For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిమ్మరసం గర్భధారణను ప్రభావితం చేయగలదా?

|

పెళ్ళయిన ప్రతీ యువతి గర్భవతి కావాలని ఎదురుచూస్తూ ఉంటారు కానీ వారు దానితో వచ్చిన మార్గదర్శకాలను మాత్రం పూర్తిగా అసహ్యించుకుంటారు.

మీరు గర్భవతి అయిన వార్త మీ కుటుంబానికి తెలిసిన వెంటనే, 3 వ నెల దాటిన సమయం నుంచి మీరు చేయవలసిన / చెయ్యకూడని పనులతో పాటు, ఇతర మార్గదర్శకాలను గూర్చి అందరూ తరచుగా సలహాలిస్తారు. వీటిలో మీ బిడ్డకు ఏది మంచిదో ? ఏది చెడ్డదో ? అనే సందేహం మిమ్మల్ని నిరంతరం వెంటాడుతూ ఉంటుంది.

గర్భిణీ స్త్రీలకు ముఖ్యంగా ఇచ్చే సలహా ఏమిటంటే, మీరు నేరుగా తీసుకునే ఆహారం మీ ఆరోగ్యము & మీ శిశువు యొక్క ఆరోగ్యం పైన ఎంతగానో ప్రభావితం చూపుతుంది. మీరు పాటించవలసిన డైట్లో ఎలాంటి కఠినమైన నియమాలు లేవు. గర్భధారణ సమయంలో మీకు మార్గనిర్దేశం చేసే పుస్తకాలు చదవటానికి చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి, అవునా ? కానీ అవన్నీ సరైన మార్గనిర్దేశాన్ని చూపకపోవచ్చు. అంతేకాకుండా, ఒక మాధ్యమం - మరొక మాధ్యమానికి సంబంధించిన అంశంపై అనేక రకాల ఆరోపణలను కూడా చేసి ఉండవచ్చు. ఇవన్నీ కూడా మీ మనసులో ఒక పెద్ద ప్రశ్నకు తెరలేపవచ్చు.

Can Lemon Juice Affect Pregnancy?

మన పెద్దల నుండి మనకు సంక్రమించిన జ్ఞానమనేది, చాలా సంవత్సరాల క్రితం మన పూర్వీకులు సంగ్రహించిన విజ్ఞానము & అనుభవాల కలయికని చెప్పవచ్చు. కానీ వీటిలో చాలా వాటికి శాస్త్రీయపరమైన మద్దతు లేనప్పటికీ, కొన్ని వాస్తవాలు మాత్రం సైంటిఫిక్గా నిరూపించబడ్డాయి. కానీ, గర్భధారణ అనే అత్యంత సంక్లిష్టమైన సమయంలో మనము ఇలాంటి రిస్క్ను తీసుకోలేము, అవును కదా ? అందువల్ల, మీ బోల్డ్-స్కై మీకు రక్షణగా మీ ముందుకు వచ్చింది !

గర్భిణి స్త్రీలు తమ రోజువారి డైట్లో తీసుకోవాల్సిన ఆహారం గూర్చి ఎదుర్కొంటున్న గందరగోళాన్ని మేము అర్థం చేసుకున్నాము. కాబట్టి, మీకు & మీ శిశువుకు పూర్తి సురక్షితంగా గల ఆహారాల గూర్చి ఉన్న అపోహలను పోగట్టడానికి మేము మీకు తోడుగా ఉన్నాము.

గర్భధారణ సమయంలో నిమ్మరసమును తీసుకోవడం వల్ల కలిగే అపోహలను పూర్తిగా పోగొట్టడంలో మీకు ఈ వ్యాసం తప్పక సహాయపడుతుంది.

Can Lemon Juice Affect Pregnancy?

గర్భధారణ సమయంలో వాడే నిమ్మకాయలు మీకు ఆరోగ్యకరమైనవిగా ఉన్నాయా ?

నిమ్మకాయలు, వివిధ రకాల విటమిన్లు & మినరల్స్తో పూర్తిగా నిండి ఉండేవిగా పరిగణించబడుతుంది. కాబట్టి వీటిని వాడటం వల్ల మీకు ఆరోగ్యకరమైనదని భావిస్తున్నారు, అవునా ? కానీ ఈ నిమ్మకాయలను తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్, హార్ట్ బర్న్ వంటి సమస్యలు గర్భిణీ స్త్రీలలో ఎదురయ్యే తర్వాతి దశలలో ఎదురుకావచ్చు. ఇది నిజమే అయినప్పటికీ, అవి చాలా పోషకాలను కలిగి ఉన్నదన్న వాస్తవాన్ని నిరాకరించేది మాత్రం కాదు.

నిమ్మలో విటమిన్ A & C, ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం, పాస్ఫరస్, నియాసిన్, రిబోఫ్లావిన్తో పాటు అనేక ఇతర పోషకాలు నిండి ఉండటంవల్ల అవి మీ శిశువును ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచడంలో సహాయపడుతుంది. అందువల్ల, మీ గర్భధారణ సమయంలో నిమ్మకాయలను తప్పక చేర్చాలి, ​​నిమ్మకాయలు కలుగజేసే ఇన్ని ప్రయోజనాలను పొందటానికి వాటి వల్ల కలిగే ప్రతికూల ప్రభావ అంశాలను పూర్తిగా తొలగించండి.

నిమ్మరసం మీ గర్భధారణను ప్రభావితం చేయగలదా?

నిమ్మకాయల వలె, నిమ్మరసమును కూడా గర్భధారణ సమయంలో వినియోగించడం వల్ల సురక్షితంగా భావించబడతాయి, అవి ఏ విధంగానూ ప్రభావితం చూపదు. అలాగే ఇది గర్భిణీ స్త్రీలలో ఎదురయ్యే వికారాన్ని పోగొట్టడమే కాకుండా, వీరిలో రక్తపోటును నిరంతరం పర్యవేక్షించడంలో సహాయపడుతుంది.

నిజానికి, చాలా రకాల పండ్ల రసాలు తీసుకునేందుకు చాలా సురక్షితంగా ఉంటాయి. కానీ వాటిని తీసుకునే మోతాదులోనే మేజిక్ ఉంది. మీరు తీసుకునే ప్రతిదీ సరైన పరిమాణంలో ఉండాలి. ఒక గ్లాసు నిమ్మరసంలో ఒక స్పూన్ షుగర్ను, చిటికెడు ఉప్పు కలిపి తీసుకోవడం ఆరోగ్యకరమైనదిగా భావిస్తారు.

1) హైపర్ టెన్షన్ను తగ్గిస్తుంది :

1) హైపర్ టెన్షన్ను తగ్గిస్తుంది :

గర్భిణీ స్త్రీలలో అధిక రక్తపోటు అనేది మెజారిటీ స్థాయిలో ప్రభావితం చూపబడే అంశమని అందరూ చెబుతారు. శిశువు యొక్క రాక గూర్చి & దాని తరువాత వచ్చే ప్రభావాల గూర్చి గర్భిణి స్త్రీలు ఆందోళన చెందుతున్నప్పుడు రక్తపోటు పెరగడానికి ప్రధాన కారణముగా చెప్పవచ్చు, ఇది మీ కడుపులో పెరుగుతున్న పిండమునకు చాలా ప్రమాదకరమైనది. ఇలాంటి సమయంలో మీరు నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల అది మీ రక్తనాళాలను మృదువుగా & తేలికగా వంగే స్వభావాన్ని కలుగజేయడం ద్వారా మీ రక్తపోటును ఎల్లప్పుడు చెక్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఇది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది.

2) ఇమ్మ్యునిటీని పెంచుతుంది :

2) ఇమ్మ్యునిటీని పెంచుతుంది :

నిమ్మరసంలో విటమిన్-సి సమృద్ధిగా ఉండటం వల్ల గర్భస్త తల్లిలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో, మహిళల శరీరంలో ఉన్న రోగనిరోధకశక్తి చాలా బలహీనంగా ఉంటుంది. దీనివల్ల మీకు చాలా రకాల వ్యాధులు వ్యాపిస్తాయి. నిమ్మరసమును మీరు రెగ్యులర్గా వినియోగించడం వల్ల మీలో రోగనిరోధక శక్తి పెరగటానికి బాగా సహాయపడుతుంది.

3) జీర్ణశక్తిని పెంపొందిస్తుంది :

3) జీర్ణశక్తిని పెంపొందిస్తుంది :

అజీర్ణం, మలబద్ధకం అనే సమస్యలు గర్భిణీ స్త్రీలలో అత్యంత సాధారణమైనవి. నిమ్మరసం కడుపులో ఉన్న మరిన్ని జీర్ణరసాలను స్రవిస్తుంది, తద్వారా, జీర్ణశక్తికి సహాయం చేస్తుంది. ఇది పాయువులో ఉన్న పెర్సిస్టాల్టిక్ కదలికకు సహాయపడుతుంది, అలా ఇది మీకు మలబద్ధకం నుండి ఉపశమనమును అందించుటలో సహాయపడుతుంది.

4) తల్లి & శిశువులలో ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది :

4) తల్లి & శిశువులలో ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది :

శిశువు పెరుగుదలకు అవసరమైన మెగ్నీషియం, క్యాల్షియం వంటి ప్రసిద్ధమైన సమ్మేళనాలు నిమ్మరసంలో పుష్కలంగా ఉన్నాయి. తక్కువ క్యాల్షియం స్థాయిలను కలిగి ఉన్న గర్భిణీ స్త్రీలు నిమ్మరసాన్ని తాగడం వల్ల ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చు. కడుపులో ఉన్న శిశువు యొక్క మెదడు కణాలను, నరాల వ్యాప్తిని మెగ్నీషియం పెంచుతుంది.

5) పాదాల వాపును అరికడుతుంది :

5) పాదాల వాపును అరికడుతుంది :

నెలలు గడుస్తున్నా గర్భిణీ స్త్రీలు సాధారణంగా పాదాల వాపుతో బాధపడుతున్నారు. నిమ్మరసం మాత్రమే ఈ సమస్యను ఎదుర్కోవటానికి సహాయపడదు, కానీ పరిస్థితి వల్ల ఉత్పన్నమయ్యే నొప్పి & అసౌకర్యాన్ని తగ్గించటానికి నిమ్మరసం బాగా సహాయపడుతుంది.

6) పురిటి నొప్పులను తగ్గిస్తుంది :

6) పురిటి నొప్పులను తగ్గిస్తుంది :

ఎవరైతే గర్భిణి స్త్రీలు తమ 5 నెల నుంచి రోజువారీగా నిమ్మరసాన్ని తీసుకుంటారో, అలాంటి వాళ్లలో ఆశ్చర్యకరంగా పురిటి నొప్పులను తగ్గిస్తుంది. ఇది శాస్త్రీయంగా రుజువు కానప్పటికీ, నిమ్మరసం తీసుకునే గర్భిణీ స్త్రీలు తక్కువ పురిటి నొప్పులను కలిగి ఉన్నట్లుగా చాలా సందర్భాలలో తేలింది.

English summary

Can Lemon Juice Affect Pregnancy?

Several myths say lemon juice affects pregnancy. Lemons are considered as powerhouses of different vitamins and minerals. Lemon juice is also safe to consume during pregnancy and does not affect it. It is said to aid morning sickness in many pregnant women and keeps a check on their blood pressure, which needs to be monitored continuously during the pregnancy phase.
Story first published: Friday, July 6, 2018, 10:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more