ఆరోగ్యాన్ని సంరక్షించే 10 రకాల ఉత్తమమైన నట్స్ (గింజలు) !

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky
10 Best Nuts To Eat For Better Health

మీ రోజువారీ ఆహారంలో నట్స్ ను చేర్చుకోవాలి ఎందుకంటే అవి మానవ శరీర ఆరోగ్యాన్ని పెంపొందించే విస్తృతమైన పోషకాలను కలిగి ఉంటాయి. అవన్నీ ఆరోగ్యకరమైన కొవ్వులను, ఫైబర్ మరియు ప్రోటీన్ల వంటి మూలాలతో పాటు, అనేక విటమిన్లను మరియు ఖనిజాలైన, మెగ్నీషియం మరియు విటమిన్ E లను కూడా కలిగి ఉంటాయి.

రోజుకు కనీసం 20 గ్రాముల నట్స్ను (గింజలను) తినే ప్రజలు దాదాపు 30 శాతం హృద్రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తాయని, అకాల మరణాలను 22 శాతం, క్యాన్సర్ను 15 శాతం తగ్గింప చేస్తున్నాయని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది

నట్స్, కాలానుగుణంగా వచ్చే ఊబకాయ ప్రమాదాన్ని తగ్గించడానికి అవసరమైన శక్తిని కలిగి ఉంటాయి మరియు అవి శక్తిని కూడా అందించగలిగేవిగా ఉంటాయి, మీరు మీ నడుము చుట్టూ ఉన్న కొవ్వును (waistline) తగ్గించుకోవలసిన శ్రమ పడవలసిన అవసరం లేకుండానే, కావలసిన ప్రయోజనాలను వీటిద్వారా పొందవచ్చు.

నట్స్ అనేవి శరీర జీవక్రియకు సంబంధించి ఉన్న అధిక రక్తపోటును మరియు కొలెస్ట్రాల్ స్థాయిల వల్ల కలిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును కూడా తగ్గిస్తుంది మరియు కొన్ని రకాల క్యాన్సర్లకు గురికాకుండా ఉండే ప్రమాద స్థాయిలను తగ్గించవచ్చు.

మీరు మీ ఆహారంకు నట్స్ను (గింజలను) జోడించాలనుకుంటే, మెరుగైన ఆరోగ్యానికి అవసరమైన 10 ఉత్తమ రకాల నట్స్ను (గింజలను) గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ క్రింద వివరించిన అంశాలను పూర్తిగా చదవండి.

1. బాదం :

1. బాదం :

విటమిన్ ఎ, మెగ్నీషియం, ఫైబర్, కార్బొహైడ్రేట్, ప్రోటీన్ మరియు మాంగనీస్ లాంటి అనేక పోషకాలను - బాదం కలిగి ఉంటుంది. విటమిన్ E, మెగ్నీషియం మరియు పొటాషియం వంటివి LDL అనే (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించగలవు. బాదంలో కనిపించే మరొక సమ్మేళనం, సరైనరీతిలో మెదడు అభివృద్ధి చెందేందుకు కీలకమైన పాత్రను పోషిస్తుంది మరియు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

2. పిస్తా :

2. పిస్తా :

పొటాషియం, విటమిన్ B6, కాపర్ మరియు మాంగనీస్ వంటి అద్భుతమైన మూలాలను పిస్తాపప్పులలో పుష్కలంగా ఉన్నాయి. పిస్తాపప్పు రక్తంలో గల చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి మరియు వాటిని అల్పాహారంగా తీసుకోవడం వల్ల ఊబకాయమును, వాపును మరియు గ్లైసెమిక్ వంటి వాటిని నియంత్రణ చేసే, ప్రయోజనకరమైన ప్రభావాలను ఇందులో కలిగి ఉన్నాయి. ఇందులో కొలెస్ట్రాలు అస్సలు లేకపోవడం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి చాలా చాలా ఉపయోగకారిగా ఉన్నది.

3. వాల్నట్స్ :

3. వాల్నట్స్ :

వాల్నట్స్ (అక్రోట్లు) అనేవి రూపంలో మానవ మెదడును ప్రతిబింబించేలా ఉంటాయి, అందువల్ల అవి మెదడు శక్తిని పెంపొందించేదిగా అత్యంత ప్రజాదరణనను పొందాయి. వాల్నట్లలో "ఒమేగా -3 కొవ్వులను" ఎక్కువగా కలిగి ఉంది - ఫైబర్లను తక్కువ మోతాదులో కలిగి ఉంటాయి మరియు క్యాన్సర్ను నిరోధించే అత్యధికమైన అనామ్లజనకాలను కలిగి ఉంటాయి. నట్స్ (గింజలు) కూడా శరీరంలో ఉన్న రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి మరియు గుండెపోటుకు కారణమైన 'కరోనరీ' చర్యకు వ్యతిరేకంగా పోరాడటానికి ఇవి చాలా సహాయపడతాయి.

4. జీడిపప్పు :

4. జీడిపప్పు :

జీడిపప్పులు మాత్రమే ఒంటరిగా తినేందుకు ప్రీతికరమైన పదార్థంగా ఉంటుంది మరియు జీవక్రియ యొక్క లక్షణాలను మెరుగుపరిచేదిగా పిలుస్తారని మనకి బాగా తెలుసు. ఇవి అనాకార్డిక్ ఆమ్లమును కలిగి ఉండటం వల్ల, ఇవి ఇన్సులిన్ యొక్క సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి మరియు దీర్ఘకాలిక నొప్పులను నిరోధించడంలో సహాయపడుతుంది. జీడిపప్పులో గొప్ప ఖనిజాలైన - జింక్, సెలీనియం మరియు రాగి వంటి మూల పదార్థాల సమ్మేళనాలు కూడా జీడిపప్పులో ఉన్నాయి.

5. పీకన్స్ :

5. పీకన్స్ :

పీకన్స్ లో అనామ్లజనకాలుగా పనిచేసే పాలీఫెనోల్స్ ను కలిగి ఉన్న చాలా అద్భుతమైన గింజలు. ఇవి విటమిన్ E కి ఒక మంచి మూల పదార్థంగా ఉంటూ, ఇది హానికరమైన చర్మ ఆక్సిడెంట్ల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. పీకన్స్ లో వివిధ రకాలైన విటమిన్లను మరియు ఖనిజాలను, అనగా ఫోలిక్ ఆమ్లమును, మెగ్నీషియం, ఫాస్పరస్ మరియు జింక్ వంటి వాటిని కలిగి ఉన్నాయి.

6. మకాడమియా నట్స్ :

6. మకాడమియా నట్స్ :

మకాడమియా గింజలలో గుండెకు ప్రయోజనాలను కలిగించే 'మోనోసాండరేట్' అనే కొవ్వులను కలిగి ఉంటాయి. ఈ గింజలు పామిటోలెలిక్ ఆమ్లమును కలిగి ఉండటం వల్ల శరీర జీవక్రియ రేటును పెంచే ఆమ్లాలను కలిగి, శరీరంలో అదనపు కొవ్వు నిల్వను నిరోధిస్తుంది. మకాడమియా గింజలలో పోషకాలనే కాక, ఫైబర్ మరియు ఇతర ఖనిజాలైన కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కాపర్ మరియు జింక్ వంటి పోషకాలను కలిగి ఉన్నాయి.

7. బ్రెజిల్ నట్స్ :

7. బ్రెజిల్ నట్స్ :

సెలీనియం అనే గొప్ప వనరు కారణంగా బ్రెజిల్ గింజలను తరచుగా ప్రతిపాదించడం వల్ల, అవి క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడేదిగి సూచించబడినది. ఈ గింజలు కూడా నాడీ వ్యవస్థను మరియు కండరాల వ్యవస్థను మెరుగుపరిచేదిగా ఉంటూ, రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మరియు నిర్విషీకరణ (శరీరంలో ఉన్న చెడును తొలగించేదిగా), వాపు మరియు థైరాయిడ్ పనితీరుల నియంత్రణకు అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులను కూడా కలిగి ఉంటాయి.

8. హాజెల్ నట్స్ :

8. హాజెల్ నట్స్ :

హాజెల్ నట్స్ కేవలం పుష్టికరమైనవే కాదు, గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి చాలా ఉపయోగకారిగా ఉంటాయి. అవి విటమిన్ E, మాంగనీస్, థయామిన్, ఫోలేట్ మరియు కొవ్వు ఆమ్లాలు వంటి అనేక ముఖ్యమైన పోషకాల సమ్మేళనంగా వుంటూ, మెదడు మరియు జ్ఞాన శక్తి యొక్క పనితీరును మెరుగుపరుస్తాయి.

9. పీనట్స్ :

9. పీనట్స్ :

పీనట్స్ లను వేరుశనగలని కూడా పిలుస్తారు మరియు పచ్చి వేరుశనగలను తినడం వల్ల చర్మాన్ని మరింత కాంతివంతంగా చెయ్యవచ్చు. దానిలో ఉన్న అనేక ఆరోగ్య ప్రయోజనాలు కారణంగా, వేరుశెనగలను ఒక ప్రముఖమైన అల్పాహారంగా (చిరుతిండిగా) తీసుకుంటారు. రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మరియు జ్ఞాపకశక్తిని మెరుగుపర్చడంలో సహాయపడే మాంగనీస్ను అధిక స్థాయిలో కలిగి ఉన్నాయి.

10. చెస్ట్-నట్స్ :

10. చెస్ట్-నట్స్ :

చెస్ట్నట్ లో కొవ్వు అనేది చాలా తక్కువగా ఉంటుంది మరియు క్వెర్సేటిన్ వంటి ఫ్లేవానాయిడ్లను కలిగి ఉండటం వల్ల డయాబెటిస్, క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పోరాడి మానవదేహాన్ని రక్షిస్తుంది. దాని వింత రుచి మరియు శక్తివంతమైన ప్రయోజనాలు శరీరంలో దెబ్బతిన్న రక్తనాళాలను మరియు రక్త కేశనాళికల చికిత్సలో సహాయపడతాయి. చెస్ట్నట్, పళ్ళను బలంగా కాపాడుతూ, మరోపక్క శ్వాసకోశ వ్యాధులను నిర్మూలిస్తుంది.

English summary

10 Best Nuts To Eat For Better Health

Nuts have the ability to reduce the risk of metabolic syndrome, such as high blood pressure and cholesterol levels. It also reduces the risk of other chronic diseases and can also reduce the risk of certain cancers. If you want to add nuts to your diet, read on to know more about the 10 best nuts to eat for better health.
Story first published: Monday, December 25, 2017, 11:00 [IST]