For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆకలి చెక్ పెట్టి..అధిక బరువు తగ్గించే కొబ్బరి..!

|

ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకూ విశ్వమంతటా ఆరోగ్య పరిరక్షణకు వాడుతున్న సహజ ఫలము కొబ్బరి. నేటి ఆధునిక ప్రపంచంలో కొందరు నిపుణులు జరిపిన పరిశోధన ద్వారా కొబ్బరిలో అనేక ఆరోగ్య రహస్యాలున్నట్లు కొనుగొన్నారు. కొబ్బరికాయను అందరూ శుభప్రదముగా భావిస్తారు. మనదేశములో శుభకారార్యాలకు కొబ్బరికాయ తప్పనిసరి. కొబ్బరికాయ లేని పండుగ లేదంటే అతిశయోక్తి కాదు. కేరళీయులకైతే రోజూ అన్నింటిలోనూ కొబ్బరికాయ, కొబ్బరినూనె తప్పనిసరిగా వుండి తీరవలసినదే. వారి ఆరోగ్యమూ, సంపదా కొబ్బరిపంట మీద అదారపడివున్నాయి .

కొకొనట్ మిల్క్ తో క్యాన్సర్ కి చెక్

కొబ్బరిలో మరియు కొబ్బరి నీళ్ళలో విటమిన్లు, మినరల్సు, ఎలక్ట్రో లైట్స్, ఎంజైమ్ లు, ఎమినో యాసిడ్లు, సైటోకిన్ అధికంగా ఉన్నాయి. ఈ నీళ్ళు ఉపశాంతినిచ్చే వగరు రుచికి, దాని ఆరోగ్య ప్రయోజనాలకి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందింది.

కొబ్బరి కేవలం ఆరోగ్యానికే కాదు.. శరీర దృఢత్వానికీ అవసరమే. కానీ కొబ్బరి తినడం వల్ల దగ్గు వస్తుందేమోనని కొంతమంది అనుకుంటుంటారు. ఇది ఎంత వరకు నిజమన్నది కాసేపు పక్కన పెడితే.. కొబ్బరి తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుందని.. దీనికి కారణం ఇందులో ఉండే శ్యాచురేటెడ్ కొవ్వు పరిమాణమేనని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆశ్చర్యపోతున్నారా? అదెలా సాధ్యమో తెలుసుకోవాలంటే ముందు కొబ్బరికీ.. బరువు తగ్గడానికీ ఎలాంటి సంబంధముందో తెలుసుకోవాలి..

కొబ్బరి పాలలోని ఆశ్చర్యకర బ్యూటీ-హెల్త్ బెనిఫిట్స్!

అధిక బరువు తగ్గించడానికి 'కొబ్బరి'లో ఉండే శక్తిసామర్థ్యాలు..!

అధిక బరువు తగ్గించే కొబ్బరి..!

అధిక బరువు తగ్గించే కొబ్బరి..!

కొబ్బరిలో తేలికగా జీర్ణం అవుతుంది. దానికి కారణం అందులో ఫ్యాటీ యాసిడ్లు తక్కువ కనుక తేలికగా జీర్ణం అయిపోతుంది. శరీరంలో కొవ్వు నిల్వలు ఏర్పడకుండా కూడా వుంటుంది. కొబ్బరి చాలా సులభంగా జీర్ణమయ్యే ఆహారం. జీర్ణవ్యవస్థలో ఉండే ఎంజైములు కొబ్బరిని జీర్ణం చేయడంతో పాటు దీనిలో ఉండే పోషకాలు, విటమిన్లు, ఖనిజాలను శరీరానికి అందించడంలో తోడ్పడతాయి. దాంతో శరీరంలో కొవ్వు ఏర్పడకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

అధిక బరువు తగ్గించే కొబ్బరి..!

అధిక బరువు తగ్గించే కొబ్బరి..!

2.కొబ్బరిలో 'మీడియం చెయిన్ ట్రైగ్లిజరైడ్స్ (ఎంసీటీస్)' అనే శ్యాచురేటెడ్ కొవ్వులుంటాయి. ఇవి శరీర బరువును తగ్గించడంలో తోడ్పడతాయి. అలాగే ఎంసీటీల వల్ల శరీరంలోని కొవ్వు చాలా వేగంగా కరగడంతో పాటు శరీరంలో కొవ్వు నిల్వల్ని తగ్గించడంలో తోడ్పడుతుందని కూడా రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో వెల్లడించారు.

అధిక బరువు తగ్గించే కొబ్బరి..

అధిక బరువు తగ్గించే కొబ్బరి..

3 ఇతర శ్యాచురేటెడ్ కొవ్వుల జీవక్రియకు, ఎంసీటీస్ జీవక్రియకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇవి కార్బొహైడ్రేట్లలా శరీరంలో కొవ్వు శాతాన్ని పెంచకుండా తగ్గించే ప్రయత్నం చేస్తాయి. అలాగే శరీరానికి శక్తిని కూడా అందిస్తాయి. కొబ్బరి తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీనివల్ల ఆహారం అధికంగా తినకుండా ఉంటాం. ఫలితంగా మాటిమాటికీ తినడం వల్ల లావెక్కుతామనే భయం కూడా ఉండదు.

అధిక బరువు తగ్గించే కొబ్బరి..

అధిక బరువు తగ్గించే కొబ్బరి..

4 అలాగే కొబ్బరి నూనెను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల.. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగి, చెడు కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయి. ఫలితంగా స్థూలకాయం బారిన పడతామనే భయం ఉండదు. వీటితో పాటు ఎవరైతే కొబ్బరిని ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటారో వాళ్లలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని ఓ పరిశోధనలో తేలిన అంశం.

అధిక బరువు తగ్గించే కొబ్బరి..

అధిక బరువు తగ్గించే కొబ్బరి..

5. అలాగే కొబ్బరి నూనెను మనం తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పొట్టభాగంలో ఉండే కొవ్వు తగ్గి ఫలితంగా నాజూగ్గా తయారయ్యే అవకాశం ఉందని మరో అధ్యయనం వెల్లడించింది.బరువు పెరగటం, ఆకలి, అలసటలకు సంబంధించిన కేండిడా అనే ఒక ఈస్ట్ ను కొబ్బరినూనె అరికడుతుంది.

అధిక బరువు తగ్గించే కొబ్బరి..

అధిక బరువు తగ్గించే కొబ్బరి..

6. కొబ్బరిపాలల్లో ఒమేగా త్రీ ఆమ్లాలు, ఒమేగా అమైనా యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రెండింటి కలయికతో.. కొబ్బరి పాలు సంపూర్ణ ఆరోగ్యం అందుతుంది. కొబ్బరిలో ఉండే ఎ, డి, ఇ, కె.. వంటి విటమిన్లు శరీరంలోని కొవ్వుల్ని కరిగించడంతో పాటు మనం తినే ఆహారంలో శరీరానికి అవసరం లేని కొవ్వుల్ని గ్రహించకుండా చేస్తాయి.

అధిక బరువు తగ్గించే కొబ్బరి..

అధిక బరువు తగ్గించే కొబ్బరి..

7. పొట్ట భాగంలో ఎక్కువగా కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమస్యను తగ్గించుకోవాలంటే కొబ్బరి నూనెను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. లేదంటే ఇలా కూడా ఓసారి ప్రయత్నించి చూడండి.

అధిక బరువు తగ్గించే కొబ్బరి..

అధిక బరువు తగ్గించే కొబ్బరి..

8. కొబ్బరి పాలు లేదా క్రీమ్‌ను తాజా పండ్లపై పూసుకుని తింటే అటు రుచిగానూ.. ఇటు శరీరాన్ని దృఢంగానూ ఉంచుకోవచ్చు. వారం రోజులు క్రమం తప్పకుండా.. కొబ్బరిబోండం తాగితే.. కొవ్వు శాతం క్రమంగా తగ్గుతుంది. కొబ్బరినీళ్లలో తక్కువ క్యాలరీలు ఉండటంతోపాటు ఆకలిని తగ్గిస్తుంది. ఎక్కువ పరిమాణంలో వీటిని తీసుకోవడం వల్ల.. తక్కువ ఆహారం తింటారు. దాంతో పాటు ఎనర్జీ కూడా అందుతుంది.

అధిక బరువు తగ్గించే కొబ్బరి..

అధిక బరువు తగ్గించే కొబ్బరి..

9. వంటల్లో కొబ్బరి లేదా కొబ్బరి నూనె వాడకం: మనం ఇంట్లో తయారు చేసుకునే చికెన్ ఫ్రై లాంటి వంటకాల్లో కూడా కొబ్బరి నూనెను వాడచ్చు. కొబ్బరి పొడిని కూడా వంటకాల్లో భాగంగా చేసుకోవచ్చు. బరువు తగ్గాలని క్యాలరీలు, కొవ్వులు చాలా తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం సర్వసాధారణం. కానీ దీనివల్ల కాసేపటి తర్వాత తిరిగి ఆకలేస్తూ ఉంటుంది. కాబట్టి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకుంటే జీవక్రియలు వేగవంతమవుతాయి. అలాగే కొబ్బరి జీర్ణమవడం వల్ల శక్తి ఉత్పత్తవుతుంది. ఈ శక్తి వల్ల శరీరంలోని క్యాలరీలు కరిగి బరువు పెరగకుండా జాగ్రత్తపడచ్చు.

అధిక బరువు తగ్గించే కొబ్బరి..

అధిక బరువు తగ్గించే కొబ్బరి..

10. మీ లోని జీవ క్రియ పెంచేటందుకుగాను వ్యాయామానికి ముందు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె ఒక గ్లాసు వేడి నీటిలో వేసి తాగితే బరువు కూడా తగ్గుతుంది.

అధిక బరువు తగ్గించే కొబ్బరి..

అధిక బరువు తగ్గించే కొబ్బరి..

11. కొబ్బరిలో పీచు పదార్థం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనికి నీటిని ఎక్కువగా గ్రహించే స్వభావం ఉంటుంది. మనకు బాగా దాహం వేసినప్పుడు తెలియకుండానే ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగుతాం. కొబ్బరి తినడం వల్ల ఈ విధంగా శరీరంలోకి చేరే నీటిశాతం తగ్గుతుంది. ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా కూడా ఉండచ్చు.

అధిక బరువు తగ్గించే కొబ్బరి..

అధిక బరువు తగ్గించే కొబ్బరి..

12. కొబ్బరి నీళ్లు ఇటు ఆరోగ్యానికీ.. అటు శరీరక దృఢత్వానికీ చాలా అవసరం. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తాయి. ఫలితంగా ఆరోగ్యంగా, దృఢంగా ఉండచ్చు.

English summary

How Coconut and Coconut Water Can Aid in Weight-Loss

One excellent and natural method that can be adopted for weight loss is to have coconut water. It increases the metabolic rate of the body thereby helping it burn sugar at a much faster rate. Coconut water can also be said to be one of the safest drinks to have. It is not only completely natural but also hygienic.
Story first published: Tuesday, December 22, 2015, 15:38 [IST]
Desktop Bottom Promotion