For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాయధాన్యాలతో పొందే అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్

By Super
|

కాయధాన్యాలేంటి కొత్తగా ఉందే అనుకుంటున్నారా ? ఇవి నిత్యం మనం ఉపయోగించేవే. కాయల ద్వారా ఉత్పత్తి అయ్యే వాటిని కాయ ధాన్యాలు అని పిలుస్తారు. అంటే కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు

వంటివన్నీ కాయధాన్యాల కిందకు వస్తాయి. కాయధాన్యాలలో కేలరీలు తక్కువగా, పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. అందుకే, కాయధాన్యాలు శాఖాహారులు, బరువు తగ్గాలి అనుకొనే వారికి సరైన ఆహారం.

వీటిని డైట్ లో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గడం చాలా తేలికైన పని.

కాయధాన్యాలలో ఫోలేట్, పొటాషియం, నియాసిన్, రాగి, ఇనుము, మాంగనీసు, విటమిన్లు B, K, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఫైబర్ తో నిండి ఉంటాయి. కాయధాన్యాలు సేవించడం వల్ల

రోజుకి అవసరమైన ఫైబర్ అందుతుంది. రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న కాయధాన్యాల ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చో చూద్దాం..

ఆరోగ్యకరమైన ఆహారంలో చిక్కుళ్లు చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందువలన మీ ఆహారంలో చిక్కుళ్లతో పొందే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లిస్ట్ చాలానే ఉంది. అవేంటో

ఇప్పుడో లుక్కేద్దాం..

కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్

కాయధాన్యాల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడంతో పాటు కార్డియాక్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

హార్ట్ హెల్త్

హార్ట్ హెల్త్

కాయధాన్యాలు ఆరోగ్యానికి మంచిది. ఇవి హార్ట్ హెల్త్ కి ఉపయోగపడే.. ఫోలేట్, మెగ్నీషియం కలిగి ఉంటాయి. ఫోలేట్ వల్ల గుండె వ్యాధిని నియంత్రించవచ్చు. మెగ్నీషియం రక్త ప్రవాహం మెరుగుపరుస్తుంది.

జీర్ణవ్యవస్థ

జీర్ణవ్యవస్థ

కాయధాన్యాల వల్ల మలబద్ధకం, పైల్స్ వంటి సమస్యలు దూరంగా ఉంటాయి. ఇందులో పుష్కలంగా లభించే ఫైబర్ జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది.

బ్లడ్ షుగర్ లెవెల్

బ్లడ్ షుగర్ లెవెల్

కాయధాన్యాల్లో ఉండే కార్బోహైడ్రేట్స్, మధుమేహం, రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తాయి.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

కాయధాన్యాలు విటమిన్స్, ప్రోటీన్లు, ఖనిజాలు కలిగి ఉంటాయి. అలాగే జీరో కొలెస్ట్రాల్ కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది.

ప్రోటీన్

ప్రోటీన్

కాయధాన్యాలైన అన్ని చిక్కుళ్లు, గింజలతో ప్రోటీన్లు అత్యధిక స్థాయిలో పొందవచ్చు. వీటిలో ఉండే కేలరీలు 26 శాతం ప్రోటీన్ పొందవచ్చు. ఇవి శాఖాహారులు, బరువు కోల్పోవాలి అనుకునేవాళ్లకు సరైన పరిష్కారం.

శక్తి పెంచుతుంది

శక్తి పెంచుతుంది

కాయధాన్యాలు దాని ఫైబర్ కంటెంట్, తక్కువ పిండిపదార్ధాలు ఎనర్జీని పెంచుతాయి. ఇవి శరీరానికంతటికీ.. ఆక్సిజన్ సరఫరా చేసే ఐరన్ పొందడానికి సహాయపడతాయి.

English summary

Amazing Health Benefits Of Lentils

Amazing Health Benefits Of Lentils. Lentils are low in calories and high in nutrition. Hence, lentils are an excellent choice of food for vegetarians and those wanting to shed a few pounds.
Story first published: Tuesday, February 16, 2016, 17:38 [IST]
Desktop Bottom Promotion