Just In
- 7 hrs ago
ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు
- 9 hrs ago
Guru Gobind Singh Jayanti 2021 : గురు గోవింద్ సింగ్ గురించి మనం నమ్మలేని నిజాలు...
- 9 hrs ago
అల్లం తేనెలో నానబెట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!
- 9 hrs ago
మీ రాశిని బట్టి ఏ రత్నం ధరిస్తే.. శుభఫలితాలొస్తాయంటే...!
Don't Miss
- News
జో బైడెన్ రాకముందే డొనాల్ ట్రంప్ జంప్: కరోనా, నిరుద్యోగితలే అధ్యక్ష భవనానికి దూరం నెట్టాయి
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Movies
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఒక స్పూన్ శెనగలు తింటే చాలు 50 బాదంలతో సమానం!
సాధారణంగా మన వంటగదిలో ఉండే ఆహారాపదార్థాలేన్నో మనకు తెలియకుండానే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అలాంటి ఆహార పదార్థాల్లో శెనగలు ఒకటి. శెనగపిండిని మనం ఎన్ని రకాల వంటల్లో ఉపయోగిస్తామో తెలుసు కదా.. మిర్చి బజ్జీలు మొదలుకొని పకోడి, మంచూరియా వంటి అనేక వంటల్లో ఉపయోగిస్తుంటాము. అయితే ఇవన్నీ నూనెతో వండే పదార్థాలు. వీటి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలుండవు,. అదనంగా మరికొంత కొవ్వు చేరడం తప్ప.
శెనగపిండితో చేసిన వంటల సంగతి పక్కన పెడితే, శెనగలను పొట్టు తీయకుండా డైరెక్ట్‌గా అలాగే ఉడకబెట్టో, నానబెట్టో, మొలకల రూపంలోనో తింటే మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. ఇక బాదం పప్పు అంటే అందరికి తెలిసిందే, డ్రై నట్స్ లో అత్యధిక పోషక విలువలు కలిగినది బాదం. దీనికి సమాన పోషక విలువలు శెనగల్లో కూడా ఉన్నాయి. వును మీరు విన్నది నిజమే. ఈ క్రమంలో వారానికి కనీసం రెండు, మూడు సార్లైనా శెనగలను పైన చెప్పిన విధంగా ఏదో ఒక రూపంలో తీసుకుంటే దాంతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1. హార్ట్ సమస్యలను నివారిస్తుంది:
శెనగల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. హార్ట్ సమస్యలను నివారిస్తుంది.

2. మాంసాహారాల్లో కంటే ప్రోటీన్లు అధికం
మాంసాహారం తినలేని వారికి శెనగలు ఒక వరమని చెప్పొచ్చు. ఎందుకంటే మాంసాహారంలో ఉండే ప్రోటీన్లన్నీ శెనగల్లో పుష్కలంగా ఉన్నాయి.

3. బిపిని కంట్రోల్ చేస్తాయి
శెనగల్లో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, వంటి ఎన్నో రకాల మినిరల్స్ ఉన్నాయి. ఇవి బిపిని కంట్రోల్ చేస్తాయి,.

4. రక్తంలో రెడ్ బ్లడ్ సెల్స్ పెరుగుతాయి.
ఇవి రక్తం కల్తీ లేకుండా చేస్తుంది. అనీమియా వారికి ఇది చాలా మంచిది.

5. స్ట్రెస్ తగ్గించి నిద్రపట్టడానికి సహాయపడుతాయి
శెనగల్లో అమైనో యాసిడ్లు, ట్రిప్టోఫాన్, సెరొటోనిన్ వంటి ఉపయోగకరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.ఇవి మంచిగా నిద్రపట్టడానికి సహాయపడుతాయి. దాంతో నిద్రలేమి సమస్య దూరమవుతుంది. స్ట్రెస్, ఆందోళ వంటి సమస్యలను దూరం అవుతాయి.

6. కొలెస్ట్రాల్ తగ్గించి, హార్ట్ హెల్త్ మెరుగుపరుస్తుంది
శెనగల్లో ఆల్ఫా లినోలినిక్ యాసిడ్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ తగ్గించి, హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తాయి.

7. ఎనర్జీ బూస్టర్
శెనగలోలో ఐరన్, ప్రోటీన్లు, మినిరల్స్ సమృద్ధిగా ఉండడం వల్ల శెనగలు శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి.

9. కిడ్నీల పనితీరు మెరుగ్గా ఉంటుంది
శెనగల్లో ఫాస్పరస్ అధికంగా ఉండటం వల్ల, శరీరంలో ఉండే ఉప్పును బయటకు పంపుతుంది. దాంతో కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది.

10. జాండిస్ తగ్గిస్తుంది
పచ్చకామెర్లు ఉన్నవారు శెనగలు తింటే త్వరగా కోలుకుంటారు.

8. ఎముకలు స్ట్రాంగ్ గా ఉంచుతుంది
పాలలో ఉండే కాల్షియంకు దాదాపు సమానమైన కాల్షియం శెనగల్లో మనకు లభిస్తుంది. ఈ క్యాల్షియంతో ఎముకలకు పుష్టి కలుగుతుంది.