కాల్షియం అధికంగా ఉండే 20 రకాల ఆహారాలు ఏమిటో తెలుసా?

By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

మనం ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. కాల్షియం లోపం వల్లే చాలామంది బలహీనంగా కనిపిస్తుంటారు. మనం నిత్యం తీసుకునే ఆహారంలో కాల్షియం ఉండేలా చూసుకుంటే చాలా రోగాల బారిన పడే అవకాశం ఉండదు. మన దంతాలు, ఎముకలు పటిష్టంగా ఉండాలంటే శరీరానికి తగిన కాల్షియం అవసరం. కాల్షియం తగ్గితే ఇవన్నీ బలహీనం అవుతాయి. గుండె ఆరోగ్యంగా ఉండటానికి, కండరాలు బలపడడానికి, నాడీ వ్యవస్థ విధులను సక్రమంగా నిర్వహించటానికి కాల్షియం ఎంతో అవసరం. మన శరీరానికి కావాల్సిన కాల్షియాన్ని పొందాలంటే మన ఆహారంలో రోజూ ఈ కింద ఇచ్చిన పదార్థాలు, పానీయాలు ఉండేలా చూసుకోవాలి. అయితే మీలో విటమిన్ డీ కూడా అధికంగా ఉండాలి. లేదంటే ఈ ఆహారాలు తీసుకున్న పెద్దగా ప్రయోజనం ఉండదు. అందువల్ల మొదట మీలో విటమిన్ - డీ మోతాదుకు తగ్గట్లుగా ఉందోలేదో చూసుకోండి.

# 1. పెరుగు

# 1. పెరుగు

మనం పాల ద్వారా ఇళ్లలో తయారు చేసుకునే పెరుగు చాలామంచిది. దీనిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. బయట దొరికే యోగార్ట్ అంత మంచిది కాదు. అందువల్ల రోజూ ఇంట్లో పెరుగు తయారు చేసుకోని తినడం చాలా మంచిది. పాలలో లాగే పెరుగులో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే లాక్టోజ్ కూడా ఆరోగ్యానిక చాలా మంచిది.

# 2. సార్డినెస్

# 2. సార్డినెస్

ఈ సముద్రపు చేపలో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది చేపల మార్కెట్లో మనకు ఈజీగా దొరుకుతుంది.

రేట్ కూడా చాలా తక్కువే. ఇక నాన్ వెజిటేరియన్స్ అందరూ దీన్ని లాగించేయొచ్చు. సముద్ర తీర ప్రాంతాల వారందరికీ ఈ చేపల గురించే తెలిసే ఉంటుంది. ఈ చేపల ద్వారా మీకు రోజుకు కావాల్సిన 33% యూనిట్ల కాల్షియం లభిస్తుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా వారానికి ఒకసారి ఈ చేపలను తినండి.

 # 3. చీజ్

# 3. చీజ్

చీజ్ కూడా మనకు ఈజీగా దొరుకుతుంది. ఇది కూడా పాల ఉత్పత్తికి సంబంధినదే. దీనిలోనూ కాల్షియం ఫుల్ గా ఉంటుంది. పర్మెస్యాన్ చీజ్ లో అత్యధిక శాతం కాల్షియం ఉంటుంది.

 # 4. అంజీరపండ్లు

# 4. అంజీరపండ్లు

ఎండిన అంజీర పండ్లలోనూ కాల్షియం అధికంగా ఉంటుంది. దీంట్లో కాల్షియంతో పాటు ఫైబర్స్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి.

 # 5. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్

# 5. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లోనూ అధికంగా కాల్షియం ఉంటుంది. తోటకూర, పాలకూర, బచ్చలికూరలతో పాటు బ్రోకోలిలోనూ కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. అందువల్ల ఎక్కువగా వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటూ ఉండాలి.

 # 6. బాదం

# 6. బాదం

బాదంలో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. అలాగే కాల్షియం కూడా దీనిలో అధికంగా ఉంటుంది. అయితే వీటిని ఎక్కువ తీసుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే వీటని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో వేడి పెరుగుతుంది. మోతాదుకు మించకుండా తినండి.

# 7. ప్రౌన్స్

# 7. ప్రౌన్స్

ప్రౌన్స్ అధిక శాతంలో కాల్షియం ఉంటుంది. అయితే వీటిని ఎక్కువగా ఉడికిస్తే అందులో ఉన్న కాల్షియం మోతాదు తగ్గిపోతుంది. అందువల్ల వీటిని ఎక్కువగా వేయించకుండా తింటే మంచిది. దీంతో అందులో ఉన్న కాల్షియం గుణాలన్నీ మీ ఒంటపడతాయి.

# 8. నువ్వులు

# 8. నువ్వులు

నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. సాధారణంగా గర్భిణీలు ఎక్కువగా నువ్వులతో తయారు చేసిన లడ్డూలు తింటూ ఉంటారు. దీంతో మహిళలు వారు కోల్పొయిన కాల్షియం పొందుతారు. ప్రతి ఒక్కరూ కూడా నువ్వులతో తయారు చేసిన పదార్థాలను ఆహారంగా తీసుకుంటే సులభంగా కాల్షియం పొందవచ్చు.

# 9. టోఫు

# 9. టోఫు

ఒకప్పడు టోఫు కొన్నిచోట్ల మాత్రమే లభించేది. ఇప్పుడు మాత్రం విరివిగా లభిస్తుంది. టోఫు లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. సోయాబీన్స్ తో తయారు చేసే చీజ్ లాంటి పదార్థాన్నే టోఫు అంటారు. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సినంత కాల్షియం అందుతుంది.

# 10 ఆరెంజ్

# 10 ఆరెంజ్

ఆరెంజ్ కాల్షియం బాగానే ఉంటుంది. వీటిని రోజూ తింటూ ఉంటే శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. అందువల్ల ఆరెంజ్ పండ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.

# 11 సోయా పాలు

# 11 సోయా పాలు

సాధారణ పాలతో పోల్చితే సోయా పాలలో కాల్షియం అధికంగా ఉండదు. కానీ ఒక ఔన్స్ పాలలో 300మై.గ్రా కాల్షియం ఉంటుంది. అందువల్ల వీటిని తీసుకోవడం కూడా చాలా మంచిది.

# 12 వోట్ మీల్

# 12 వోట్ మీల్

కార్న్ ఫ్లేక్స్ కంటే వోట్స్ మంచి ఆరోగ్యకరమైనవి. రేట్ కూడా అంత ఎక్కువేమి ఉండదు. మన కిరాణా దుకాణాల్లో ఈజీగా వోట్స్ లభిస్తాయి. కనిపిస్తారు. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన కాల్షియం వీటి ద్వారా అందుతుంది. అందువల్ల మీరు తీసుకునే ఆహారంలో వోట్ మీల్ ఉండేటట్లు చూసుకోండి.

# 13. బెండ

# 13. బెండ

దీనిలో కాల్షియం అధికంగా ఉంటుంది. అలాగే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒక గిన్నె బెండకాయ కూరలో 175 మై.గ్రాముల కాల్షియం ఉంటుంది. అలాగే వందగ్రాముల బెండలో కాల్షియం 82 మై.గ్రా కాల్షియం ఉంటుంది.

# 14 పీతలు

# 14 పీతలు

పీత మాంసంలో అనేక పోషకాలుంటాయి. మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. అది ఒక కప్పు పీత మాసంలో కాల్షియం 123మై.గ్రా ఉంటుంది. అందువల్ల పీతలను కూడా బాగా తింటూ ఉండండి.

# 15. ఉడికించిన గుడ్లు

# 15. ఉడికించిన గుడ్లు

ఒక ఉడికించిన గుడ్డులో 50మై.గ్రా కాల్షియం ఉంటుంది. ప్లస్ ఇందులో ప్రోటీన్లు, విటమిన్ ఎ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీలైనం వరకు రోజుకొక ఉడకబెట్టిన గుడ్డునైనా తినండి.

# 16 . చింతపండు

# 16 . చింతపండు

ఇదంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. అయితే పైన పేర్కొన్న ఆహార పదార్థాలతో పోల్చుకుంటే దీనిలో అంతగా కాల్షియం ఉండదు. అయితే ఇందులో పొటాషియం, ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి.

# 17. ఖర్జూర

# 17. ఖర్జూర

ఇందులో కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటుంది. వీటిని తినడానికి చాలామంది బాగా ఇష్టపడతారు. అందువల్ల వీటిని కూడా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి.

# 18. సీతాఫలం

# 18. సీతాఫలం

కస్టర్డ్ ఆపిల్ లేదా సీతాఫలం తినడానికి కాస్త టైం పడుతుంది. కానీ ఇందులో కూడా కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. ఇవి తినడానికి కూడా బాగా రుచికరంగా ఉంటాయి. అందువల్ల వీటిని కూడా రెగ్యులర్ గా తింటూ ఉండండి.

# 19. సోయాబీన్స్

# 19. సోయాబీన్స్

పైన ఇచ్చిన వాటిలో సోయా పాలు, టోఫు గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఇవన్నీ సోయాబీన్ ఉత్పత్తులే. అయితే వీటికన్నా ఎక్కువగా సోయాబీన్స్ లో కాల్షియం ఉంటుంది. అందువల్ల వీటిని కూడా రెగ్యులర్ తీసుకుంటూ ఉండండి.

# 20. బ్రోకలీ

# 20. బ్రోకలీ

100 గ్రాముల బ్రోకలీలో 47మై.గ్రా కాల్షియం ఉంటుంది. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో భాగంగా బ్రోకలిని కచ్చితంగా తినండి. ఈ ఆహారాలన్నీ కాల్షియం పెంచేవే. అందువల్ల వీటిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి.

English summary

Top 20 Calcium Rich Foods

Calcium is an essential mineral not only because it makes our bones strong but because without it our hearts would develop arrhythmias and our muscles would start spasming like crazy!
Story first published: Thursday, November 16, 2017, 8:30 [IST]
Subscribe Newsletter