For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెజిటేరియన్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన విటమిన్స్, మినరల్స్..!!

By Swathi
|

వేజిటేరియన్ డైట్.. మంచిది మాత్రమే కాదు.. బరువును సరిగ్గా మెయింటెయిన్ చేయడంతో పాటు, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, క్యాన్సర్ అరికట్టడంలో సహాయపడతాయి. ఒకవేళ మీరు స్ట్రిక్ట్ వెజిటేరియన్ అయితే.. మీరు ఖచ్చితంగా.. కొన్ని రకాల విటమిన్స్, మినరల్స్ ని మీ డైట్ లో చేర్చుకోవాలి.

అలాగే వెజిటేరియన్స్ క్యాల్షియం అందించే గ్రీన్ వెజిటబుల్స్, ధాన్యాలు వంటివి ఖచ్చితంగా తీసుకోవాలి. కొన్నిసార్లు క్యాల్షియం ట్యాబ్లెట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్ గా క్యాల్షియం ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా, పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే.. బ్లడ్ వెజెల్ ఫంక్షన్ సజావుగా ఉంటుంది. నరాలు ఆరోగ్యంగా ఉంటాయి.

Vitamins & Minerals For Every Vegetarian

ఐరన్ శరీరంలో చాలా కీలకపాత్ర పోషిస్తుంది. ఐరన్ పుష్కలంగా అందినప్పుడే.. శరీరం పనితీరు సజావుగా సాగుతుంది. ఐరన్ తగ్గినప్పుడు అలసట, నీరసం వంటి సమస్యలు ఎదురవుతాయి. శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ అందించడంలో ఐరన్ చాలా ముఖ్యమైనది.

Vitamins & Minerals For Every Vegetarian

వెజిటేయిన్స్ కి అదనంగా ఐరన్ పొందాల్సి ఉంటుంది. అది కూడా ప్లాంట్ ఫుడ్స్ ద్వారా కావాల్సిన మోతాదులో పొందవచ్చు. బీన్స్, ధాన్యాలు, నట్స్, బచ్చలికూర, సిట్రస్ ఫ్రూట్స్ లో.. ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ డి కూడా.. శరీరానికి చాలా ముఖ్యమైనది.

Vitamins & Minerals For Every Vegetarian

శరీరం క్యాల్షియం గ్రహించడానికి విటమిన్ డి సహాయపడుతుంది. విటమిన్ డి లోపం వల్ల అలసట, మూడ్ లో మార్పులు, నిద్రలో సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. విటమిన్ డి ని సిట్రస్ ఫ్రూట్స్ ద్వారా పొందవచ్చు. కొన్ని అత్యవసర సమయాల్లో ట్యాబ్లెట్స్ కూడా వాడవచ్చు. విటమిన్ బి12 డీఎన్ఎ ఉత్పత్తికి చాలా ముఖ్యమైనది. ఇది శరీరంలో లోపించినప్పుడు అలసట, స్పర్శ లేకపోవడం, వీక్ నెస్, నడవడానికి సమస్య వంటివి కనిపిస్తాయి.

Vitamins & Minerals For Every Vegetarian

ఒమేగా త్రీ, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ని రకరకాల వెజిటేరియన్ ఫుడ్స్ ద్వారా పొందవచ్చు. లిన్ సీడ్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్స్ ద్వారా ఎక్కువగా ఒమేగా త్రీని పొందవచ్చు. హెంప్ సీడ్ ఆయిల్ ద్వారా ఒమేగా 3తోపాటు 6 ఫ్యాటీ యాసిడ్స్ ని కూడా పొందవచ్చు. ఆలివ్ ఆయిల్ ని కొద్ది కొద్దిగా డైట్ లో చేర్చుకుంటే.. పోషకాలు పొందవచ్చు. అలాగే వాల్ నట్స్ లో కూడా ఒమేగా త్రీ, సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.

English summary

MUST HAVE: Vitamins & Minerals For Every Vegetarian

MUST HAVE: Vitamins & Minerals For Every Vegetarian. A vegetarian diet is not only good when it comes to maintaining weight, it also helps in preventing heart diseases, diabetes and cancer.
Story first published:Wednesday, August 31, 2016, 17:17 [IST]
Desktop Bottom Promotion