For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోడల్స్ స్లిమ్ సీక్రెట్ వెనక ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి ?

By Nutheti
|

లావుగా ఉండటం, బరువు పెరగడం, సరైన శరీరాకృతి లేకుండా ఉండటం చాలా మంది మహిళలను ఇబ్బందిపెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఫ్యాషన్ మోడల్స్ ని చూసి అబ్బా.. వీళ్లు ఇంత స్మార్ట్ గా ఎలా మెయింటెయిన్ చేస్తున్నారో అని చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటారు కదూ. అలా స్లిమ్ అండ్ ఫిట్ గా ఉండటానికి వాళ్లు చాలా కష్టపడతారు.

వ్యాయామంతో పాటు మోడల్స్ డైట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు కాబట్టే.. అంత ఫిట్ అండ్ హెల్తీగా ఉంటారు. మోడల్స్ సన్నగా ఉండటం వాళ్ల ప్రొఫెషన్ లో ఒక భాగం. కాబట్టి మోడల్స్ ఆరోగ్యంపైన కూడా కేర్ తీసుకుంటారు. అందుకే న్యూట్రీషన్ ఫుడ్ తో పాటు, కేలరీలు తక్కువగా ఉన్న ఆహారాన్నే ఎంచుకుంటారు.

నాజూకు అమ్మాయిలకు హాట్ లుక్ తీసుకొచ్చే శారీ స్టైల్స్ ఏంటి ? నాజూకు అమ్మాయిలకు హాట్ లుక్ తీసుకొచ్చే శారీ స్టైల్స్ ఏంటి ?

అయితే ఇలా స్లిమ్ అండ్ ఫిట్ గా ఉండాలనే నచ్చిన పద్ధతులు మాత్రం ఫాలో అవకూడదు. ఏది చేసినా.. హెల్త్ పై ప్రభావం పడకుండా జాగ్రత్త పడాలి. వ్యాయామంతో పాటు ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల స్లిమ్ గా ఉండచ్చో తెలుసుకుందాం. స్లిమ్ గా, అందంగా కనిపించడానికి మోడల్స్ ఫాలో అయ్యే ఫుడ్ హ్యాబిట్స్ ఏంటో ఓ లుక్కేద్దాం..

మంచి నీళ్లు

మంచి నీళ్లు

బరువు పెరగకుండా పొట్టనింపుకునే మార్గం మోడల్స్ బాగా తెలుసు. అందుకే ఎక్కువ మోతాదులో నీళ్లు తాగుతారు. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.. అలాగే స్కిన్ హెల్తీగా, అందంగా ఉంటుంది.

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్

వాల్ నట్స్, పిస్తా, పీ నట్స్, కిస్ మిస్, బాదం వంటి డ్రై ఫ్రూట్స్ ని స్నాక్ రూపంలో మోడల్స్ తీసుకుంటారు. ఇవి ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.

హెర్బల్ టీ

హెర్బల్ టీ

గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తాగడం వల్ల బరువు పెరగడాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఫ్యాషన్ గాల్స్ ఈ టిప్ ని క్రమం తప్పకుండా ఫాలో అవుతారు.

అవకాడో

అవకాడో

అవకాడోలో ఫ్యాట్ ఉంటుంది. కానీ అది మంచి ఫ్యాట్ కాబట్టి ఆరోగ్యానికి మంచిది. అందుకే ఫ్యాషన్ మోడల్స్ రోజూ అవకాడో తీసుకుంటారు.

జ్యూస్

జ్యూస్

ఫ్యాషన్ మోడల్స్ ముందుగా ఫ్రూట్, వెజిటబుల్ జ్యూస్ లకు ప్రాధాన్యమిస్తారు. అందుకే మోడల్స్ స్లిమ్ గా, ఫిట్ గా, ఎట్రాక్టివ్ గా కనిపిస్తారు.

చేపలు

చేపలు

చేపలు బాగా తీసుకుంటారు. ముఖ్యంగా సాల్మన్ చేపలకు మోడల్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి మెంటల్ షార్ప్ నెస్ ని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే స్లిమ్ గా ఉండటానికి సహాయపడతాయి.

గ్రీన్ స్మూతీస్

గ్రీన్ స్మూతీస్

మోడల్స్ ఎందుకు ఎప్పుడూ సైజ్ జీరోలోనే కనిపిస్తారు అంటే.. వాళ్లు హెల్తీగా ఉండే స్మూతీస్ తీసుకుంటారు. ఇందులో తక్కువ క్యాలరీలు, ఎక్కువ విటమిన్స్, ఫైబర్, ప్రొటీన్స్, మినరల్స్, క్యాల్షియం ఉంటాయి. ఇవి హెల్తీగా ఉండటానికి సహకరిస్తాయి.

డార్క్ చాకొలెట్

డార్క్ చాకొలెట్

డార్క్ చాక్లెట్స్ మంచి రిలాక్సేషన్ ని ఇస్తాయి. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఫిట్ గా ఉండాలని కోరుకునే మోడల్స్ మిల్క్ చాక్లెట్స్ కాకుండా.. డార్క్ చాక్లెట్స్ నే ఇష్టంగా తింటారు.

కూరగాయలు

కూరగాయలు

చాలా మంది మోడల్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటారు. వీటిలో కావాల్సిన మోతాదులో పోషకాలు ఉంటాయి. అవి సరైన శరీరాకృతిలో ఎలాంటి మార్పు తీసుకురాకుండా ఉండటానికి తోడ్పడతాయి.

ఫ్రూట్స్

ఫ్రూట్స్

అందం, ఆరోగ్యం కాపాడుకోవడానికి ఫ్రూట్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అందుకే మోడల్స్ ఫుడ్ లిస్ట్ లో ఫ్రూట్స్ కి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫ్రై చేసిన స్నాక్ ఐటమ్స్ ని మనం ఇష్టపడతాం. కానీ మోడల్స్ అయితే తాజా పండ్లనే స్నాక్స్ లేదా సలాడ్స్ రూపంలో తీసుకుంటారు. అందులో కివి, గ్రేప్, ఆరెంజ్, యాపిల్, బనానా, స్ర్టాబెర్రీస్ ఎక్కువగా తీసుకుంటారు.

English summary

10 Foods Fashion Models Eat To Stay Slim

Do you think that it is easy to stay thin and fit at the same time? Becoming a fashion model with a perfect figure is not an easy task. This takes a lot of effort and commitment. Apart from the daily beauty routines and exercise regimen, fashion models should take extra care about what they eat.
Story first published: Thursday, December 10, 2015, 16:43 [IST]
Desktop Bottom Promotion