For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాయామాన్ని అవాయిడ్ చేయవలసిన సందర్భాలు

ప్రెగ్నెన్సీ అనేది మహిళల జీవితంలోని అందమైన దశ. ప్రతి మహిళ ఈ దశ కోసం ఆతృతగా ఎదురుచూస్తుంది. మీరు కన్సీవ్ అయిన విషయాన్ని మీ బంధుమిత్రులకు తెలిపిన తరువాత మీకు తెలిసిన ప్రతి ఒక్కరి నుంచి సలహాలు లభిస్తూ

|

ప్రెగ్నెన్సీ అనేది మహిళల జీవితంలోని అందమైన దశ. ప్రతి మహిళ ఈ దశ కోసం ఆతృతగా ఎదురుచూస్తుంది.

మీరు కన్సీవ్ అయిన విషయాన్ని మీ బంధుమిత్రులకు తెలిపిన తరువాత మీకు తెలిసిన ప్రతి ఒక్కరి నుంచి సలహాలు లభిస్తూ ఉంటాయి. ఈ సలహలు మీకు కొంత విసుగును కూడా కలిగించవచ్చు.

అయితే, ఈ సలహాలు మీ మంచి కోసమే మీకు అందేవి కాబట్టి విసుగును వదలండి. ఇన్ని సలహాలు అందడం వలన వేటిని పాటించాలో వేటిని పాటించకూడదో కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి, మీరు మీ గైనకాలజిస్ట్ ను సంప్రదించి మీ సందేహాలను నివృత్తి చేసుకోవడం ఉత్తమం. ప్రెగ్నెన్సీ దశలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు గైనకాలజిస్ట్ సూచనలను పాటించాలి.

When Should You Not Exercise During Pregnancy

ప్రెగ్నెన్సీ ద్వారా ప్రతి మహిళా ఎదుర్కొనే ఎక్స్పీరియెన్స్ ఒకేలా ఉండదు. అందువలన, ప్రెగ్నెన్సీ మిత్స్ అనేవి కాస్త కన్ఫ్యూజన్ గా ఉంటాయి. మెడికల్ సూపర్విజన్ లేకుండా కొన్ని సలహాలను పాటించడం ప్రమాదకరం కూడా.

ప్రెగ్నెన్సీ సమయంలో, ఆహారం విషయంలో మహిళలు తగిన శ్రద్ధ కనబరచాలి. అయితే, ఈ విషయంలో కూడా కన్ఫ్యూజన్ తన పాత్ర చూపిస్తుంది. ఈ విషయంతో పాటు మరొకవిషయంలో కూడా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అదేనండి వ్యాయామం విషయంలో. ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాయామం గురించి ఏర్పడే కన్ఫ్యూజన్ అంతా ఇంతా కాదు.

ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్సర్సైజ్ ను అవాయిడ్ చేయమని అంటారు. అథ్లెట్స్ కి కూడా ఇదే సలహా వర్తిస్తుంది. అయితే. ప్రెగ్నెన్సీలో నెలలు నిండే కొద్దీ తమ డైలీ రొటీన్ లో ఎక్సర్సైజ్ ను భాగంగా చేసుకుంటారు చాలా మంది మహిళలు.

ఇప్పుడు ప్రశ్నేంటంటే - ప్రెగ్నెన్సీ లో వ్యాయామానికి అనుకూల సమయం ఏంటి? ఈ విషయంపై మీకు కొంత అవగాహనను కల్పించడానికి మేమిక్కడ సిద్ధంగా ఉన్నాము.

ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్సర్సైజ్ ను చేయవచ్చా? ప్రెగ్నెన్సీలోని ఏ సమయంలో ఎక్సర్సైజ్ ను అవాయిడ్ చేయాలి? ఈ ప్రశ్నలకి సమాధానం ఈ ఆర్టికల్ లో లభిస్తుంది.

వ్యాయామం వలన మన శరీరానికి అలాగే మన మనసుకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలోని కండరాలని టోన్ చేయడానికి వ్యాయామం తోడ్పడుతుంది. అదే విధంగా బరువును నియంత్రణలో ఉంచుతుంది. అయితే, ఇవన్నీ ప్రెగ్నెన్సీ సమయంలో కూడా అవసరమా?

ఈ సమయంలో మన శరీరానికి అదనపు శ్రద్ధ అవసరం. ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాయామం అనేక ప్రయోజనాలను చేకూరుస్తుందనేది నిజం.

ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాయామం చేయడం వలన ఈ ప్రయోజనాలను పొందవచ్చు:

1. ప్రెగ్నెన్సీ సమయంలో మోడరేట్ ఎక్సర్సైజ్ వలన బ్యాక్ పెయిన్ మరియు బ్లోటింగ్ తగ్గుతుంది.

2. ప్రెగ్నెన్సీలో వ్యాయామం చేసే మహిళలలో జెస్టేషనల్ డయాబెటిస్ సమస్య తలెత్తే ప్రమాదం తగ్గుతుంది.

3. వ్యాయామం వలన రక్తప్రసరణ సజావుగా సాగుతుంది. అందువలన మీ మూడ్ ఎలివేట్ అవుతుంది. శక్తి పెరుగుతుంది.

4. మీ కండరాలను టోన్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ తరువాత తిరిగి సాధారణ స్థితికి చేరుకునేందుకు తోడ్పడుతుంది.

5. మజిల్స్ లో మూవ్మెంట్ ఉండటం వలన వెజీనల్ ప్రెగ్నెన్సీకి ఆస్కారం ఉంది.

ఇంతకు ముందు చెప్పుకున్నట్టు, ప్రతి మహిళ ప్రెగ్నెన్సీ కూడా విభిన్నంగా ఉంటుంది. అందువలన, గైనకాలజిస్ట్ సూచనలను మీరు తప్పక పాటించాలి. మీరు ఒకవేళ స్పోర్ట్స్ పెర్సన్ అయినా లేదా ఫిజికల్ యాక్టివిటీస్ లో యాక్టివ్ గా ఉండే వ్యక్తి అయినా మీ గైనిక్ మీకు ఎక్సర్సైజ్ ను కంటిన్యూ చేయమని సలహా ఇచ్చే అవకాశాలు కలవు. ఎటువంటి ఇబ్బందులూ తలెత్తనంత వరకు ఇటువంటి వ్యక్తులు ప్రెగ్నెన్సీలో కూడా తమ ఎక్సర్సైజ్ రొటీన్ ను కంటిన్యూ చేసుకోవచ్చు.

ఇక్కడ చెప్పబడిన కొన్ని సందర్భాలలో గర్భిణీలు ఎక్సర్సైజ్ కు దూరంగా ఉండాలి. ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ కాకూడదు. తద్వారా, ప్రెగ్నెన్సీలోని కొన్ని కాంప్లికేషన్స్ ను అవాయిడ్ చేసే అవకాశం ఉంది.

1. ట్విన్స్ లేదా ట్రిప్లెట్స్ ను క్యారీ చేస్తున్న మహిళలు:

1. ట్విన్స్ లేదా ట్రిప్లెట్స్ ను క్యారీ చేస్తున్న మహిళలు:

తమ గర్భంలో ట్విన్స్ లేదా ట్రిప్లెట్స్ ను క్యారీ చేస్తున్న మహిళలు వ్యాయామానికి దూరంగా ఉండాలి. లేదంటే ప్రీ టర్మ్ లేబర్ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది.

2. బ్లీడింగ్ లేదా స్పాటింగ్:

2. బ్లీడింగ్ లేదా స్పాటింగ్:

సెకండ్ లేదా థర్డ్ ట్రైమిస్టర్ లో బ్లీడింగ్ ను ఎక్స్పీరియెన్స్ చేస్తే ఫిజికల్ యాక్టివిటీకి దూరంగా ఉండండి. లేదంటే గర్భస్థ శిశువు ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.

3. అనీమిక్:

3. అనీమిక్:

ప్రెగ్నెన్సీలో అనీమియా లేదా ఐరన్ కౌంట్ తక్కువగా ఉండటం ప్రమాదకరం. దీనివలన ప్రెగ్నెన్సీలో గాయలయ్యే ప్రమాదం అలాగే బ్లడ్ లాస్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువలన, అనీమియాతో బాధపడే గర్భిణీలు తమ రొటీన్ లో ఎక్సర్సైజ్ కు స్థానం ఇవ్వకూడదు.

4. కార్డియాక్ ఇష్యూస్:

4. కార్డియాక్ ఇష్యూస్:

గుండె జబ్బులున్న మహిళలు ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఫిజికల్ యాక్టివిటీస్ వలన గుండెపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది.

5. హైపర్టెన్షన్:

5. హైపర్టెన్షన్:

ప్రెగ్నెన్సీలో హై బ్లడ్ ప్రెషర్ అనేది ప్రమాదకర సూచన. కాబట్టి, మీకు హై బ్లడ్ ప్రెషర్ సమస్య ఉన్నట్టు తేలితే మీరు శరీరానికి కాస్తంత విశ్రాంతిని అందించండి.

6. ప్రీమెచ్యూర్ డైలేషన్:

6. ప్రీమెచ్యూర్ డైలేషన్:

ప్రీమెచ్యూర్ డైలేషన్ లేదా సెర్వికల్ ఇన్సఫిషియెన్సీ బారిన పడిన మహిళలు ఫిజికల్ ఎక్సర్సైజ్ కు దూరంగా ఉండాలి. వ్యాయామం వలన శరీరంలోని ఆక్సీటోసిన్ మోతాదు పెరుగుతుంది. ఈ హార్మోన్ లేబర్ ని ఇండ్యూస్ చేయడానికి తోడ్పడే హార్మోన్.

7. ఛిద్రమైన మెంబ్రేన్:

7. ఛిద్రమైన మెంబ్రేన్:

గర్భంలోని శిశువు ఆమ్నాయిటిక్ ఫ్లూయిడ్ తో కప్పబడి ఉంటుంది. అమ్నోయిటిక్ ప్లగ్ ఇందుకు తోడ్పడుతుంది. విపరీతమైన వ్యాయామం వలన అమ్నోయిటిక్ ప్లగ్ అనేది వదులుగా మారి ఫ్లూయిడ్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది శిశువు ప్రాణానికే ప్రమాదం.

ఈ సందర్భాలలో వ్యాయామాన్ని అవాయిడ్ చేయాలి. ఒక వేళ మీ ప్రెగ్నెన్సీ నార్మల్ గా ఉన్నా, మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ను మీ రొటీన్ లో భాగంగా చేసుకున్నా ఈ కింది లక్షణాలు కనబడితే మీరు మరింత జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

1. తేలికపాటి వ్యాయామం తరువాత కూడా మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనా..

2. చెస్ట్ పెయిన్ ని ఎక్స్పీరియెన్స్ చేసినా..

3. కండరాల్లో నొప్పులు, మడమలలో వాపులు ఏర్పడినా..

4. టమ్మీ లేదా పెల్విస్ ఏరియాలో నొప్పి ఏర్పడినా...

5. విపరీతమైన తలనొప్పితో పాటు డిజ్జీనెస్ ను మీరు ఎక్స్పీరియెన్స్ చేసినా..

ఈ సూచనలు మీ గర్భస్థ శిశువు ఆరోగ్యం గురించి మీకు కొంత అవగాహనకు అందిస్తాయి. ఈ లక్షణాలను గమించగానే మీరు గైనకాలజిస్ట్ ను సంప్రదించాలి. వ్యాయామానికి దూరంగా ఉండాలి. స్ట్రిక్ట్ ఫిట్నెస్ రూల్స్ కు కాస్తంత విరామం అందించండి. ఆహారాన్ని ఆస్వాదించండి. ఎక్సర్సైజ్ గురించి ఆలోచించడానికి మీకు చాలా సమయం ఉంది. మీ గర్భస్థ శిశువు ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ద్వారా మీరూ ఆరోగ్యంగా ఉంటారు. కాన్పు ఆరోగ్యకరంగా జరుగుతుంది. తల్లీబిడ్డా క్షేమంగా ఉంటారు.

English summary

When Should You Not Exercise During Pregnancy

The moment everyone knows you are pregnant, there are several suggestions that pour in. There will be a lot of dilemma on which food to eat, how to take care of yourself, the baby, etc. One of the common myths is also about exercise. You should not exercise if you see spotting, you are anaemic, suffering from cardiac issues, etc.
Story first published:Wednesday, May 16, 2018, 14:41 [IST]
Desktop Bottom Promotion