For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెప్పులు లేకుండా ఒట్టి పాదాలతో నడస్తే పొందే అద్భుతమైన ప్రయోజనాలు ..!!

|

చాల మంది ఖరీదైన చెప్పులు వేసుకుని రోజంతా తిరిగేస్తుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా పాదరక్షల్ని వదలరు. ఆరోగ్యవంతమైన పదాల రహస్యం చెప్పులు లేకుండా రోజులో కొంతసేపైనా తిరగడమే అంటున్నారు నిపుణులు. షూలు ధరించే సగటు వ్యక్తుల కంటే ధరించని సగటు వ్యక్తుల పాదాలు చాలా స్ట్రాంగ్ గా , హెల్తీగా ఉంటాయి.

ప్రతి రోజూ కొంత సమయమైనా చెప్పులు లేకుండా నడవాలి. షూ ధరించే వారి పాదాల పై ప్రతి అడుగుకూ మెకానికల్ స్ట్రెస్ పడుతుంది. సెన్సిటివిటీ కోల్పోవడం, కండరాల శక్తి తగ్గడం జరుగుతుంది. కాబట్టి, ఇంట్లోనూ, బయట క్షణమైనా చెప్పులు విడవకుండా నడిచేవారు సైతం రోజులో కొద్దిసేపైనా వాటిని విప్పేసి నడవడం ఉత్తమం.

ఎందుకంటే మన పాదాల్లో ఎవరూ ఊహించని విధంగా 72 వేల నరాల కొసలు ఉన్నాయి. ఎక్కువ సేపు షూ వాడడం వల్ల సున్నితమైన ఈ నరాలు చచ్చుబడిపోతాయి. మట్టిపైన, ఫ్లోర్ పైన నడవడం వల్ల నరాల్లో రక్తప్రసరణ పెరుగుతుంది. తద్వారా పదాలు గట్టిపడుతాయి. అలసటను కోల్పోతాయి. పార్కులకు వెళ్లినప్పుడు చెప్పుల్ని విడిచి అక్కడున్న పచ్చికపై ఐదారు నిముషాలు నడవండి.

ఇలా నడవడం వల్ల భూమికి దగ్గరగా నడిచిన అనుభూతి కలుగుతుంది. ఎంతో సంతోషం కూడా కలుగుతుంది. పాదాలు అలసట కోల్పోతాయి. అలాగే బీచ్ లకు వెళ్లినప్పుడు కూడా చాలా మంది పాదరక్షలు ధరిస్తారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు.ఇసుకలో పాదాలతో నడిస్తే చాలా మంచిదని గ్రహించండి,. ఇలా పాదలతో నడవడం వల్ల శక్తి కరిగిపోయి, ట్రెడ్ మిల్ చేసినట్టుగా ఉంటుంది. పాదాలు కూడా సాప్ట్ గా తయారవుతాయి, మీ మూడ్ కూడా మారుతుంది.

చెప్పులు లేకుండా ఉత్త పాదాలతో నడిస్తే కాళ్లకు గాయాలు కావట. నడక స్థిరంగా ఉంటుందట. శరీర భంగిమ కూడా కరక్ట్‌గా ఉంటుందిట. అంతేకాదు శరీరాన్ని సరిగా బ్యాలెన్స చేసుకోగలుగుతారట. అందుకే ఇంట్లో, ఆఫీసులో, ఆరుబయట చెప్పుల్లేకుండా హాయిగా తిరగమంటున్నారు నిపుణులు. వీటితో పాటు మరికొన్ని అద్భుతమైన ప్రయోజనాలున్నాయి.. అవేంటో తెలుసుకుందాం..బాడీని, జాయింట్స్ ను, మొబిలిటిని, మెంటల్ స్టేటస్ ను కాపాడుతకుందాం..

 బ్రెయిన్ బ్యాలెన్స్ చేస్తుంది:

బ్రెయిన్ బ్యాలెన్స్ చేస్తుంది:

ఫ్లోర్ కు పాదాలు ఎక్కువ అటాచ్ అవ్వడం వల్ల బ్రెయిన్ బ్యాలెన్స్ అవుతుంది. దాంతో నాడీవ్యవస్థ మరింత చురుకుగా పనిచేస్తుంది.

మన కదలికలు పాదాల్లోని కండరాలను స్థిరంగా ఉండేట్టు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. అంతేకాదు పొత్తి కడుపులోని కండరాలపై కూడా వీటి ప్రభావం ఉంటుంది. కాళ్లలోని, పాదాల్లోని చిన్న, పెద్ద కండరాల మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. వీటి గురించి న్యూరల్‌ కనెక్షన ద్వారా బ్రెయినకి సమాచారం చేరుతుంది. ఇవి దెబ్బతింటే గాయాలు బాగా తగిలే అవకాశం ఉంది.

 కాళ్ళ కండరాలకు ఎక్కువ బలాన్ని ఇస్తుంది:

కాళ్ళ కండరాలకు ఎక్కువ బలాన్ని ఇస్తుంది:

బేర్ ఫూట్ తో నేల మీద నడవడం వల్ల కండరాలు బలపడుతాయి. అంతేకాదు షూస్‌ వేసుకోవడం వల్ల కూడా పాదాల కండరాల మధ్య ఉండే సహజసిద్ధమైన లింకు దెబ్బతింటుంది. షూ కింద ఉండే బిగ్‌ సోల్‌ వల్ల పాదాల సహజసిద్ధమైన సమతులత దెబ్బతింటుంది. కండరాలు సరిగా పనిచేయకపోతే లిగ్మెంట్స్‌ మీద, ఎముకల మీద, టెన్డెన్స మీద ప్రభావం పడి గాయాల రిస్కు పెరుగుతుంది. పాదాలు, కాళ్లు , కండరాలు దృఢంగా పనిచేయాలంటే చెప్పుల్లేకుండా నడవాలి. ఇలా చేయడం వల్ల కండరాలు బలపడతాయి. వీటితోపాటు కండరాలు గట్టిపడడానికి రోజూ వ్యాయామం కూడా చేయాలి. కానీ చలికాలంలో మటుకు షూస్‌ లేకుండా ఉత్త కాళ్లతో నడవడం, పరిగెట్టడం రెండూ ఏమాత్రం మంచిది కాదు.

పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది:

పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది:

పిల్లల్లో డయాబెటిస్ మరియు ఓబేసిటి రెండూ ప్రమాదకరమైనవే . ఇటువంటి సమస్యలు పిల్లల్లో పెరగకూడదనుకుంటే, పిల్లలను ఒట్టి పాదాలతో నేల మీద నడవమనడం, ఆటలాడుకోవడం , పరుగెత్తడం వంటివి చేయమనాలి.దాంతో పిల్లలోబ్రెయిన్ షార్ప్ గా ఉంటుంది.

పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి:

పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి:

చెప్పులు లేకుండా ఒట్టి పాదాలతో నడవడం వల్ల పాదాలు గ్రేట్ షేప్ లో ఉంటాయి. మరియు ఆర్ధ్రైటిస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

రక్త ప్రసరణ పెరుగుతుంది:

రక్త ప్రసరణ పెరుగుతుంది:

చెప్పులు లేకుండా ఒట్టి పాదాలతో నడవడం వల్ల కాళ్ళల్లో పాదాల్లో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. జాయింట్స్ లో నొప్పి, వాపులను తగ్గిస్తుంది. వెరీకోస్ వీన్స్ ను తగ్గిస్తుంది.

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

బేర్ ఫూట్ తో ఫ్లోర్ మీద నడవడం వల్ల పాదాల క్రింది భాగంలో నాడులను క్రమబద్దం చేసి, బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది.

వాపులను తగ్గిస్తుంది:

వాపులను తగ్గిస్తుంది:

ఫ్రీరాడికల్స్‌ అనే పదం వినే ఉంటారు. ఇవో రకం రసాయనాలు. సూర్యరశ్మిలో, ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల్లో, సిగరెట్‌ పొగల ద్వారా మన చుట్టూ వ్యాపించి ఉంటాయి. ఓ రకంగా ఇవి మన జీవక్రియకీ(మెటబాలిజం) ఉపయోగపడతాయి. కానీ మోతాదు మించితే అనేక వ్యాధులూ, వాపులూ, నొప్పులకీ కారణమవుతాయి. ఫ్రీరాడికల్స్‌ అలా శ్రుతిమించకుండా చూసే శక్తి మట్టికి ఉందంటున్నారు . నిపుణులు. ముఖ్యంగా మట్టిపై నడక శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్‌లని పెంచి ఫ్రీరాడికల్స్‌ని కట్టడి చేస్తుందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ఓ పరిశోధన ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దాంతో క్యాన్సర్, డయాబెటిస్, ఆస్త్మా, కార్డియో వాస్కులర్ మొదలగు సమస్యలను తగ్గించుకోవచ్చు.

 శరీర భంగిమను మెరుగుపరుస్తుంది:

శరీర భంగిమను మెరుగుపరుస్తుంది:

ఫ్యాషన్ గా షూలను ధరించడం వల్ల శరీరం భగిమకు మంచిది కాదుజ. బాడీ షేప్ లో మార్పులు కనిపిస్తాయి. ఇలాంటి షూలను వేసుకోవడం వల్ల బాడీ లోయర్ పార్ట్ మీ స్ట్రెస్ ఎక్కువ పడటం వల్ల బాడీ షేప్ పోతుంది కాబట్టి, బేర్ ఫూట్ తో నడవడం వల్ల బాడీ షేప్ ను మెరుగుపరుచుకోచ్చు.

నిద్రలేమి సమస్యలు :

నిద్రలేమి సమస్యలు :

నిద్రలేమి సమస్యకు మన శరీరంలో కార్టిసాల్‌ హార్మోనే కారణమంటారు నిపుణులు. ఇది అవసరానికంటే ఎక్కువగా.. అదీ రాత్రివేళల్లో ఎక్కువగా స్రవిస్తే కంటిపై కునుకు రాదు. అందుకే దీన్ని ‘ఒత్తిడి హార్మోన్‌' అనీ అంటుంటారు. ఒట్టి పాదాలతో నడవడం ఆ హార్మోన్‌ని నియంత్రిస్తుందని చెబుతున్నారు నిపుణులు. జర్నల్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ అండ్‌ కాంప్లిమెంటరీ మెడిసిన్‌లో ఇటీవల ప్రచురించిన ఓ పరిశోధన పేర్కొన్న అంశమిది.

ఆ ఇబ్బందుల్లేకుండా :

ఆ ఇబ్బందుల్లేకుండా :

కొందరమ్మాయిల్లో బహిష్టుకి ముందు కడుపుబ్బరం, తలనొప్పీ, నీరసం వంటి సమస్యలుంటుంటాయి. దీన్నే ప్రీ మెనుస్ట్రువల్‌ సిండ్రోమ్‌(పీఎంఎస్‌) అంటారు. ఈ సమస్యకు నేలపై నడవడం చక్కని ఉపశమనమంటున్నారు నిపుణులు.

చివరిగా ఓ మాట.. :

చివరిగా ఓ మాట.. :

ఒట్టి పాదాలతో నడవడమంటే.. మట్టి, ఇసుక, గడ్డిపైనా... పెయింటూ, ఇతర పైపూతలేమీ లేని ఇటుకలపైనా నడవడమే! టైల్సూ, సిమెంటు దిమ్మెలూ, కొయ్యతో ఏర్పాటుచేసిన నేలపై నడిస్తే పెద్ద ఫలితమేదీ ఉండదంటున్నారు నిపుణులు.

English summary

Do You Know That Walking Barefoot Gives Us A Whole Lot Of Health Benefits? Here Are 10 Of Them

Walking barefoot is something we generally avoid, as it can cause injury or infection to our legs.But always remember that in ancient days, when the earliest predecessor of the modern-day shoe was not invented, people used to cover every distance barefoot and yet they lived healthily.
Story first published: Friday, October 7, 2016, 13:45 [IST]
Desktop Bottom Promotion