For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతిరోజూ పాలకూరను తినడం వల్ల కలిగే 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు !

|

'పొపాయ్ - ది సెయిలర్మాన్' అనే వాని చేతులకు బలాన్ని చేకూర్చడంలో "పాలకూర" చాలా శ్రేష్టమైన ఆహారంగా గతంలో ఉండేది. ప్రతిరోజూ పాలకూరను తినడం వల్ల మీ చేతులను బలపరుస్తుందా ? లేదా ? అనే విషయం ఖచ్చితంగా తెలియకపోయినా, హాని కలిగించే వ్యాధుల నుండి మీ శరీరాన్ని సంరక్షించే పోషకాహారంతో పాలకూర పూర్తిగా నిండి ఉంది.

ఈ గొప్ప ఆహారము కొలెస్ట్రాల్ను, చక్కెరను, అలాగే కొవ్వును కలిగి ఉండదు; ఒక కప్పు మోతాదులో ఉన్న పచ్చని పాలకూరను 7 కేలరీలను కలిగి ఉండి, శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది . ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైటో-ట్యూయురెంట్స్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఇది అత్యంత బహుముఖమైన ఆహార పదార్ధంగా ప్రజాదరణను పొందింది.

పాలకూర పిల్లలకు, పెద్దలకు అవసరమైన పోషకాలను, శక్తిని అందిస్తుంది; అంతేకాకుండా, ఇది మీ జ్ఞానశక్తిని మెరుగుపరుస్తుంది. దీనిని మీ ఆహారంలో ఒక భాగంగా చేర్చుకోవడం వల్ల, అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

కాబట్టి, పాలకూరను ప్రతిరోజు తినడంవల్ల కలిగే ప్రయోజనాలను గురించి తెలుసుకోవడానికి ఈ వ్యాసాన్ని పూర్తిగా చదవండి.

1. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి :

1. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి :

పాలకూర వంటి ఆకుకూరలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. US డిపార్టుమెంటు అఫ్ అగ్రికల్చర్ ప్రకారం, 1 కప్పు పచ్చి పాలకూరలో కేవలం 7 కేలరీలను మాత్రమే కలిగి ఉంటుంది, త్వరగా బరువు తగ్గాలని కోరుకునే వారికి ఇది చాలా మంచిది. పాలకూరలో 1 గ్రాము - ప్రోటీన్లను, 1 గ్రాము - పిండి పదార్థాలను, 0.7 గ్రాముల - ఫైబర్ను కలిగి ఉంది.

2. మెదడు పనితీరును వేగవంతం చేస్తుంది :

2. మెదడు పనితీరును వేగవంతం చేస్తుంది :

ఈ పాలకూరను, మెదడుకు అవసరమైన ఆహారముగా పరిగణించబడుతుంది. ఇది ఫోలిక్ ఆమ్లం, విటమిన్ A, విటమిన్ B6, విటమిన్ C వంటి ఖనిజాలతో పాటు, అనేక ఇతర యాంటీ-ఆక్సిడెంట్లను కూడా కలిగి ఉంది. ఇది సహాయం న్యూరోనల్స్ను క్షీణించకుండా రక్షించడంలో సహాయపడుతుంది. మీ జ్ఞాపకశక్తిని కూడా పెంపొందిస్తుంది.

3. విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి :

3. విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి :

ప్రతిరోజూ పాలకూరను తినడం వల్ల, మీ రోజువారీ పోషక అవసరాలను తీర్చటానికి సహాయపడుతుంది. ఈ పాలకూర ఆకులలో ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్ మొదలైన వాటితో పూర్తిగా నిండి ఉంటాయి. మధుమేహం, మూత్రపిండాలలో రాళ్ళు, క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల నుంచి మిమ్మల్ని రక్షించటానికి ఇది సహాయపడుతుంది.

4. మీ కంటిచూపును పరిరక్షిస్తుంది :

4. మీ కంటిచూపును పరిరక్షిస్తుంది :

బీటా-కరోటిన్, క్వాతెన్, లుటీన్ వంటి గొప్ప వనరులకు పాలకూరయే మూలం. ఈ యాంటీ-ఆక్సిడెంట్లన్నీ కూడా మీ కంటి చూపుకు లాభదాయకంగా ఉంటుందని భావిస్తారు. అంతేకాక వీటిలో ఉన్న విటమిన్-A మీ కంటి చూపు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, అలానే మీ కళ్ళ మంటలను (లేదా) చికాకులను కూడా నిరోధిస్తుంది.

5. బోలు ఎముకల వ్యాధి నుండి ఉపశమనమును కలిగిస్తుంది :

5. బోలు ఎముకల వ్యాధి నుండి ఉపశమనమును కలిగిస్తుంది :

ఈ పాలకూరలో విటమిన్ K పుష్కలంగా లభించడం వల్ల మీ ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచబడుతుంది. ఇది బోలు ఎముకల వ్యాధికి చికిత్స చేసి, దానిని నిరోధించగలదు. కాబట్టి, ప్రతిరోజు పాలకూరను తినడం వల్ల బోలు ఎముకల వ్యాధికి వ్యతిరేకంగా పోరాడటంలో సహాయపడుతుంది.

6. కండరాలకు తగిన శక్తినిస్తుంది :

6. కండరాలకు తగిన శక్తినిస్తుంది :

మీ చేతులు, కడుపు భాగాలలో ఉన్న కండరాలు బాగా వదులుగా ఉన్నట్లయితే, ఈ పరిస్థితి నుంచి మీరు బయటపడటానికి వారంలో ప్రతిరోజూ తప్పకుండా పాలకూరను తినడం ప్రారంభించండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, రక్తంలో ఎక్కువ ఆక్సిజన్ స్థాయిని శరీరంలోని వివిధ భాగాలకు అందించడం ద్వారా కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

7. జీవప్రక్రియను మెరుగుపరుస్తుంది :

7. జీవప్రక్రియను మెరుగుపరుస్తుంది :

పాలకూరలో ప్రోటీన్లు చాలా అధిక మొత్తంలో పూర్తిగా నిండి ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని కలిగి ఉండి, జీవక్రియను మెరుగుపరుస్తుంది. పాలకూరలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వలన మీ కడుపు పూర్తిగా నిండిన అనుభూతిని ఎక్కువ కాలం పాటు ఉంచుతుంది.

8. వాపులను నిరోధిస్తుంది :

8. వాపులను నిరోధిస్తుంది :

పాలకూర శోథ నిరోధకత లక్షణాలను కలిగి ఉంది. ఇందులో శోథ నిరోధక సమ్మేళనాలను, అనామ్లజనకాలను (యాంటీఆక్సిడెంట్లను) ఎక్కువగా కలిగి ఉంటుంది. కాబట్టి ఇది శరీరంలో వచ్చే వాపులను నివారించి, దానిని చికిత్స చేయడంలో సహాయపడుతుంది.

9. ఎథెరోస్క్లెరోసిస్ను నిరోధిస్తుంది :

9. ఎథెరోస్క్లెరోసిస్ను నిరోధిస్తుంది :

మీ ధమనులు బాగా గట్టిపడి ఉన్నప్పుడు "ఎథెరోస్క్లెరోసిస్" అనేది ఏర్పడుతుంది. ప్రతిరోజూ పాలకూరను తినడం వల్ల ఎథెరోస్క్లెరోసిస్ను, సెరెబ్రల్-వాస్క్యులార్ వంటి ప్రమాదాలనే కాక, గుండెపోటు ప్రమాదాల తీవ్రతను కూడా తగ్గిస్తుంది.

10. బరువు తగ్గడానికి మంచిది :

10. బరువు తగ్గడానికి మంచిది :

ప్రతిరోజూ పాలకూరను తినడం వల్ల మీ శరీరంలో అదనంగా ఉన్న పౌండ్లను తొలగించటానికి సహాయపడుతుంది. నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, 1200 - 1600 కేలరీలను కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గటానికి చాలా సహాయకారిగా ఉంటుంది. మరింత వేగవంతమైన బరువును కోల్పోవాలనుకునే ప్రక్రియలో పాలకూర మీకు సరిగ్గా సహాయం చెయ్యగలదు.

English summary

10 Benefits Of Eating Spinach Every Day

10 Benefits Of Eating Spinach Every Day, Spinach provides essential nutrients and energy to kids and adults alike. Know about the benefits of eating spinach every day.
Story first published: Friday, March 16, 2018, 12:00 [IST]