For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రాబ్ వాకింగ్ వల్ల కలిగే ఈ ఆరోగ్య ప్రయోజనాల గూర్చి మీకు తెలుసా?

క్రాబ్ వాకింగ్ వల్ల కలిగే ఈ ఆరోగ్య ప్రయోజనాల గూర్చి మీకు తెలుసా?

|

క్రాబ్ వాకింగ్ అనేది మీ శరీరమంతటినీ చైతన్యపరిచే శారీరక వ్యాయామం. ఇది మీ మొత్తం శరీరమంతటికీ ప్రయోజనకారిగా ఉంటుంది. ఒక ప్రత్యేక భంగిమలో సాధన చేయబడే ఈ క్రాబ్ వాకింగ్ వల్ల శరీరంలో ఉండే అదనపు కేలరీలను కరిగించి, మీ శరీరానికి నాజూకుతనాన్ని పెంపొందిస్తూ, మీ శరీరానికి & కండరాలకు టోనింగ్ చేయటంలో సహాయపడుతుంది.

మీ మోకాలు & తొడల మధ్య ఉండే 3 పృష్ఠ కండరాలు - ప్రత్యేకంగా చెప్పాలంటే మీ చేతులు, భుజాలు, వెన్ను, శరీర కేంద్ర భాగాలలో ఉన్న హంస్ట్రింగ్ కండరాలను బలపరుస్తాయి. అందువల్ల, ఇది మీ మొత్తం శరీరాన్ని బలోపేతం చేసే ఉత్తమ కార్డియో వ్యాయామాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

క్రాబ్ వాకింగ్ను ఇలా సాధన చేయండి :-

మొదటిగా, మీరు కుదురుగా కూర్చున్న తర్వాత, మీ చేతులు & కాళ్ళను బ్యాలన్స్ చేస్తూ మిగిలిన శరీరమును మీ ఇంటి పైకప్పును చూసేటట్లుగా ఉండే భంగిమలో ఉండాలి.

ఇప్పుడు మీరు మీ హిప్ను పై వైపుకు లేపి, మీ చేతులు & పాదాల సహాయంతో క్రాబ్ (పీత) భంగిమలో నడవాలి.

మీ అంతట మీరు కదిలేందుకు, కుడికాలు & ఎడమ చేతి సహాయంతో కుడి వైపుకు నడవటానికి ప్రయత్నించాలి. ఇలా మీ చేతులను కాళ్లను కదిలిస్తూ వేరువేరు దిశలలో కదలడానికి ప్రయత్నించాలి.

క్రాబ్ వాకింగ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :-

క్రాబ్ వాకింగ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :-

ఈ వ్యాయామం ద్వారా మీ చేతులు & కాళ్ళపై మీ శరీర బరువు బ్యాలెన్స్డిగా ఉండేటట్లు చేయగలదు. ఇలా ఇది మీ శరీరాన్ని బలపరచడంలో సహాయపడుతుంది.

ట్రెడిషనల్ క్రాబ్ వాక్, సుపైన్ క్రాబ్ వాక్, సుమో క్రాబ్ వాక్ & ప్రోన్ క్రాబ్ వాక్ వంటి వివిధ రకాల క్రాబ్ వాక్లు ఉన్నాయి.

కేలరీలను కరిగించడంలో సహాయపడుతుంది :

కేలరీలను కరిగించడంలో సహాయపడుతుంది :

ఈ క్రాబ్ వాక్ను సాధన చేస్తూ ముందుకు, వెనకకు కదలడం వలన చేతి, పొట్ట, తొడ ప్రాంతాలలో ఉన్న కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఇది కార్డియో వ్యాయామము యొక్క ప్రతిరూపం. ఈ వ్యాయామాన్ని సాధన చేయటం వల్ల మీకు ఎక్కువ చెమటను పట్టించి, తద్వారా మీ గుండెకు వేగంగా రక్తాన్ని సరఫరా చేస్తుంది. మీరు ఈ భంగమను ఎక్కువగా సాధన చెయ్యడం వల్ల మీరు మరిన్ని కేలరీలను కోల్పోతారు.

 మీ ఆరోగ్యాన్ని మరింత ఎక్కువగా మెరుగుపరుస్తుంది:

మీ ఆరోగ్యాన్ని మరింత ఎక్కువగా మెరుగుపరుస్తుంది:

ఇది పూర్తి శరీర వ్యాయామంగా ఉండటం వల్ల మీ వెన్ను, కాళ్ళు & కడుపు ప్రాంతంలో ఉండే కండరాలతో పాటు - మీ భుజంను కూడా మరింత బలపరుస్తుంది.

ఈ భంగిమ మీ శరీరానికి చాలా మంచిది:

ఈ భంగిమ మీ శరీరానికి చాలా మంచిది:

మీ శరీరాన్ని సరైన స్థితిలో ఉంచడంలో ఈ వ్యాయామం మీకు చాలా మంచిది. మీ శరీర ఆకృతిని మెరుగుపరచడంతో పాటు, ఇది మీ శరీరమును బ్యాలన్స్ గా ఉంచడంలో బాగా సహాయపడుతుంది.

మీ శరీరాన్ని టోనింగా ఉంచుతుంది :

మీ శరీరాన్ని టోనింగా ఉంచుతుంది :

ఎలాంటి వ్యాయామ పరికరాలు అవసరం లేకుండా మీరు మీ శరీరాన్ని టోన్ చెయ్యడం కోసం చూస్తున్నట్లయితే, క్రాబ్ వాకింగ్ అనేది చాలా మంచి మార్గం. ఈ వ్యాయామం, మీ శరీరంలోని అన్ని కండరాల సమూహాలను ప్రభావితం చేస్తూ మిమ్మల్ని మరింత ఫిట్గా చేస్తుంది.

ఈ వ్యాయామాన్ని సాధన చేయడం కోసం మీకు ఏ రకమైన వ్యాయామ పరికరాలు అవసరం లేదు. ఇది మీ శరీరం లోపలా వెలుపలా అవసరమయ్యే జాగింగ్, వాకింగ్, అలాగే కార్డియోవాస్క్యులర్ వ్యాయామాల వంటి మాదిరిగానే ఉంటుంది.

ఈ వ్యాయామాన్ని రోజుకు 15 నిమిషాల చెప్పున నెల రోజుల పాటు సాధన చేయాలి. మీరు ఈ వ్యాయామాన్ని ఎక్కువ వేగంతో సాధన చేయటం వల్ల మీరు బరువును త్వరగా కోల్పోయే అవకాశాన్ని కల్పిస్తారు.

ఈ వ్యాయామాన్ని మహిళలు, పురుషులతో పాటు పిల్లలు కూడా సాధన చేయవచ్చు ! ఈ సరదా వ్యాయామాన్ని పిల్లలు సాధన చేయటం వలన, భవిష్యత్తులో వారికి అనేక విధాలుగా లబ్ధి చేకూరుస్తూ, మీ శరీరాన్ని మంచి ఆకృతిలో ఉంచుతుంది.

కాబట్టి మీరు ఈ వ్యాయామాన్ని ప్రతిరోజు తప్పకుండా సాధన చేయటం వల్ల మీ శరీరంలో చోటు చేసుకున్న తేడాలను మీరే స్పష్టంగా గమనించగలుగుతారు. కేలరీలను కరిగించడం, మీ కీళ్ళును & కండరాల సమూహాలను బలోపేతం చేయటం, మీ శరీరాన్ని టోనింగ్ చేయడం & మీ శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా మెరుగుపరచడానికి గానూ మీరు ఏ సమయంలోనైనా ఈ ఆహ్లాదకరమైన వ్యాయామమును ఎంపిక చేసుకోవడం చాలా మంచిది. మీరు జిమ్కు వెళ్లి వ్యాయామ పరికరాలతో తీవ్రంగా కష్టపడకూడదనుకుంటే, మీరు ఈ క్రాబ్ వాక్ను ఆచరించడం చాలా ఉత్తమము.

English summary

4 Amazing Benefits Of Crab Walking Exercises On Your Body

Crab walking is one fun workout which is an all-in-one exercise that improves your body's flexibility, boosts joint health, and helps in burning calories in multiple body regions like the abdomen, thighs, and arms. Crab walking also betters your posture. Do this workout for 15 minutes daily for a month's time to experience its benefits.
Story first published:Saturday, August 25, 2018, 16:53 [IST]
Desktop Bottom Promotion