Just In
- 8 hrs ago
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- 9 hrs ago
పెళ్లి తర్వాత సెక్స్ లైఫ్ గురించి ఎక్కువమంది అబద్ధాలే చెబుతారని మీకు తెలుసా...!
- 9 hrs ago
Winter Tips: ఈ 5 ప్రభావవంతమైన చిట్కాలతో ఈ శీతాకాలంలో మీ పొడి చర్మాన్ని తేమగా చేయండి..
- 10 hrs ago
Winter Tips: మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి స్నానం చేసేటప్పుడు ఆయుర్వేదంలో ఈ చిట్కాలను అనుసరించండి!
Don't Miss
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Movies
పుష్ప కోసం మరో కొత్త విలన్.. ఇదైనా నిజమవుతుందా?
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాదం పిండి మిగిలిన అన్నిటికన్నా శ్రేయస్కరం ఎందుకని?
మీకు బాదంపప్పులను స్నాక్స్ వలె తీసుకునే అలవాటు ఉందా? అవును, అయితే గోధుమ వంటి ఇతర పిండి ఆధారిత పదార్ధాలను బాదంపిండితో భర్తీచేయాల్సిన అవసరం లేదు. కానీ బాదం అలవాటు లేని వారికి మాత్రం, బాదాన్ని తమ ఆహారప్రణాళికలో చేర్చుకోవలసిన అవసరం ఉంది. బాదం, దాని పోషకవిలువలు మరియు ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా, అందరి మన్ననలు అందుకుంటుంది. మిగిలిన అనేక నిల్వ ఉంచిన పిండిపదార్ధాల కన్న(ఉదాహరణ:గోధుమపిండి) కన్నా అధిక పోషక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. గ్లూటెన్-ఫ్రీ మరియు తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన వంటలలో ఉపయోగించే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతుంది.
అసలు బాదంపిండి ఏమిటి మరియు ఎలా తయారవుతుంది?
బాదం పిండి, లేత మరియు తొక్కతీసి ఎండబెట్టిన బాదం పప్పుల నుండి తయారు చేస్తారు. బాదం పప్పులను వేడినీళ్ళలో నానబెట్టి, తొక్కతీసి, తడి పూర్తిగా ఆరాక, గ్రైండ్ చేసి పిండిగా చేయాలి. ఈ పిండి ఒక తేలికపాటి రంగును మరియు ఆకృతిని కలిగి ఉండి తీయని, మృదువైన రుచిని కలిగి ఉంటుంది.
ఆల్మాండ్ పిండి యొక్క పోషక విలువలు:
USDA ప్రకారం, 100గ్రాముల బాదం పిండిలో 571 కిలోకేలరీల శక్తి, 21.43గ్రా మాంసకృత్తులు, 50గ్రా కొవ్వు, 21.43గ్రా కార్బోహైడ్రేట్లు, 10.7గ్రా ఫైబర్, 286mg కాల్షియం, 3.86mg ఇనుము, 286mg మెగ్నీషియం, 536mg భాస్వరం, 714mg పొటాషియం, 1.071mg రాగి, 2mg మాంగనీస్, మొత్తం అసంతృప్త కొవ్వు ఆమ్లాలు 32g, మరియు మొత్తం బహుళఅసంతృప్త కొవ్వు ఆమ్లాలు 12.5గ్రా ఉంటాయి.

1. రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది
శుద్ధి చేసిన(రీఫైండ్) గోధుమపిండి, కార్బోహైడ్రేట్లలో అధికంగా ఉంటుంది. ఫైబర్ మరియు కొవ్వులలో తక్కువగా ఉంటుంది. చక్కెర స్థాయిలు మరియు కేలరీల సంఖ్య అధికంగా ఉన్న ఆహారాలను మీ ఆహారప్రణాళికలో చేర్చుకోవడం ద్వారా, రక్తoలో చక్కెర స్థాయిల పెరుగుదలకు కారణమవుతుంది. బాదంపిండి కార్బోహైడ్రేట్లలో మాత్రమే కాకుండా, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ఫైబర్లో ఎక్కువగా ఉంటుంది. ఇది తక్కువ గ్లైసెమిక్-ఇండెక్స్ ఆహారంగా ఉంటుంది. అనగా, శరీరానికి శక్తిని అందించే క్రమంలో మీ రక్తప్రవాహంలోకి నెమ్మదిగా చక్కెరను విడుదల చేసే సామర్ధ్యాలను కలిగి ఉంటుంది.

2. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది
చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తూ, రక్తo గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా, రక్తపోటును తగ్గించడం ద్వారా మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం బాదంపిండిలో ఉండే అసంతృప్త కొవ్వు ఆమ్లాలతో కలిపి శరీరానికి కావలసిన అన్నిరకాల విటమిన్ మరియు ఖనిజాల అవసరాలను తీరుస్తుంది.

3. ఎముక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది
ఎముక ఆరోగ్యానికి దోహదపడే కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఎన్నో ఖనిజాలు బాదంపిండిలో ఉంటాయి. దీనిని పాలతో పోల్చినప్పుడు పోషకాహారంలో రెట్టింపుగా ఉంటుంది. కావున, పాలఉత్పత్తులను ఇష్టపడని వారికి బాదంపిండి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. క్రమంగా ఎముకల ఆరోగ్యానికి అవసరమయ్యే, కాల్షియం మరియు ఇతర ఖనిజాలను సరైన రీతిలో పొందవచ్చు.
Most Read: భార్య ప్రెగ్నెన్సీతో పుట్టింటికి వెళ్లడంతో ఆమెతో సంబంధం పెట్టుకున్నా, ఇప్పుడు భయమవుతోంది

4. కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది
బాదంపిండి, ప్రోటీన్ యొక్క మంచి మొతాదులను కలిగి ఉన్నందున, ఇది కండరాల ద్రవ్యరాశిని నిర్మించడంలో సహాయపడుతుంది. ప్రోటీన్ మీ శరీరకండరాల నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తుంది. మీరు వ్యాయామం లేదా అధిక శ్రమ చేస్తున్నప్పుడు, మీ శరీరానికి సరైన మోతాదులో ప్రోటీన్ నిక్షేపాలను ఇచ్చేలా ప్రణాళికలు చేసుకోవలసి ఉంటుంది. వ్యాయామం చేసేవారు ఎక్కువగా whey పౌడర్ వినియోగిస్తుంటారు. దానికి బదులుగా ఈ బాదంపిండిని వినియోగించడం మూలంగా అద్భుతమైన ప్రయోజనాలను పొందగలరని సూచించబడింది.

5. చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది
చర్మం మరియు జుట్టుకు మంచి ఆరోగ్యం అందివ్వడంలో విటమిన్-E ఎలా దోహదం చేస్తుందో మనందరికీ తెలుసు. వృద్దాప్య చాయల నుండి చర్మాన్ని కాపాడడంలో మరియు నునుపైన శిరోజాలను ఇవ్వడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. ఇది ప్రతిక్షకారిణి వలె పనిచేస్తుంది. బాదంపిండిని తీసుకోవడం మూలంగా చర్మాన్ని నాశనంచేసే స్వేచ్ఛారాశులు( ఫ్రీ-రాడికల్స్) గా పోరాడడంలో సహాయపడుతుంది. మరియు మీ జుట్టును, చర్మాన్నిఆరోగ్యకర రీతిలో మృదువుగా, మెరిసేలా ఉంచడంలో సహాయం చేస్తుంది.

6. బరువు కోల్పోవడంలో అత్యుత్తమంగా పనిచేస్తుంది.
బాదంపిండి ఆరోగ్యకరమైన కొవ్వులు, మాంసకృత్తులు, ఫైబర్ వంటి నిక్షేపాలలో అధికంగా ఉండడంతో పాటు, గ్లూటెన్ రహిత ఆహార పదార్ధంగా ఉంటూ, కార్బోహైడ్రేట్లలో తక్కువగా ఉంటుంది. క్రమంగా ఇది బరువును తగ్గించడంలో అత్యుత్తమంగా పనిచేస్తుంది కూడా. ఊబకాయం, అధిక బరువు సమస్యలతో బాధపడుతున్న వారికి సరైన ఎంపికగా ఉంటుంది. ఈ బాదం పిండిలో ఉన్న ఫైబర్ నిల్వలు, అవాంఛిత ఆహార కోరికలను నిరోధించడం ద్వారా, ఊబకాయం తగ్గించడంలో ప్రధానపాత్ర పోషించగలదు.
Most Read: ఏ సమయంలో సెక్స్ చేస్తే నా భార్య బాగా సంతృప్తి చెందుతుంది? ఆ టైమ్ లో మూడ్ బాగుంటుందా?

7. పెద్దప్రేగు క్యాన్సర్ నిరోధిస్తుంది
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, పరిశోధకుల నివేదికల ప్రకారం. బాదం, పెద్దప్రేగు కాన్సర్ సమస్యలను సైతం తగ్గించగలవు. పెద్దప్రేగు మరియు పురీషనాళం లైనింగ్లో అసాధారణంగా అనారోగ్యకర ట్యూబ్స్ ఏర్పడుతాయి. ఇవి కణుతుల సమూహాలుగా ఉంటాయి, క్రమంగా పెద్దప్రేగు కాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. ఫైబర్ నిక్షేపాలు అధికంగా ఉన్న బాదం పిండి వినియోగం, జీవక్రియలను జీర్ణక్రియలను సజావుగా సాగడంలో సహాయం చేయడం ద్వారా, పెద్దప్రేగు కాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఈ పెద్ద కాన్సర్ సమస్య, ఏదైనా కడుపు సంబంధిత అసాధారణ ఆరోగ్య సమస్యల కారణంగా కొలొనోస్కోపీ (పురీషనాళం గుండా ట్యూబ్ పంపించి చేసే పరీక్ష) వంటి పరీక్షలను వైద్యులు సూచించినప్పుడు మాత్రమే బయటపడుతుంటాయి. మరియు ఈపరీక్ష సమయంలో, పెద్దపేగులో అడ్డంగా ఉన్న కణుతులను, ఎరిత్మా మరియు వ్యర్ధాలనుసైతం తొలగించడం జరుగుతుంది. క్రమంగా పెద్దపేగు కాన్సర్ లేని వాళ్లకు, భవిష్యత్తులో వచ్చే అవకాశాలను సైతం తగ్గించవచ్చు.

8. శక్తిస్థాయిలను మెరుగుపరుస్తుంది
బాదం పిండిలో రిబోఫ్లావిన్(బి2-విటమిన్), మాంగనీస్ మరియు రాగినిల్వలు కారణంగా శరీరానికి అవసరమైన శక్తిని ఉత్పత్తి చేయడంలో మాత్రమే కాకుండా, ఎర్రరక్తకణాల సృష్టి, పెరుగుదల, అభివృద్ధి మరియు సెల్యులార్ ఫంక్షన్లో ప్రధానపాత్ర పోషిస్తుంది. అదనంగా, వివిధ సూక్ష్మపోషకాల ఉనికి కారణంగా శరీరానికి అద్భుతమైన శక్తిని అందివ్వడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
బేకింగ్ మరియు వంటలో బాదం పిండిని ఎలా ఉపయోగించాలి ?
అనేకరకాల బేకింగ్ వంటకాల్లో, బాదం పిండిని, రీఫైండ్ గోధుమ పిండికి బదులుగా వినియోగించవచ్చు. చేప, చికెన్ మరియు కూరగాయలను వండే క్రమంలో బ్రెడ్క్రంబ్స్ బదులుగా బాదం పిండిని ఉపయోగించవచ్చు.
Most Read: సంభోగం ముందు & తర్వాత పాటించవలసిన 12 ఆరోగ్య నియమాలు