For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే 10 బ్రిలియంట్ నైట్ ఫుడ్స్..!!

|

ఈ మద్య కాలంలో బరువు తగ్గాలని ఆకాంక్ష ఉన్నవారు చాలా మందే ఉన్నారు. బరువు తగ్గించుకొనే క్రమంలో మీల్స్ స్కిప్ చేస్తుంటారు. ముఖ్యంగా డిన్నర్ కు ఏం తీసుకోకుండా అలా కాలి పొట్టతో పడుకుంటుంటారు. అయితే ఇలా ఖాలీ పొట్టితో నిద్రపోవడం మంచిదని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా నో అనే చెప్పాలి....

దినచర్యలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఎంతో ముఖ్యమో..రాత్రి డిన్నర్ కూడా అంతే ముఖ్యం. డిన్నర్ స్కిప్ చేయడం వల్ల, మధ్యహ్నాం తీసుకున్న భోజనానికి-రాత్రి ఏమి తీసుకోకపోవడం వల్ల మరుసటి రోజు బ్రేక్ ఫాస్ట్ తీసుకొనే వరకు గ్యాప్ (ఎక్కువ సమయం)ఉంటుంది. ఈ గ్యాప్ బరువు తగ్గించడానికి బదులు...అనేక అనారోగ్య సమస్యలకు గురిచేస్తుంది.

ఈ రోజు మద్యహ్నా భోజనానికి, రేపు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకొనేంత వరకూ మద్య ఉన్న గ్యాప్ ఎక్కువగా ఉండటం వల్ల పొట్టలో గ్యాస్ చేరుతుంది. ఎసిడిటి, వికారం, వీక్ నెస్, నిద్రలేమి సమస్యలు వంటి మరికొన్ని సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి, బరువు తగ్గించుకోవడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటి? ఖచ్చితంగా డిన్నర్ కూడా చేయాలి. బరువు తగ్గాలనుకునే వారు కూడా లైట్ గా, ఎక్కు పోషకాలున్న హెల్తీ డిన్నర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటం మాత్రమే కాదు, బౌల్ మూమెంట్ క్లియర్ గా ఉంటుంది. బాగా నిద్ర పడుతుంది.

నిద్రించడానికి ముందు ఫాలో అవ్వాల్సిన వాటిలో ముఖ్యంగా హై క్యాలరీ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. ఇది కనుక ఖచ్చితంగా అనుసరించినట్లైతే ఖచ్చితంగా బరువు తగ్గించుకోగలుగుతారు. అలా హెల్తీగా బరువు తగ్గించుకోవడానికి సహాయపడేందుకు 10 ఎఫెక్టివ్ ఫుడ్స్ ఉన్నాయి. ఈ 10 బ్రిలియంట్ నైట్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అధికబరువు భయమే ఉండదు. మరి ఆ బ్రిలియంట్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం..

1. హైఫైబర్ సెరల్స్ మరియు పాలు:

1. హైఫైబర్ సెరల్స్ మరియు పాలు:

ఒక బౌల్ సెరల్స్(ఓట్స్ )కు లోఫ్యాట్ మిల్క్ మిక్స్ చేసి రాత్రి డిన్నర్ కు తీసుకోవడం వల్ల పొట్ట ఫుల్ గా ఉంటుంది. నిద్రబాగా పడుతుంది,. అదే సమయంలో క్యాలరీలు కరిగి, ఫ్యాట్ కరిగిస్తాయి. దాంతో బరువు తగ్గడం తేలికవుతుంది.

2. అవొకాడో:

2. అవొకాడో:

2. అవొకాడో:

3. అరటిపండ్లు:

3. అరటిపండ్లు:

అరటిపండు మోస్ట్ హెల్తీ నైట్ స్నాక్. ఎందుకంటే ఇందులో ఫైబర్, పొటాషియం, విటమిన్స్, మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మజిల్ క్రాంప్స్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. నిద్ర బాగా పడుతుంది.

4. నట్స్:

4. నట్స్:

నట్స్ తినడం వల్ల ముఖ్యంగా బాదం, వాల్ నట్స్ వంటివి పొట్ట నిండుగా ఉన్న బావన కలుగుతుంది, ఇది నైట్ టైమ్ బెస్ట్ స్నాక్. వీటిలో న్యూట్రీషియన్స్ మరియు ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. ఆకలి కాకుండా సాటిస్ఫై చేస్తుంది.

5. బ్రెడ్ :

5. బ్రెడ్ :

హోల్ గ్రైన్ బ్రెడ్ ను నైట్ టైమ్ ఫుడ్ గా తీసుకోవడం మంచిది. ఇందులో ఫైబర్, విటమిన్స్, మరియు మినిరిల్స్ ఎక్కువగా ఉంటాయి. క్యాలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

6. పెరుగు:

6. పెరుగు:

పెరుగు ముఖ్యంగా లోఫ్యాట్ పెరుగులో కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్ మిక్స్ చేసి రాత్రి నిద్రించడానికి ముందు తినడం వల్ల ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మరియు ఫ్యాట్స్ శరీరానికి సరిపడా అందుతాయి మరియు బ్లడ్ షుగర్ వెల్స్ కంట్రోల్ చేస్తాయి.

7. వార్మ్ మిల్క్ మరియు తేనె:

7. వార్మ్ మిల్క్ మరియు తేనె:

ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి రాత్రి పడుకోవడానికి ముందు తాగడం వల్ల మెలటోనిన్ రిలీజ్ చేసి బాడీ టిష్యులు ఏర్పడేందకు సహాయపడుతుంది. ఇది శరీరానికి విశ్రాంతి కల్పించే హార్మోన్, అలాగే బ్లడ్ షుగర్స్ కంట్రోల్ చేస్తుంది.

8. ఆపిల్ విత్ పీనట్ బటర్:

8. ఆపిల్ విత్ పీనట్ బటర్:

ఇది యమ్మీ స్నాక్ మాత్రమే కాదు, ఆపిల్ మరియు పీనట్ బట్టర్ లో విటమిన్స్ మరియు క్యాల్షియం ఎక్కువ. బెస్ట్ నైట్ టైమ్ స్నాక్ . అన్ని ఏజ్ గ్రూప్ ల వారికి మంచిది.

9. క్యారెట్స్ :

9. క్యారెట్స్ :

రాత్రి నిద్రించడానికి ముందు క్యారెట్ జ్యూస్ లేదా క్యారెట్ ముక్కలు తినడం వల్ల బెస్ట్ నైట్ టైమ్ స్నాక్ మాత్రమే కాదు, హెల్తీ ఫుడ్. ఇందులో కెరోటిన్, పొటాషియం, మరియు విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. నిద్రపట్టడానికి , మొత్తం ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

10. గ్రీన్ లీఫి వెజిటేబుల్ :

10. గ్రీన్ లీఫి వెజిటేబుల్ :

ఆకుకూరలు, కేల వంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ నైట్ టైమ్ తీసుకోవడం మంచిది. వీటిలో ఫొల్లెట్ అధికంగా ఉంటుంది. ఇది అలసటను తగ్గిస్తుంది మరియు మంచి నిద్రపడుతుంది.

English summary

10 Brilliant Night Foods To Be Included In Your Diet

You are on the look out to lose weight and the first thing you do is skip your meal, especially dinner. But do you think it is the right way to lose weight? Absolutely no.
Story first published:Tuesday, August 9, 2016, 14:36 [IST]
Desktop Bottom Promotion