For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పల్లీల్లో ఉండే ఆరోగ్య రహస్యాల గురించి తెలిస్తే.. అసలు వదిలిపెట్టరు!

పల్లీల వాడకం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. పల్లీలను నూనె రూపంలోనే కాకుండా.. ఇతర ఆహారం రూపంలోకూడా ఉపయోగిస్తున్నారు. పల్లీల్లో ఉండే ఆరోగ్య రహస్యాల గురించి తెలిస్తే.. అసలు వదిలిపెట్టరు అంటున్నారు వైద్య

By Mallikarjuna
|

పల్లీల వాడకం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. పల్లీలను నూనె రూపంలోనే కాకుండా.. ఇతర ఆహారం రూపంలోకూడా ఉపయోగిస్తున్నారు. పల్లీల్లో ఉండే ఆరోగ్య రహస్యాల గురించి తెలిస్తే.. అసలు వదిలిపెట్టరు అంటున్నారు వైద్యనిపుణులు.

పేదవాడి జీడిపప్పుగా అభివర్ణించే వేరుశనగ పప్పుల్లో పౌష్టికాహార గుణాలు పుష్కలం. దీన్ని టైంపాస్‌గా కూడా తింటుంటారు. టైంపాస్‌గా వీటిని తినే వాళ్ళకు ఇందులో ఉండే పౌష్టిక గుణాల గురించి తెలియకనే తింటుంటారు. దీంతో వారికి తెలియకనే లాభం పొందుతుంటారు.

ఇందులోని ప్రొటీన్లు, చక్కెర, కొవ్వు పదార్థాలు శరీరానికి అందుతాయి. ఒక పిడికిలి వేరుశెనగ పప్పు తింటే వచ్చే ప్రొటీన్ల బలం పాలు, కోడిగుడ్డు తిన్నాకూడా రాదు. పాలలోని ప్రొటీన్లు నెయ్యిలోని కొవ్వు పదార్థాలు రెండూ వేరుశెనగపప్పులోఉన్నాయి. పాలు, బాదంపప్పు, నెయ్యి తింటే లభించే పోషక పదార్థాలు కేవలం వేరుశెనగపప్పు తింటే లభిస్తుంది.

 peanuts health benefits

వీటినే పల్లీలు అని కూడా అంటారు. ఇవి తింటే శరీరంలో వేడిని పుట్టిస్తుంది. కాబట్టి చలికాలంలో తింటే చాలా మంచిది. ఇందులో దగ్గును నివారించే గుణం కూడా ఉంది. ఇంతే కాదు ఇవి ఊపిరితిత్తులకు కూడా బలాన్ని చేకూరుస్తాయి. ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత 50నుండి 100 గ్రాములు తింటే ఆరోగ్యానికి మంచిదని, జీర్ణశక్తిని పెంచి, రక్త హీనతను తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ప్రొటీన్లు, కేలరీలు, విటమిన్‌ కే, విటమిన్‌ ఈ, విటమిన్‌ బీ, లుంటాయి. ఇన్ని సుగుణాలున్న వేరుశెనగ పప్పును వింటర్లో తింటే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఒకసారి తెలుసుకుందాం..

 1. బరువు పెరగడానికి నివారిస్తుంది

1. బరువు పెరగడానికి నివారిస్తుంది

ఇతర స్నాక్స్ తో పోల్చితే వేరుశెనగపప్పులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, కాబ్టి, వీటిని స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు. వీటిని తినడం వల్ల ఇతర హైక్యాలరీ, ఫ్యాట్ ఫుడ్స్ తినాలనిపించదు. దాంతో మీరు బరువు పెరగరు. వింటర్లో బరువు పెరగకుండా నివారిస్తుంది.

2. కొలెస్ట్రాల్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది

2. కొలెస్ట్రాల్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది

వేరుశెనగల్లో మోనోశాచ్యురేటెడ్ ఫాలీ అన్ శ్యాచురేటెండ్ ఫ్యాట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఓలిక్ యాసిడ్ రక్తంలో ఎల్ డిఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి, మంచి కొలెస్ట్రాల్ ఎచ్ డిఎల్ ను పెంచుతుంది. అందువల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఇవి కరోనరీ ఆర్టీ డిసీజ్ ను నివారిస్తుంది. స్ట్రోక్ నివారించి హెల్తీ లిపిడ్ ప్రొఫైల్ ను ప్రోత్సహిస్తుంది.

3. స్ట్రోక్ రిస్క్ ను తగ్గిస్తుంది

3. స్ట్రోక్ రిస్క్ ను తగ్గిస్తుంది

వేరుశెనగల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు మినిరల్స్, స్ట్రోక్ మరియు ఇతర హార్ట్ సమస్యల రిస్క్ ను తగ్గిస్తుంది. పల్లీలలో ఉండే ట్రైప్టోఫోన్ డిప్రెషన్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది. అదే విధంగా గుప్పెడు వేరుశెనగలు స్ట్రోక్ నుండి మిమ్మల్ని కాపాడుతుంది.

4. క్యాన్సర్ నివారిణి

4. క్యాన్సర్ నివారిణి

పినట్స్ వంటి లెగ్యూమ్స్ లో ఫైటో స్టెరోల్ బీటా స్టెరోల్ అధికం. ఈ ఫైటో స్టెరోల్స్ లో క్యాన్సర్ తో పోరాడే లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి ట్యూమర్ గ్రోత్ ను నివారిస్తాయి. పీనట్స్ తినే స్త్రీ మరియు పురుషుల్లో వ 27 శాతం నుండి 58 శాతం వరకూ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదని యునైటెడ్ స్టేట్స్ పరిశోధనల్లో కనుగొనబడినది. ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ తగ్గిస్తుంది.

5. డయాబెటిస్ నివారిస్తుంది

5. డయాబెటిస్ నివారిస్తుంది

పీనట్స్ లో మ్యాంగనీస్ మరియు మినిరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి కొవ్వు మరియు కార్బోహైడ్రేట్ ల విషయంలో ముఖ్య పాత్ర పోషించి, మెటబాలిజంకు సహాయపడుతాయి. క్యాల్షియం గ్రహించడం మరియు బ్లడ్ షుగర్ రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతాయి. పీనట్స్ తినడం వల్ల 21 శాతం డయాబెటిస్ రిస్క్ ఉండదని పరిశోధనల్లో కనుగొన్నారు. ఎవరైతే డయాబెటిస్ తో బాధపడుతున్నారో , వారు కొద్దిగా పల్లీలు తినడం అలవాటు చేసుకోండి. సందేహం ఉంటే డాక్టర్ ను అడిగి సలహాలు తీసుకోండి.

6. ఫెర్టిలిటి పెరుగుతుంది:

6. ఫెర్టిలిటి పెరుగుతుంది:

వేరుశెనగల్లో హై క్వాలిటి ఫోలిక్ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఫెర్టిలిటినిపెంచుతాయి. అలాగే పుట్టే పిల్లలో ఎలాంటి లోపాలు లేకుండా పుడుతారు. అందు వల్ల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వారు పీనట్స్ తినడం వల్ల హెల్తీ బేబిని పొందవచ్చు. ప్రెగ్నెన్సీకి ముందు కనీసం 400గ్రాములుప్రీనట్స్ తినడం వల్ల లేదా ప్రెగ్నెన్సీ సమయంలో తినడం వల్ల 70 శాతం పుట్టే పిల్లల్లో ఎలాంటి లోపాలు ఉండవు. ముఖ్యంగా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఉండవు. ముఖ్యంగా గర్భిణీలు పీనట్స్ తినడం వల్ల అలర్జిక్ డిసీజ్ ను మరియు ఆస్త్మాను నివారిస్తుంది.

7. చర్మానికి మంచిది

7. చర్మానికి మంచిది

చర్మ సంరక్షణకు పీనట్స్ చాలా మంచిది. పీనట్స్ లో ఉండే మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు రివర్ట్రోల్ చర్మానికి కావల్సిన తేమను అందించి, చర్మం తేమగా, కాంతివంతంగా మార్చుతుంది.

8. దగ్గు మరియు జలుబు నివారిస్తుంది

8. దగ్గు మరియు జలుబు నివారిస్తుంది

వేరుశెనగల్లో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల దగ్గ మరియు జలుబు కూడా తగ్గిస్తుంది.

English summary

Health Benefits Of Consuming Peanuts In Winter

Peanut is more than a nut and has amazing health benefits, which many of us do not know of. Peanuts are legumes and provide us with a lot of proteins, like any other legume. You can consume it in any form, either raw or boiled or roasted, and it just tastes amazing.
Story first published:Saturday, December 9, 2017, 16:53 [IST]
Desktop Bottom Promotion