్ల సమతుల్యానికి సహాయపడి, గర్భధారణ తరువాత ఆందోళన లేకుండా చేస్తుంది.

10.మీకోసం మీరు నాణ్యమైన సమయాన్ని కేటాయించండి

10.మీకోసం మీరు నాణ్యమైన సమయాన్ని కేటాయించండి

మీకు బిడ్డ కలిగినపుడు, మీకోసం మీరు సమయాన్ని గడపడం మర్చిపోతారు. ప్రసవానంతర డిప్రెషన్ నుండి తేరుకోవడానికి, మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోవడం చాలా ముఖ్యం. తయారవడం, స్నేహితులను కలవడం వంటివి కూడా ప్రసవానంతర డిప్రెషన్ చికిత్స కు మరో మార్గాలు.

ఈ ఆర్టికిల్ ని షేర్ చేయండి!

ఈ ఆర్టికిల్ చదివి మీరు ఇష్టపడితే, మీకు ఇష్టమైన వారితో దీన్ని పంచుకోండి.

English summary

10 Natural Ways To Treat Postpartum Depression

Postpartum depression is very common among most women to experience severe mood swings after giving birth. An intense physiological and psychological changes occur in a mother after giving birth to a child. Experiencing these changes and talking about their emotions and challenges is one of the best ways to cope with postpartum depression.