కొబ్బరి నీళ్ళలో నిమ్మరసం కలిపి తీసుకుంటే ఎమౌతుంది?

Posted By:
Subscribe to Boldsky

కొబ్బరి నీళ్ళు-నిమ్మరసం అహా ఏం కాంబినేషనేషన్. కొబ్బరి నీళ్ళ కమ్మని రుచికి, నిమ్మ ఫ్లేవర్ జోడిస్తే అద్భుతమైన డ్రింక్ తయారవ్వడమే కాదు, ఇందులో అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొబ్బరి నీళ్లు-నిమ్మరసం కాంబినేషన్ డ్రింక్ లో సహజ సిద్ధంగా లభించే ఖనిజ లవణాలు కలిగిన పానీయం.

ఏ సీజన్ అయినా తాగదగినవి నీరు... కొబ్బరి నీరు. టేస్టీగా ఉండే ఈ కొబ్బరి నీళ్ళలో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. లేత కొబ్బరి నీటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువ గాను, కొవ్వులు అస్సలుండవు, చెక్కెర శాతం పరమితంగా ఉంటుంది. కొబ్బరి బొండాం నీటిలో పొటాసియం ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి నీరు సహజ సిద్ధంగా లభించే ఖనిజ లవణాలు కలిగిన నీరు.

కొబ్బరి నీళ్ళలో నిమ్మరసం

పైగా, ముఖ్యంగా జీర్ణక్రియకు ఎంతగానో దోహదపడుతుంది. అంతేకాదు రుచికరమైన పానీయం కూడా. ఇది చిన్న పిల్లలకు మాత్రమే కాకుండా పెద్దలకు, రోగులకు ఇలా ప్రతి ఒక్కరికీ ఎంతో సురక్షితమైన పానీయం. అలాంటి కొబ్బరి నీళ్ళలో కాసింత నిమ్మరసం కలుపుకుని తాగితే మరిన్ని ఎఫెక్టివ్ బెనిఫిట్స్ పొందుతారు. నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉండే వ్యాధినిరోధకతను పెంచుతాయి. శరీరంలో, కాలేయంలో ట్యాక్సిన్స్ ను తొలగించడంలో ఈ రెండింటి కాంబినేషన్ అద్భుతంగా వర్కౌంట్ అవుతుంది. మరి ఈ రెండింటి కాంబినేషన్ డ్రింక్ తాగితే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఓ సారి పరిశీలిద్ధాం...

కొబ్బరి నీళ్లలో తేనె కలిపి పరగడపున తాగితే మిరాకిల్ బెనిఫిట్స్ ..!

డీహైడ్రేషన్ తగ్గిస్తుంది:

డీహైడ్రేషన్ తగ్గిస్తుంది:

కొబ్బరి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల సమర్థమైన టానిక్ లా పనిచేస్తుంది. డీహైడ్రేషన్ కు గురైన వారు ఎక్కువగా కొబ్బరి నీళ్ళలో నిమ్మరసం కలిపి తీసుకుంటే ఎక్కువ ఉపయోగకరం.

ఇన్ స్టంట్ ఎనర్జీని అందిస్తుంది:

ఇన్ స్టంట్ ఎనర్జీని అందిస్తుంది:

కొబ్బరి నీళ్ళలో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉండటం వల్ల శరీరానికి ఇన్ స్టాంట్ ఎనర్జీని అందిస్తుంది. నిమ్మరసం కలపడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

కిడ్నీ సమస్యలను నివారిస్తుంది:

కిడ్నీ సమస్యలను నివారిస్తుంది:

కొబ్బరి నీటిలో పొటాషియం, క్లోరిన్ తగినంత మోతాదులో ఉంది. ఇది అపరిమిత సంఖ్యలో ఉండే అల్బుమిన్, నిమ్మరసంలో ఉండే ఎసిడిక్ నేచర్ రెండు కలవడం వల్ల మూత్రపిండ సంబంధిత వ్యాధులు, మూత్ర విసర్జనలోని లోపాలు, కిడ్నీలోని రాళ్ళు వంటి సమస్యలను నివారించడంలో ప్రత్యేకంగా సహాయపడుతుంది.

వాంతులు, వికారం తగ్గిస్తుంది:

వాంతులు, వికారం తగ్గిస్తుంది:

వాంతుల దశలో ఉన్న పిల్లలు, గర్భణి మహిళలు, నిమ్మరసంతో కొబ్బరి నీరు ఇవ్వాలి. వాంతులతో బాధపడుతున్న వారికి కాసింత నిమ్మరసం కలిపిన కొబ్బరి నీళ్లు ఇస్తే వాంతులు తగ్గిపోతాయి.

అజీర్తిని తగ్గిస్తుంది:

అజీర్తిని తగ్గిస్తుంది:

జీర్ణ శక్తిని పెంచే గుణాలు కోనట్ వాటర్ మరియు నిమ్మరసంలో మెండుగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు మాయం అవుతాయి.

కడుపులో పుండు తగ్గుతుంది:

కడుపులో పుండు తగ్గుతుంది:

కడుపులో ప్రేగు నుంచి హానికరమైన బాక్టీరియాలను తొలగిస్తుంది. కొబ్బరి నీటిలో పొటాషియం, క్లోరిన్ తగినంత మోతాదులో ఉంటాయి. నిమ్మరసం మితంగా కలిపి తాగడం వల్ల స్టొమక్ అల్సర్ వంటి లక్షణాలు త్వరగా నివారించుకోవచ్చు.

నల్ల మచ్చలు తగ్గుతాయి:

నల్ల మచ్చలు తగ్గుతాయి:

ముఖంలో నల్ల మచ్చలు, మొటిమలును ఎఫెక్టివ్ గా తగ్గించే లక్షణాలు కొబ్బరి నీళ్ళు నిమ్మరసంలో అధికంగా ఉన్నాయి.

ఆస్త్మా తగ్గుతుంది:

ఆస్త్మా తగ్గుతుంది:

ఆస్త్మా తగ్గించే గుణాలు కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం మిశ్రమంలో అధికంగా ఉన్నాయి.

అధిక బరువును తగ్గిస్తుంది:

అధిక బరువును తగ్గిస్తుంది:

సహజంగా బరువు తగ్గించుకోవడానికి లెమన్ వాటర్ విత్ హనీ తీసుకుంటుంటారు. అంత కంటే మరింత ఎఫెక్టివ్ గా బరువు తగ్గించడానికి కోకనట్ వాటర్ విత్ లెమన్ కూడా గ్రేట్ గా బరువు తగ్గిస్తుంది. అదే సమయంలో శరీరానికి కావల్సిన ఎనర్జీని అందిస్తుంది.

English summary

What Happens When You Drink Coconut Water With Lemon/కొబ్బరి నీళ్ళలో నిమ్మరసం కలిపి తీసుకుంటే ఎమౌతుంది?

Both lemon water and coconut water have been hailed for their health benefits. Lemon water is a "so-called energy booster and detoxifying elixir is usually sipped to flush toxins from the body," while coconut water also works as an "excellent fluid and electrolyte replacement." However, coconut water is more often used as a replacement for sports drinks. So which is better?
Subscribe Newsletter