టేస్ట్ లో ది బెస్ట్..పుదీనా పులావ్ ఇలా చేసుకుంటే మెతుకు మిగల్చకుండా నాకేస్తారు

Posted By:

బిర్యానీలు ఇష్టపడేవాళ్ల సంఖ్య ఎంత ఉంటుందో అంతేస్థాయిలో పులావ్ ని ఇష్టపడేటోళ్లు కూడా ఉంటారు. వాస్తవానికి పులావ్ ని అనేక రకాలుగా చేసుకుంటారు. కూరగాయలతోపాటుగా చికెన్,మటన్ వంటి నాన్ వెజ్ లతో కూడా పులావ్ తయారు చేస్తారు. పులావ్ రకాల్లో.. పుదీనాతో చేసే పులావ్ ఒకటి.పుదీనా పులావ్.. సుగంధభరితమైన, రుచికరమైన వంటకం. తాజాగా అప్పుడే వండిన అన్నంతోనే కాకుండా రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా పుదీనా పులావ్ ని చేసుకోవచ్చు.

చల్లని రైతాతో పుదీనా పులావ్ తింటుంటే నోటికి స్వర్గమే. పుదీనా పులావ్ ని ఇంట్లోనే చాలా సులభంగా, త్వరగా తయారు చేసుకోవచ్చు. పుదీనా పులావ్ తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూడండి.

పుదీనా పులావ్ తయారీకి కావలసిన పదార్థాలు

బాస్మతి బియ్యం: 2 కప్పులు
పుదీనా ఆకులు: 1 కప్పు
కొత్తిమీర ఆకులు: 1/2 కప్పు
ఉల్లిపాయలు: 1 పెద్దది (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి: 4-5 (సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క: 1 అంగుళం ముక్క
లవంగాలు: 4-5
యాలకులు: 3-4
బిర్యానీ ఆకు: 1
జీలకర్ర: 1 టీ స్పూన్
నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
నీరు: 4 కప్పులు
నిమ్మరసం: 1 టేబుల్ స్పూన్

ప్రపంచంలోనే నెం.2 బెస్ట్ స్వీట్ ఇదే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి

తయారీ విధానం

-ముందుగా బాస్మతి బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి.

-నానబెట్టిన బియ్యాన్ని వడకట్టి పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు పుదీనా కొత్తిమీర పేస్ట్ తయారు చేయాలి. ఇందుకోసం పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులను శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. కొంచెం నీరు అవసరమైతే వేసుకోవచ్చు.

-తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె లేదా కుక్కర్ పెట్టి అందులో నెయ్యి, ఆయిల్ పోసి వేడి చేయాలి.

-వేడి అయిన ఆయిల్ లో జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి.

-తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

-తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.

-ఇప్పుడు పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి.

-తర్వాత అందులో నానబెట్టిన బియ్యం వేసి రెండు నిమిషాలు వేయించాలి.

-తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.

-ఇప్పుడు అందులో నాలుగు కప్పుల నీరు పోసి బాగా కలపాలి. కావాలనుకుటే నిమ్మరసం వేసి కలపాలి.

-కుక్కర్ లో ఐతే మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

-కుక్కర్ కాకుండా గిన్నెలో ఉడికించేటట్టైతే నీరు మరిగిన తర్వాత మంట తగ్గించి మూత పెట్టి బియ్యం పూర్తిగా ఉడికే వరకు ఉడికించాలి.

-పూర్తిగా ఆవిరి పోయిన తర్వాత మూత తీసి పులావ్‌ను మెల్లగా కలపాలి.

-వేడి వేడి పుదీనా పులావ్ రైతా లేదా ఏదైనా కూరతో సర్వ్ చేయవచ్చు.

[ of 5 - Users]
Desktop Bottom Promotion