పీనట్ బటర్ ద్వారా కలిగే 12 ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలివే

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

పీనట్ బటర్ కేవలం రుచికరమైనది మాత్రమే కాదు ఆరోగ్యకరమైనది కూడా. దీనిలో పోషకవిలువలు అనేకం. ఇది కేవలం స్కూల్ లంచెస్ కి మాత్రమే పరిమితమైనది కాదు, దీనిని స్నాక్ లా కూడా తీసుకోవచ్చు. అదే సమయంలో, స్మూతీస్ తో కలిపి ప్రోటీన్ షేక్ గా కూడా తీసుకోవచ్చు.

మృదువైన పీనట్ బటర్ అనేది ఫ్రూట్స్ నుంచి చాకోలెట్స్ వరకు అన్నిటికి జోడీగా సరిపోతుంది. మోనో అన్సాట్యురేటెడ్ ఫ్యాట్స్ తో పాటు పోషకవిలువలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. అందువలనే, అధిక బరువును తగ్గాలనుకునే వారికిది ఇష్టమైన ఆహారపదార్థం. పీనట్ బటర్ లో అధిక ప్రోటీన్లు అలాగే ఆరోగ్యకరమైన నూనెలు లభ్యమవుతాయి. ఇవి డయాబెటీస్ ని అలాగే అల్జీమర్ వ్యాధిని నిరోధించేందుకు ఉపయోగపడతాయి.

పీనట్ బటర్ ని తీసుకోవడం ద్వారా గుండె జబ్బులకు గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. పీనట్ బటర్ అనేది కొవ్వు రూపంలో శరీరంలో పేరుకోబడదు. రెండు టేబుల్ స్పూన్ల పీనట్ బటర్ నుంచి188 కేలరీలు, 8 గ్రాముల ప్రోటీన్, 6 గ్రాముల కార్బోహైడ్రేట్స్ తో పాటు 16 గ్రాముల కొవ్వు లభిస్తుంది.

పీనట్స్ కి మీరు అలర్జిక్ కాకపోతే ప్రతి రోజు శాండ్విచ్ పైన అలాగే టోస్ట్ పైన దీనిని స్ప్రెడ్ చేసి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

పీనట్ బటర్ ని తీసుకోవడం వలన కలిగే 12 ఆరోగ్యప్రయోజనాలివే. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ప్రోటీన్ లు పుష్కలంగా లభిస్తాయి

1. ప్రోటీన్ లు పుష్కలంగా లభిస్తాయి

100 గ్రాముల పీనట్ బటర్ నుంచి అధిక మోతాదులో ప్రోటీన్ అనేది లభ్యమవుతుంది. అంటే దాదాపు 25 నుంచి 30 గ్రాముల ప్రోటీన్ అనేది లభ్యమవుతుంది. మన శరీరానికి ప్రోటీన్ అనేది అత్యంత అవసరం. మనం తినే ఆహారం అమినో యాసిడ్స్ గా మారుతుంది. ఆ తరువాత అవి శరీరంలోని ప్రతి సెల్ మరమత్తుకి అలాగే కొత్త సెల్స్ నిర్మాణానికి ఉపయోగపడతాయి.

2. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది

2. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది

పీనట్ బటర్ లో లభించే ఫ్యాట్ కంటెంట్ అనేది ఆలివ్ ఆయిల్ లో లభించే ఫ్యాట్స్ తో సమానంగా లభిస్తాయి. ఇందులో మోనో అన్ సాట్యురేటెడ్ ఫ్యాట్స్ అనేవి లభిస్తాయి. మీ గుండె ఆరోగ్యానికి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా వీటిని తీసుకోవచ్చు. పీనట్ బటర్ లో లభించే ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ అనేవి శరీరంలోని చెడ్డ కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలని పెంపొందిస్తాయి.

3. టైప్ 2 డయాబెటిస్ ని నివారిస్తుంది

3. టైప్ 2 డయాబెటిస్ ని నివారిస్తుంది

పీనట్ బటర్ ని తీసుకోవడం ద్వారా డయాబెటిస్ బారిన పడే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. పీనట్ బటర్ లో లభించే అన్ సాట్యురేటెడ్ యాసిడ్స్ అనేవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచేందుకు ఉపయోగపడతాయి. అధ్యయనాల ప్రకారం పీనట్ బటర్ ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ కి గురయ్యే ప్రమాదపు స్థాయిలను తగ్గించుకునే అవకాశం ఉంది.

4. విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి

4. విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి

పీనట్ బటర్ లో విటమిన్లు అధిక సంఖ్యలో లభ్యమవుతాయి. ఇవి శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్లు. ఇందులో లభించే విటమిన్ ఏ వలన కంటిచూపు మెరుగవుతుంది. విటమిన్ సి వలన రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అలాగే చిన్నపాటి అల్సర్లు వేగంగా నయమవుతాయి. అలాగే, విటమిన్ ఈ అనేది శరీరానికి అవసరమయ్యే మైక్రో న్యూట్రియెంట్. దీని వలన ఆర్టెరీస్ లోని కాంప్లెక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి త్వరగా కరిగిపోతాయి.

5. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు

5. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు

ఫోలేట్, నియాసిన్, రైబోఫ్లేవిన్, థయామిన్ మరియు రెస్వెరాట్రాల్ వంటివి కలిగి ఉండటం వలన పీనట్ బటర్ అనేది యాంటీ ఆక్సిడెంట్స్ కి గొప్ప నిలయమని చెప్పుకోవడంలో సందేహం లేదు. రెస్వెరాట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ అనేది కొన్ని రకాల క్యాన్సర్లని నియంత్రించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే గుండె జబ్బులను, అల్జీమర్ వ్యాథిని అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ని తగ్గించటానికి ఇవి ఉపయోగపడతాయి.

6. క్యాన్సర్ ని అరికడుతుంది

6. క్యాన్సర్ ని అరికడుతుంది

పీనట్ బటర్ లో బి సైటోస్టెరాల్ అనే ఫైటోస్టెరాల్ అనేది లభ్యమవుతుంది. దీనికి క్యాన్సర్ ని ఎదుర్కొనే గుణం ఉంది. ప్రత్యేకించి కొలోన్, ప్రోస్ట్రేట్ అలాగే బ్రెస్ట్ క్యాన్సర్లను ఎదుర్కొనేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. పీనట్స్ ని తినడం ద్వారా అలాగే పీనట్ బటర్ ని తీసుకోవడం ద్వారా మహిళలలో కొలోన్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గించవచ్చు.

7. బ్లడ్స్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది

7. బ్లడ్స్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది

మెగ్నీషియం అనేది పీనట్ బటర్ లో సమృద్ధిగా లభిస్తుంది. కండరాలు, ఎముకలు అలాగే రోగనిరోధక శక్తి మెరుగుదలకు ఈ ముఖ్యమైన మినరల్ అనేది అనేకరకాలుగా తోడ్పడుతుంది. అలాగే, శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ ని నియంత్రించేందుకు ఆలాగే బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ లో ఉంచేందుకు సహకరిస్తుంది.

8. పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది

8. పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది

పీనట్ బటర్ లో 100 గ్రాముల పొటాషియం లభిస్తుంది. ఇది ఎలెక్ట్రోలైట్ గా పనిచేసి శరీరంలోని ఫ్లూయిడ్స్ ని బాలన్స్ చేస్తుంది. పొటాషియం అనేది రక్తంపై ఎటువంటి ఒత్తిడిని కలుగచేయదు. ఇది హార్ట్ ఫ్రెండ్లీ మినరల్. ఇది పీనట్ లో అధిక మోతాదులో లభిస్తుంది. అందువలన, కార్డియోవాస్కులర్ సిస్టం పై దీని వలన దుష్ప్రభావం కలగదు.

9. గాల్ స్టోన్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

9. గాల్ స్టోన్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

బర్త్ కంట్రోల్ పిల్స్ ని వాడటం వలన, క్రాష్ డైట్స్ ని పాటించడం వలన అలాగే అధిక బరువు సమస్య కలిగిన వారిలో గాల్ స్టోన్స్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. పేరుపొందిన అద్యయనం ప్రకారం పీనట్స్ ని తీసుకోవడం వలన గాల్ స్టోన్స్ ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. వీటిని ఎక్కువగా తీసుకునే మహిళలలో గాల్ స్టోన్స్ ఏర్పడే ప్రమాదం తక్కువని అధ్యయనాలు స్పష్టం చేశాయి.

10. డైటరీ ఫైబర్ అధికంగా లభిస్తుంది

10. డైటరీ ఫైబర్ అధికంగా లభిస్తుంది

పీనట్ బటర్ లో డైటరీ ఫైబర్ అధికంగా లభిస్తుంది. ఒక కప్పుడు పీనట్ బటర్ లో 20 గ్రాముల డైటరీ ఫైబర్ లభిస్తుంది. ఇది రోజువారీ డైట్ లో తప్పక ఉండాల్సిన మోతాదు. డైటరీ ఫైబర్ తగిన మోతాదులో శరీరానికి లభించకపోతే అనేక ఆరోగ్యసమస్యలతో పాటు వ్యాధులు తలెత్తుతాయి.

12. ప్రశాంతపరుస్తుంది

12. ప్రశాంతపరుస్తుంది

ప్రతిరోజూ ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్ ని తీసుకోవడం ద్వారా ఒత్తిడిని అదుపులో ఉంచుకోవచ్చు. పీనట్ లో లభించే బీటా సైటోస్టెరాల్ అనేది కార్టిసోల్ స్థాయిలని నియంత్రించే ప్లాంట్ స్టెరాల్. ఆ విధంగా, ఒత్తిడి వలన ఏర్పడే ఇబ్బంది తొలగిపోతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

English summary

12 Health Benefits Of Peanut Butter That Will Surprise You

Peanut butter is high in monounsaturated fats and full of nutrients, which is why peanut butter benefits weight loss lovers. Peanut butter also consists of high protein and healthy oils that help in diabetes and even Alzheimer's disease prevention. Eating two tablespoons of peanut butter will provide you with 188 calories, and 6 grams of carbohydrates.
Story first published: Wednesday, January 17, 2018, 19:00 [IST]
Subscribe Newsletter