Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Andhra Ruchulu:ఆంధ్ర రుచులు: గోదావరి స్పెషల్ పులస పులుసు
పులస పులుసుకు ఒక విశేషం ఉంది చాలా కరీదైన చేపయైనా బ్రహ్మండమైన రుచి ఉంటుందని అంటారు. దీనికి సంబందించి ఒక సామెత కూడా ఉంది. పుస్తలు తాకట్టు పెటైనా పులస పులుసు తినాలి అనే వారట. అంత విశేషం ఉంది పులస చేపకి.
గోదావరి జిల్లాలు అనగానే కొబ్బరి చెట్లు, వెన్నెల్లో గోదారి.. పూతరేకులు, కాకినాడ కాజా ఇలా ఎన్నో గుర్తుకొస్తాయి. వీటన్నిటి తో పాటు వర్షాకాలం వచ్చిందంటే చటుక్కున గుర్తొచ్చేది ఇంకొకటి ఉంది. అదే పులస.. వర్షా కాలం గోదాట్లోకి వచ్చే కొత్త నీటికి ఎదురీదే పులస చేపంటే పెద్ద క్రేజ. ఎంతగా అంటే .. పెళ్ళాం పుస్తెలు తాకట్టి అయినా పులస కొనుక్కు తినాలన్నంతగా.. మరింకెందుకు ఆలస్యం వెంటనే ఈ చేపల పులుసును ఎలా తయారుచేయాలో చూసేద్దాం.
కావలసిన పదార్ధలు:
పులస చేప - 1
వేన్న - 1 tsp
చింతపండు- కావలసినంత
ధనియాలు- 2 tsp
మెంతులు - 1/4 tsp
ఉల్లిపాయలు- 2
పచ్చిమిరప - 6
ఆవాకాయనూనె - 2 tsp
ఉప్పు - రుచికి సరిపడా
కారం - 2 tsp
కరివేపాకు - 2 రెబ్బలు
కొత్తిమిర- కొద్దిగా
తయారు చేయు పద్దతి:
1. మొదటగా పులస చేపని శుభ్రం చేసి కావాలసిన సైజులో కట్ చేసి
పెట్టుకోవాలి.
2. మెంతులు, దనియాలు, జిలకర్ర, ఆవాలు మిక్షర్ లో మెత్తగా గ్రైడ్ చేసి
పెట్టుకోవాలి.
3. ఉల్లిపాయను, పచ్చిమిరపను చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన
పెట్టుకోవాలి.
4. తర్వాత స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి కాగిన తర్వాత
ఉల్లిపాయలు, పచ్చిమిరప, కొత్తిమిర వేసి దోరగా వేపాలి. వేగినాక గ్రైడ్
చేసి పెట్టుకొన్న మసాలా ముద్దను అందులో వేసి వేపాలి.
5. 5 నిమిషాలైనాక పులస చేప ముక్కలను, ఆవకాయనూనెను, ఉప్ప, కారం వేసి
వేపాలి చివరగా చింతపులుసు పోసి కలిపి ఉడకనివ్వాలి.
6. స్టౌ మీద నుండి దింపుకొనే ముందుగా కొద్దిగా వేన్న, కరివేపాకు
వేస్తే రంగుతో పాటు, రుచి కూడా బాగా వుంటుంది. ఇలా తయారైన పులస పులుసు
వేడి వేడిగా అథిదులకు వండించండి. రెండు మూడు రోజుల తర్వాత తిన్నా
టేస్ట్ అద్భుతంగా ఉంటుంది
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












