For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రేగిపండ్లలోని అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

|

రేగు పండ్లు పుల్లపుల్లగా, తియ్యతియ్యగా వుంటుంది. వీటిని భానుడికి చిహ్నంగా భావిస్తారు. సంక్రాంతి సమయంలో భోగి రోజున పిల్లలు భోగభాగ్యాలతో తులతూగాలని ఈ పండ్లను పోస్తారు. భోగినాడు పోస్తారు కాబట్టి వీటిని భోగిపండ్లు అంటారు. రేగు పళ్లకు రకరకాల పేర్లున్నాయి. వీటిని జిజిఫుస్‌ మారిటియానా, నార్‌కెలి కల్‌, బెర్‌, బోరీ, బోర్‌, బెరి అని వివిధ రకాలుగా వివిధ ప్రాంతాలలో పిలుస్తారు.

సంక్రాంతి పండుగ వస్తుందనడానికి సూచనగా పల్లెల్లో రేగుచెట్లు విరగకాస్తుంటాయి. దోరగా ... ఎర్రగా పండిన రేగుపండ్లు నోరూరిస్తూ వుంటాయి. దాంతో వంకీ కత్తిని తలపించే రేగిముళ్లను లెక్కచేయకుండా పిల్లలు రేగుపండ్లు కోసేస్తుంటారు. ఇక పట్టణాల్లో కూడా ఏ కూడలిలో చూసినా రేగుపండ్లు విరివిగా కనిపిస్తుంటాయి. తోపుడు బండ్ల చుట్టూచేరి రేగుపండ్లను విపరీతంగా కొనుగోలు చేయడం కనిపిస్తూ వుంటుంది.

సంక్రాంతి సమయంలో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను, వాకిట్లో వేసిన ముగ్గుమధ్యలో వుంచి వాటిపై రేగుపండ్లు ఉంచుతుంటారు. ఇక చిన్న పిల్లలకు రేగుపండ్లను భోగి పండుగ రోజున తలపై నుంచి పోస్తారు. ఈ వేడుకనే 'భోగిపండ్లు' అని అంటారు. ఈ విధంగా చేస్తే రేగుపండ్లు శరీరాన్ని తాకుతూ వెళ్లడం వలన వ్యాధులు దగ్గరికి రాకుండా ఉంటాయని అంటారు. చిన్న పిల్లల ఆరోగ్యాన్ని ఆశించే దీనిని ఆచారాల్లో భాగంగా చేసి పెద్దలు ఈ వేడుకను జరుపుతుంటారు.

రేగు పండు చూడ్డానికి చిన్నగా వుంటుంది.పచ్చిగా వున్నప్పుడు ఆకుపచ్చ రంగులో వున్నా, పక్వానికొచ్చాక రంగు మారుతుంది. పసుపు, ఆ పై ఎరుపు రంగుకు వస్తుంది. మన దేశంలో 90 రకాల రేగుపండ్లను పండిస్తున్నారు. ఇది మంచి ఔషధకారి. రేగు పండులో ఔషధ గుణాలు చాల వున్నాయి. వీటిని తింటే కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తికి చాల మంచిది. గొంతు నొప్పిని,ఆస్తమాని కండరాల నెప్పిని తగ్గించే గుణం దీనిలో వుంది. రేగు పందు గింజ చాల గట్టిగా వుంటుంది. వీటిని పొడి చేసి నూనెతో కలిపి రాసు కుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రేగు చెట్టు బెరడును నీళ్లలో మరిగించి డికాక్షన్ గా తాగితే నీళ్ల విరేచనాలకు బలేబాగ పని చేస్తుంది. కొన్ని ప్రాంతాలలో రేగు పండ్ల గుజ్జుతో వడియాలు పెట్టుకుంటారు.

నిజంగానే రేగుపండులో అనేక రకాలైన ఔషధ గుణాలు వున్నాయని పరిశోధనలు కూడా వెల్లడిస్తున్నాయి. మరి రేగుపళ్లలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

1.మైండ్ ను షార్ప్ గా ఉంచుతుంది:

1.మైండ్ ను షార్ప్ గా ఉంచుతుంది:

చేతి నిండుగా రేగుపండ్లను ఒక అరలీటరు నీళ్లలో వేసి అవి సగం అయ్యే వరకు మరగనివ్వాలి. దానికి పంచదార కానీ తేనె గానీ కలిపి దానిని రోజూ పడుకోబోయే ముందు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తంలోకి గ్లుంటామిక్‌ ఆమ్లం ఎక్కువగా విడుదలై మెదడు బాగా పనిచేయడానికి ఉపకరిస్తుంది.

2.జ్వరం మరియు ఫ్లూ నివారిస్తుంది:

2.జ్వరం మరియు ఫ్లూ నివారిస్తుంది:

రేగు పండ్లు తరచూ జ్వరం, జలుబు రాకుండా చేస్తాయి. శూలనొప్పి, డయేరియా, రక్త విరేచనాలను అరికట్టడానికి రేగి చెట్టు బెరడును ఉపయోగిస్తారు. బెరడు కషాయం మలబద్ధకానికి బాగా పనిచేస్తుంది.

3.స్కిన్ ట్యాగ్స్ :

3.స్కిన్ ట్యాగ్స్ :

రేగు ఆకులను నూరి దాన్ని కురుపులు వంటి వాటి మీద రాసుకుంటే త్వరగా నయమవుతాయి.

4.రేగు పండు తీయని పండే కాదు మంచి హెర్బల్‌ మందుగా కూడా పనిచేస్తుంది.

4.రేగు పండు తీయని పండే కాదు మంచి హెర్బల్‌ మందుగా కూడా పనిచేస్తుంది.

రేగుపండ్లు తినడం వలన వాతము ... పైత్యము ... కఫము తగ్గుతాయి. ఇవి కడుపులో మంటను ఉపశమింపజేయడమే కాకుండా జీర్ణశక్తిని పెంచుతాయి. మలబద్ధకాన్ని నివారించడమే కాకుండా, మూలవ్యాధి బారిన పడకుండా కాపాడతాయని చెప్పబడుతోంది.

 5.బరువు పెంచుతుంది:

5.బరువు పెంచుతుంది:

ఇవి బరువు పెరగడంలో, కండరాలకు బలాన్నివ్వడంలో, శారీరక శక్తినివ్వడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

6.కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

6.కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

కాలేయం పనిని మరింత చురుకు చేయడానికి చైనీయులు ప్రత్యేకంగా రేగిపండ్లతో చేసినా టానిక్‌ను ఎంచుకుంటారు.

7.రోగనిరోధకశక్తిని పెంచుతుంది:

7.రోగనిరోధకశక్తిని పెంచుతుంది:

ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని జపనీయుల పరిశోధనలో తేలింది. ఇవి విరుగుడుగా, కఫోత్సారకంగా, మూత్ర స్రావకానికి ప్రేరకంగా ఉపయోగపడుతుంది.

8.క్యాన్సర్ నివారిణి:

8.క్యాన్సర్ నివారిణి:

అంతేకాదు బాధానివారిణి, క్యాన్సర్‌ వ్యతిరేకి, ఉపశమనకారి.

9.బ్లడ్ ఫ్యూరిఫైయర్:

9.బ్లడ్ ఫ్యూరిఫైయర్:

ఇది రక్తాన్ని శభ్రం చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఆకలి లేమి, రక్తహీనత, నీరసం, గొంతునొప్పి, శ్వాసనాళాల వాపు, విసుగు, హిస్టీరియా వంటి వాటి నివారణా మందులలో దీన్ని వాడతారు.

10.నిద్రలేమి సమస్యను నివారిస్తుంది:

10.నిద్రలేమి సమస్యను నివారిస్తుంది:

విత్తనాలు కూడా అనేక ఔషధగుణాలను కలిగి ఉంటాయి. నిద్రలేమి నివారణకు విత్తనాలను వాడతారు. అజీర్తిని అరికట్టడంలో దాని వేర్లను ఉపయోగిస్తారు.

11.జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది:

11.జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది:

జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగడానికి రేగుపండ్లు దోహదం చేస్తాయి.

12.అతిగా తింటే విషంగా మారుతుందనే వైద్యశాస్త్రం చెబుతోంది.

12.అతిగా తింటే విషంగా మారుతుందనే వైద్యశాస్త్రం చెబుతోంది.

ఇక రేగుపండ్లు తేనె రంగులో వున్నవి ... పండినవి మాత్రమే తినాలి. పచ్చి రేగుపండ్లు తినడం వలన అనారోగ్యానికి గురయ్యే అవకాశం వుంది.

English summary

Surprizing Health benefits of Regi pallu

The favorite one of all, Regi Pallu are seasonal fruits that are available in winter through Sankranthi festival and are totally part of the Telugu culture. Though we have the hybrid ones flooding in the market, the real ones are the kings out there.
Story first published:Friday, January 8, 2016, 12:01 [IST]
Desktop Bottom Promotion