For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాసుంది తయారీ ; సంప్రదాయ బాసుంది తయారు చెయ్యటం ఎలా

పశ్చిమ భారతంలో ఎక్కువగా చేసే స్వీటు, తీపి పదార్థం బాసుంది. ఇక్కడ చిత్రాలు, వీడియోతో తయారీ విధానం మీకోసం, చదవండి.

Posted By: Deepthi
|

బాసుంది అనే ఒక సాంప్రదాయక స్వీటు ముఖ్యంగా పండగలప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలలో ఎక్కువగా చేస్తారు. పాలతో తయారు చేసే ఈ పదార్థం, పాలను సగానికి మరిగించి, చక్కెర, ఏలకుల పొడి, డ్రైఫ్రూట్లను జతచేసి చేస్తారు.

గుజరాత్ రాష్ట్రంలో ప్రతి పెళ్ళి విందులో తప్పనిసరిగా కన్పించే ఈ స్వీటును పండగలప్పుడు ముఖ్యంగా చేస్తారు. ఎంతో రుచికరంగా ఉండే ఇది వేడిగా లేదా చల్లగా తినవచ్చు.

దీన్ని పూరిలతో కలిపి తింటారు. పెద్ద శ్రమలేకుండానే సులభంగా, త్వరగా దీన్ని చేసుకోవచ్చు. అందుకే పార్టీలలో, పిల్లలకోసం బాసుందిని చేసుకోవచ్చు. మా స్టెప్ బై స్టెప్ విధానంతో, చిత్రాలు, వీడియో సాయంతో మీరే ఇంట్లో తయారుచేసుకోవచ్చు. చదవండి.

బాసుంది రెసిపి వీడియో

బాసుంది రెసిపి । మహారాష్ట్ర బాసుంది తయారీ ఎలా । బాసుంది త్వరగా చేయండి । సాంప్రదాయ బాసుంది రెసిపి
Prep Time
5 Mins
Cook Time
20M
Total Time
25 Mins

Recipe By: మీనా బంఢారి

Recipe Type: స్వీట్లు

Serves: ఇద్దరికి

Ingredients
  • ఫుల్ క్రీమ్ పాలు - అరలీటరు

    చక్కెర - 3 చెంచాలు

    తరిగిన జీడిపప్పు - 4చెంచాలు

    తరిగిన బాదం - 1 చెంచా

    ఏలకుల పొడి - ½ చెంచా

How to Prepare
  • 1. పాలను బాండిలో పోయండి.

    2. పాలను మరిగించి మాడిపోకుండా చూసుకోండి.

    3. పాలు సగమయ్యేదాకా మరిగించండి.

    4. చక్కెర వేసి మరో 2-3 నిమిషాలు కలుపుతూనే ఉండండి.

    5. తరిగిన బాదం, జీడిపప్పును వేయండి.

    6. అన్నిటినీ బాగా కలపండి.

    7. స్టవ్ ఆపేముందు ఏలకుల పొడిని వేసి అందరికీ వడ్డించండి.

Instructions
  • 1.పాలు మరుగుతున్నప్పుడు కింద అతుక్కోకుండా కలుపుతూనే ఉండండి.
  • 2. సన్నని మంటలో పాలు సగమయ్యేలా మరగాలి.
  • 3. పాలు సగం వరకూ మరిగాకనే చక్కెరను వేయాలి. లేకపోతే గట్టిపడదు.
  • 4. కావాలంటే రుచికోసం కుంకుమపువ్వు రేకులను వేసుకోండి.
Nutritional Information
  • వడ్డించే పరిమాణం - 1 కప్పు
  • క్యాలరీలు - 398 క్యాలరీలు
  • కొవ్వు - 17 గ్రాములు
  • ప్రొటీన్ - 14 గ్రాములు
  • కార్బొహైడ్రేట్లు - 48గ్రాములు
  • చక్కెర - 46 గ్రాములు
  • ఐరన్ - 1 %
  • విటమిన్ ఎ - 9%

స్టెప్ బై స్టెప్ - బాసుంది తయారీ ఎలా

1. పాలను బాండిలో పోయండి.

2. పాలను మరిగించి మాడిపోకుండా చూసుకోండి.

3. పాలు సగమయ్యేదాకా మరిగించండి.

4. చక్కెర వేసి మరో 2-3 నిమిషాలు కలుపుతూనే ఉండండి.

5. తరిగిన బాదం, జీడిపప్పును వేయండి.

6. అన్నిటినీ బాగా కలపండి.

7. స్టవ్ ఆపేముందు ఏలకుల పొడిని వేసి అందరికీ వడ్డించండి.

[ 4.5 of 5 - 56 Users]
English summary

బాసుంది రెసిపి । మహారాష్ట్ర బాసుంది తయారీ ఎలా । బాసుంది త్వరగా చేయండి । సాంప్రదాయ బాసుంది రెసిపి

Basundi is a traditional sweet that is prepared for festivals mainly in the states of Karnataka, Maharashtra and Gujarat. The basundi is a milk-based sweet and is prepared by reducing the milk to half and adding sugar, elaichi powder and dry fruits to it.
Desktop Bottom Promotion