For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వారంరోజుల్లో కొబ్బరిబోండం తీసుకొచ్చే బెన్ఫిట్స్

|

ఎండలో తిరిగినా.. బాగా అలసటగా అనిపించినా.. ఠక్కున గుర్తొచ్చేది కొబ్బరిబోండం. దాహార్తీని తీర్చడమే కాదు.. మెండైన ఆరోగ్యప్రయోజనాలు అందిస్తుంది కొబ్బరిబోండం. ఒక వారంపాటు కొబ్బరిబోండం తాగితే మంచి ఫలితాలుంటాయంటున్నారు నిపుణులు.

ఏళ్లు గడిచినా... నాగరిత మారినా... మార్కెట్లలో రకరకాల కూల్ డ్రింగ్స్ వచ్చినా.. కొబ్బరిబోండానికి ఉన్న ప్రాధాన్యత మాత్రం తగ్గలేదు. రోజురోజుకీ కొబ్బరి బోండానికి ఆదరణ పెరుగుతోంది. కలుషితం లేని స్వచ్ఛమైన కొబ్బరి బోండం నీటిని సర్వరోగ నివారిణిగా భావిస్తారు. కొబ్బరిబోండం నీటిని ఒక వారం రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే.. శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

నిత్యం కొబ్బరిబోండం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో బ్యాక్టీరియాను బయటకు పంపి.. యూరినరీ ఇన్ఫెక్షన్లు రాకుండా ఇది తోడ్పడుతుంది. వైరస్ లతో పోరాడే శక్తి కూడా వీటికి ఉంది. శీతాకాలంలో కూడా కొబ్బరిబోండం తాగడం వల్ల.. జలుబు రాకుండా అరికడుతుంది.

శక్తినిస్తుంది

శక్తినిస్తుంది

కొబ్బరిబోండాన్ని ఒక వారం పాటు తీసుకుంటే తేడా మీకే తెలుస్తుంది. మునుపెన్నడూ లేని కొత్త శక్తి వస్తుంది.

ఆరోగ్యం

ఆరోగ్యం

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ని తొలగించి.. కిడ్నీల్లో రాళ్లను కరిగిస్తుంది. కాబట్టి వారం రోజులు కొబ్బరిబోండం తాగి చూడండి తేడా మీకే తెలుస్తుంది. కొత్త ఉత్సాహం.. ఆరోగ్యం పొందిన సంతృప్తి కలుగుతుంది.

జీర్ణశక్తి

జీర్ణశక్తి

వారం రోజుల తర్వాత మీ జీర్ఫవ్యవస్థలో వచ్చిన మార్పులు మీరు గమనిస్తారు. జీర్ణశక్తి మెరుగ్గా ఉండటానికి కొబ్బరి బోండం బాగా సహకరిస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన ఫైబర్ అందించడం చాలా కష్టం. కాబట్టి.. వారంరోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే.. సాధ్యమవుతుంది.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

వారం రోజులు క్రమం తప్పకుండా.. కొబ్బరిబోండం తాగితే.. కొవ్వు శాతం క్రమంగా తగ్గుతుంది. కొబ్బరినీళ్లలో తక్కువ క్యాలరీలు ఉండటంతోపాటు ఆకలిని తగ్గిస్తుంది. ఎక్కువ పరిమాణంలో వీటిని తీసుకోవడం వల్ల.. తక్కువ ఆహారం తింటారు. దాంతో పాటు ఎనర్జీ కూడా అందుతుంది.

తలనొప్పి

తలనొప్పి

తీవ్రంగా వేధించే తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. కొబ్బరినీళ్లకు హైడ్రేట్ చేసే గుణం ఉంటుంది.. కాబట్టి తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది. డీహైడ్రేషన్, హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు కొబ్బరినీళ్లు మంచి పరిష్కారం. డీహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పి తగ్గించుకోవాలంటే.. పానీయాలు మంచిది.

చర్మకాంతి

చర్మకాంతి

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చర్మ కాంతి పెరుగుతుంది. చర్మం నిర్జీవంగా మారి ఇబ్బంది పెడుతుంటే.. కొబ్బరినీళ్లు వారంపాటు తాగండి.. తేడా మీకే తెలుస్తుంది. మినరల్ వాటర్ లో.. కొకొనట్ వాటర్ మిక్స్ చేసి తాగినా మంచి ఫలితం ఉంటుంది.

యవ్వనం

యవ్వనం

క్యారెట్లు తినడానికి బద్దకంగా అనిపిస్తే.. కొబ్బరినీళ్లు తాగండి. ఇవి కంటిచూపు మెరుగుపరచడానికి తోడ్పడతాయి. కొబ్బరిబోండం తాగడం వల్ల.. హార్ట్ ఎటాక్ రావడానికి అవకాశాలు తక్కువ. చర్మంపై ముడతలు రావడం కూడా తగ్గి.. యంగ్ లుక్ తో మెరిసిపోతారు.

పిల్లలకు

పిల్లలకు

తల్లి పాలలో ఉండే లర్జిక్‌ యాసిడ్‌ కొబ్బరిబోండం నీళ్లలో ఉంటుంది. ఈ నీళ్లను పిల్లలు తాగితే మానసిక, శారీరక ఎదుగుదలకు చక్కగా పని చేస్తుంది.

గర్భిణీలు

గర్భిణీలు

గర్భిణీలు నిత్యం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గర్భాశయంలో ఉన్న సమస్యలు చక్కబడి, అండం ఎదుగుదలకు తోడ్పడుతుంది. సుఖ ప్రసవం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది.

English summary

Benefits Of Coconut Water: health tips in telugu

Daily consumption of coconut water has the ability to strengthen your immune system. It also has the ability to remove bacteria in the body that causes gum disease and urinary tract infections.
Story first published: Monday, October 19, 2015, 16:56 [IST]
Desktop Bottom Promotion