For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పనిచేయని 8 డైట్ చిట్కాలు

|

మనలో చాలామంది తమ జీవితకాలంలో ఒకసారి లేదా రెండుసార్లైనా డైట్ పాటించి ఉంటారు, కదా? మనం దాన్ని శ్రద్ధగా పాటించినా,లేకున్నా కూడా!

ఇప్పుడైతే, డైట్ అనే పదాన్ని చాలామంది వినగానే వెంటనే దాన్ని బరువు తగ్గటానికి సంబంధించినది అని ముద్ర వేసేస్తున్నారు.

'డైట్' మరియు 'బరువు తగ్గటం' అనే పదాలు దాదాపుగా పర్యాయపదాలుగా మారిపోయాయి, కానీ ఎవరైనా ఒక వ్యక్తి డైట్ అనేక కారణాల కోసం పాటించవచ్చు.

చాలా రకాల ఫలితాలనిచ్చే వివిధ రకాల డైట్లు ఉంటాయి.

ఉదాహరణకి, కొంతమంది బరువు తగ్గటానికి తక్కువ కొవ్వు ఉన్న డైట్ పాటిస్తే,కొంతమంది కండరాలు సైజు పెరిగేందుకు ఎక్కువ ప్రొటీన్ ఉన్న డైట్ పాటిస్తారు!

అలాగే, రోగనిరోధకత పెరగటానికి, మెటబాలిజం మెరుగుపర్చటానికి, కొన్ని ప్రత్యేక అనారోగ్య స్థితులను నియంత్రణలో ఉంచటానికి, వివిధ డైట్లు ఉన్నాయి.

డైట్ అంటే మీకు కావాల్సిన ఫలితాలను అందించటానికి రూపొందించి పాటించే కొన్ని ఆహారనియమాలు, అలవాట్లు పాటించడం.

డైట్ కఠినంగా పాటించడం కష్టం కావచ్చు, ప్రత్యేకంగా మొదట్లో, కానీ సహనమే దానికి సరైన పరిష్కారం!

అపోహలైన, తప్పుగా పాటించిన చాలా డైట్ చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కింద ఆ చిట్కాలేంటో తెలుసుకుని వాటిని పాటించడం మానేయండి!

1. డైట్ లు తాత్కాలికమైనవి

1. డైట్ లు తాత్కాలికమైనవి

అనేక పత్రికలు, వెబ్ సైట్లు మరియు మీ చుట్టూ కొంతమంది కూడా మీరు కొన్ని రోజులు లేదా నెలల పాటు, కావాల్సినంత బరువు తగ్గటానికి లేదా కావాల్సిన ఆకృతి పొందటానికి ఒక ప్రత్యేకమైన డైట్ పాటించి తర్వాత మానేయచ్చు అని చెప్తారు! కానీ ఈ చిట్కా తప్పు ఎందుకంటే ఏ డైట్ అయినా ఎప్పుడూ ఒకలా పాటిస్తేనే పనిచేస్తుంది! మీరు ఎప్పుడైనా దానిని పాటించడం మానేయగానే ఇంతకు ముందున్న ఆరోగ్య సమస్య మళ్ళీ రావచ్చు!

2. బరువు తగ్గటానికి ఆకలితో మాడటం

2. బరువు తగ్గటానికి ఆకలితో మాడటం

ప్రాచీనకాలం నుండి, అమ్మాయిలు సన్నగా మరియు ‘నాజూకుగా' ఉండాలని సమాజం ఆశిస్తూ వచ్చింది. అందుకని రాణులు, యువరాణులు, పెద్ద పెద్ద సోషల్ సర్కిల్స్ వాళ్ళు అందరూ స్లిమ్ గా కన్పించాలని తమని తాము ఆకలితో మాడ్చుకునేవారు. ఇప్పటికి కూడా చాలామంది మోడల్స్, వినోద పరిశ్రమకి చెందినవాళ్ళు, ఎవరైనా బరువు తొందరగా తగ్గాలనుకునేవాళ్ళు, పాటించేది ఇదే. కానీ ఈ పద్ధతి ఆరోగ్యాన్ని తీవ్రంగా పాడుచేస్తుంది, మీ మెటబాలిజాన్ని తగ్గిస్తుంది, తద్వారా భవిష్యత్తులో బరువు తగ్గే ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది!

3.’పండ్లు’ ఎక్కువవటం అనేది అసలు ఉండదు.

3.’పండ్లు’ ఎక్కువవటం అనేది అసలు ఉండదు.

మనందరికీ క్రమం తప్పకుండా పళ్ళను తినటం ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు. ఎందుకంటే పండ్లలో శరీరానికి అవసరమైన పోషకాలన్నీ ఉంటాయి. కానీ పరిశోధనల ప్రకారం పండ్లు రెండుసార్ల కన్నా ఎక్కువ తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఎందుకంటే చాలా పండ్లలో అధిక చక్కెర మరియు ఫ్రక్టోస్ ఉంటాయి!

4.అన్ని క్యాలరీలు ఒకటే

4.అన్ని క్యాలరీలు ఒకటే

ఎవరైనా బరువు తగ్గటానికి డైట్ పాటిస్తున్నప్పుడు, రోజుకి ఎన్ని క్యాలరీల ఆహారం తినాలో అంతే తింటున్నామో లేదో చూసుకోటానికి క్యాలరీలు లెక్కించటం సాధారణం. కానీ చాలామందికి తెలియనిది ఏంటంటే అన్ని క్యాలరీలు ఒకటే కావు! ఉదాహరణకి, ఐస్ క్రీమ్ లో ఉండే 100 క్యాలరీలు ఒక బౌల్ నిండా కాయగూరలలో ఉండే 100 క్యాలరీల కన్నా బరువు పెంచేవి!

5.కొవ్వుపదార్థాలు పూర్తిగా తొలగించేయండి

5.కొవ్వుపదార్థాలు పూర్తిగా తొలగించేయండి

ఇది కూడా చాలామంది బరువు తగ్గేటపుడు, నమ్మి పాటించే ఒక సాధారణ అపోహ. కొవ్వు పదార్థాలు ఉండే అన్ని ఆహార పదార్థాలను పూర్తిగా తినటం మానేస్తే తొందరగా బరువు తగ్గుతామనుకుంటారు. కానీ శరీరం సరిగ్గా పనిచేయటానికి, ఆరోగ్యం సరిగా ఉండటానికి, మంచి కొవ్వు పదార్థాలు చాలా అవసరం. అందుకని కొబ్బరినూనె, నెయ్యి, అవకాడో వంటి మంచి కొవ్వులను దూరం చేసుకుంటే పోషకలోపాలు తప్పవు.

6. రాత్రి 8 తర్వాత ఏదీ తినవద్దు

6. రాత్రి 8 తర్వాత ఏదీ తినవద్దు

మళ్ళీ ఇది కూడా బరువు తగ్గేవాళ్ళు చాలా మంది, ఏ ఆహారపదార్థాలు రాత్రి 8 గంటల తర్వాత తినకూడదనే నియమం పాటిస్తూ, ఆ సమయానికి ముందే భోజనం ముగిస్తారు. కానీ ఈ చిట్కాలో కొంచెం అపోహ కూడా ఉన్నది. రాత్రి భోజనం ఎప్పుడూ నిద్రపోయే సమయానికి మూడు గంటల ముందు తినాలి, ప్రత్యేకించి రాత్రి 8 కి ముందు అని కాదు. అందుకని, మీరు పడుకునేది రాత్రి 12కి అయితే, మీరు రాత్రి భోజనం 9కి కూడా చేయవచ్చు! ఇలా చేయటం వలన మీ శరీరానికి ఆహారాన్ని జీర్ణం చేసుకోటానికి పడుకునేముందు తగినంత సమయం దొరుకుతుంది.

7. భోజనం చేసేటప్పుడు మధ్యలో నీరు తాగటం వలన బరువు తగ్గుతారు

7. భోజనం చేసేటప్పుడు మధ్యలో నీరు తాగటం వలన బరువు తగ్గుతారు

చాలామంది ఈ డైట్ చిట్కాను పాటిస్తారు, భోజనం చేసేటప్పుడు మంచి నీళ్ళు తాగుతూ వుండటం వలన తక్కువ తిని, అలా బరువు కూడా తగ్గుతాం అనుకుంటారు. కానీ పరిశోధనల్లో తేలింది ఏమిటంటే, భోజనం చేసేటప్పుడు ఎక్కువ నీరు తాగటం వలన, కడుపులో జీర్ణరసాలను పల్చన అయి ఆహారం సులభంగా జీర్ణం కాదు. ఇది తర్వాత జీర్ణసమస్యలకు దారితీస్తుంది.

8.వ్యాయామం చేస్తే ఎక్కువ తినడానికి అవకాశం ఉంది

8.వ్యాయామం చేస్తే ఎక్కువ తినడానికి అవకాశం ఉంది

చాలామంది వ్యాయామం రోజూ చేస్తే, వాళ్ళకి ఏది కావాలంటే అది అధికంగా తినేయచ్చు, ఇక బరువు పెరగరు అనుకుంటారు. కానీ, క్రమం తప్పకుండా చేసే వ్యాయామం వలన కూడా ఒక పరిమితిలోనే కేలరీలు ఖర్చవుతాయి మరియు మీరు ఎక్కువగా తింటే, బరువు పెరిగి, జీర్ణ సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

English summary

8 Diet Tips That Don't Work

Many people follow different types of diets to reach different health goals. Sticking to a diet can be rather hard, especially at first, but perseverance is key! There are a number of diet tips that are just myths and people have been misled by them! Starving to lose weight and not having food after 8 PM may not help.
Story first published: Thursday, February 22, 2018, 16:00 [IST]