దానిమ్మ గింజల 10 ఆరోగ్య లాభాలు

By: Deepthi TAS
Subscribe to Boldsky

దానిమ్మ పండ్లలో ఉండే తినగలిగే విత్తనాలలాంటి గింజలను దానిమ్మ గింజలు అంటారు. పరిశోధనల ప్రకారం దానిమ్మ గింజలు, అధిక రక్తపోటు, ఎక్కువ కొలెస్ట్రాల్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు వాపులు వంటి వివిధ వ్యాధులు వచ్చే రిస్క్ లను నియంత్రించటం, తగ్గించటం చేస్తాయి.

దానిమ్మ గింజలను నేరుగా పచ్చిగా తింటారు లేదా దానిమ్మ రసం తీసుకుని తాగుతారు. ఒక దానిమ్మ పండులో దాదాపు 600 గింజలు ఉంటాయి. వీటిల్లో పోషకాలు చాలా నిండి ఉంటాయి. ఈ దానిమ్మ గింజల నుంచి దానిమ్మ నూనెను తయారుచేస్తారు, ఇది శరీరం లోపల, బయట, ఆరోగ్యానికి చాలా సానుకూల ప్రభావాలు చూపిస్తుంది.

దానిమ్మ గింజలలో వివిధ విటమిన్లు అయిన విటమిన్ బి, సి మరియు కె, ఇంకా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. విటమిన్ సి వయస్సు మీరే లక్షణాలను నెమ్మది చేస్తుంది మరియు చర్మం వాపులతో పోరాడుతుంది.

అందుకని, దానిమ్మ గింజల ఆరోగ్య లాభాలను ఈ కింద చదవండి.

10 Health Benefits Of Pomegranate Seeds

1. లైంగిక కోరికలను పెంచే సహజపదార్థం

దానిమ్మ గింజలలో రక్తపోటు, మరియు మూడ్ పై సానుకూల ప్రభావాలు చూపే లక్షణాలు ఉంటాయి. ఈ గింజలు రక్తప్రసరణను పెంచి అంగస్థంభన సమస్యలను నయం చేస్తాయి. ఇవి టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిని కూడా పెంచి తద్వారా లైంగిక కోరికలను పెంచుతాయి.

2. ఆర్థరైటిస్ ను తగ్గిస్తుంది

2. ఆర్థరైటిస్ ను తగ్గిస్తుంది

దానిమ్మ గింజలు కీళ్లవాతాన్ని మరియు ఆర్థరైటిస్ జబ్బును నయం చేస్తాయి. ఎందుకంటే వీటిల్లో ఫ్లేవనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపులను తగ్గించటానికి పనిచేస్తాయి. మీకు కీళ్ల నొప్పులు ఉంటే తరచుగా దానిమ్మలను తింటూ ఉండండి.

3. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

3. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

దానిమ్మ గింజలు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే ఆంటీయాక్సిడెంట్లు మంచి కొలెస్ట్రాల్ పనితీరును మెరుగుపర్చి, హానికారక ఆక్సీకరణం చెందిన లిపిడ్లను విఛ్చిన్నం చేస్తాయి, అలా ఆర్థెరోస్క్లెరోసిస్ రిస్క్ ను తగ్గిస్తాయి.

4. క్యాన్సర్ ను నివారిస్తుంది

4. క్యాన్సర్ ను నివారిస్తుంది

దానిమ్మ గింజల వలన ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ నివారించబడుతుంది. ఈ గింజలలో వుండే క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కాన్సర్ కణాలు పాకకుండా, ఎక్కువగా పెరగకుండా, మరియు క్యాన్సర్ సోకిన కణాలు చనిపోయేలాగా పురిగొల్పుతాయి.

5. మధుమేహానికి మంచిది

5. మధుమేహానికి మంచిది

దానిమ్మ గింజలు డయాబెటిస్ వారికి చాలా ఉపయోగకరం. ఈ గింజలలో ఉండే కొన్నిరకాల యాసిడ్లు మధుమేహ వ్యతిరేక లక్షణాలను కలిగిఉంటాయి. దానిమ్మ గింజలలో కల పిండి పదార్థాలలో కూడా కొన్ని ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్లు ఉండి అవి టైప్ 2 డయాబెటిస్ ను నివారించటంలో సాయపడతాయి.

6. వాపులతో పోరాడటంలో సాయపడుతుంది

6. వాపులతో పోరాడటంలో సాయపడుతుంది

దానిమ్మ గింజలను తినటం వలన వాపులు మరియు వాపు సంబంధ డిజార్డర్లతో పోరాటంలో సాయం లభిస్తుంది. అధ్యయనాలలో తేలింది ఏమిటంటే దానిమ్మ గింజలు తినడం వలన ఫ్రీగా తిరిగే హానికర రాడికల్స్ వల్ల జరిగే ఆక్సిడేటివ్ నష్టాన్ని మరియు వాపును తగ్గిస్తాయి.

7. పళ్ళను బలపరుస్తుంది

7. పళ్ళను బలపరుస్తుంది

దానిమ్మ గింజలు చిగుళ్ళను బలపర్చి, వదులుగా మారిన పళ్ళను గట్టిపరుస్తాయి. ఈ గింజలు నోటిలోని బ్యాక్టీరియాతో కూడా తమలోని సూక్ష్మజీవుల వ్యతిరేక లక్షణాల వలన పోరాడుతాయి.

8. జీర్ణశక్తిని పెంచుతుంది

8. జీర్ణశక్తిని పెంచుతుంది

దానిమ్మ గింజలు జీర్ణ వ్యవస్థను మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి, ఎందుకంటే వీటిలో బి- కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. ఈ విటమిన్లు మీ శరీరంలోని కొవ్వులు, ప్రొటీన్లు మరియు కార్బొహైడ్రేట్లను శక్తిగా మార్చటానికి సాయపడతాయి. దానిమ్మ గింజలలో ఉండే పీచు పదార్థం జీర్ణప్రక్రియకి ముఖ్యం.

9. బరువు తగ్గటానికి సాయపడుతుంది

9. బరువు తగ్గటానికి సాయపడుతుంది

మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? దానిమ్మ గింజలను తినండి, అవి బరువు తగ్గటంలో సాయపడతాయి. వాటిల్లో ఉండే పీచుపదార్థం చాలాసేపు వరకు మీ కడుపు నిండి వున్న ఫీలింగ్ కలిగిస్తుంది. దానిమ్మ గింజలు స్థూలకాయాన్ని కూడా నివారించి, కొవ్వును కరిగించటంలో సాయపడతాయి.

10. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది

10. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది

దానిమ్మ గింజలలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. ఈ గింజలు వివిధ వ్యాధులను తెచ్చి మీ రోగనిరోధక వ్యవస్థను బలహీనపర్చే బ్యాక్టీరియా మరియు వైరస్ లతో అద్భుతంగా పోరాడతాయి. అందుకని, ఈ గింజలు అలా మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.

ఈ ఆర్టికల్ ను పంచుకోండి!

మీకు ఈ ఆర్టికల్ నచ్చినట్లయితే, మీ దగ్గరివారితో షేర్ చేయండి.

English summary

10 Health Benefits Of Pomegranate Seeds 

10 Health Benefits Of Pomegranate Seeds,Pomegranate seeds contain several vitamins like vitamins B, C, K and antioxidants. Read the 10 health benefits of pomegranate seeds.
Story first published: Monday, February 5, 2018, 15:00 [IST]
Subscribe Newsletter