వీటి యొక్క కలయిక మీ ఆరోగ్యానికి చాలా ఇబ్బందికరం !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

అన్ని రకాల ఆహార పదార్థాలు కలయిక వల్ల ఏర్పడిన మిశ్రమాలు సురక్షితంగా ఉండవు. అవును, ఇది కొన్ని రకాల పండ్లు మరియు కూరగాయలకు వర్తిస్తుంది.

ఉదాహరణకు, నారింజ మరియు క్యారెట్లను కలిపి వినియోగించకూడదు. మీరు ఎలాంటి ఆమ్లత్వమును కలిగి లేకపోతే మాత్రమే ఈ రెండూ వేరువేరు పండ్లను కలిపి తినవచ్చు.

ఉదాహరణకు, పుచ్చకాయను - యాపిల్స్ను మరియు రేగు పళ్లను కలిపి తినవచ్చు.

ద్రాక్ష, నిమ్మ కాయలు, నారింజ, బ్లూబెర్రీ మరియు కీవీ పండ్లలో ఆమ్లత్వమును కలిగి ఉంటాయి అందువల్ల వాటిని ఇతర పండ్లతో కలిపి తినకూడదు.

రాస్ప్బెర్రీస్, మామిడి, ఆపిల్స్ మరియు స్ట్రాబెర్రీ వంటి వాటిలో తక్కువ మోతాదులో ఆమ్లత్వమును కలిగి ఉంటుంది. అవోకాడో, బాదం, వేరుశెనగలు, వాల్నట్స్, కొబ్బరికాయలను తటస్థమైన వాటిగా భావిస్తారు. కాబట్టి, వాటిని కలిపి తినవచ్చు.

ఈ క్రింది తెలిపిన కొన్ని కలయికలను ఖచ్చితంగా నివారించాలి. అవి,

పాలు + పైనాపిల్ :

పాలు + పైనాపిల్ :

మీరు పాలను మరియు పైనాపిల్లను కలిపి తినేటప్పుడు మీకు వికారం, ఇన్ఫెక్షన్లు, రచనలు, తలనొప్పి మరియు కడుపునొప్పి వంటి కొన్ని దుష్ప్రభావాలతో బాధపడతారు. ఎందుకంటే, బ్రోమెలైన్ మరియు లాక్టిక్ ఆమ్లము యొక్క కలయిక మంచిది కాదు.

క్యారెట్ + నారింజ :

క్యారెట్ + నారింజ :

మీరు జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే, ఈ కలయిక మిమ్మల్ని మరింతగా దిగజారుస్తుంది. అవును, ఈ కలయికలో ఆమ్లత్వం ప్రతిబింబించడం వల్ల కలిగే దుష్ప్రభావాలలో కిడ్నీ సమస్యలు ఛాతిమంట అనేవి సంభవించవచ్చు.

పుడ్డింగ్ (మెత్తని ఆహారం) + అరటి పండు :

పుడ్డింగ్ (మెత్తని ఆహారం) + అరటి పండు :

మీ శరీరం ఆ రెండింటినీ జీర్ణం చేసుకోవడం చాలా కష్టతరము కావచ్చు. కాబట్టి, మీరు కొంతకాలం పాటు మగతగా ఉన్న స్థితిని అనుభవిస్తారు. అలాగే, వీటి కలయిక విషపూరితమైనది కూడా కావచ్చు.

అరటి + జామ :

అరటి + జామ :

వీటి కలయిక వల్ల వికారం, తలనొప్పి, ఆమ్లపిత్తము మరియు కడుపులో గ్యాస్ వంటి సమస్యలు తలెత్తవచ్చు.

నిమ్మకాయ + బొప్పాయి :

నిమ్మకాయ + బొప్పాయి :

వీటి యొక్క సమ్మేళనం వల్ల హేమోగ్లోబిన్ సమస్యలకు కారణమవుతుందని మరియు రక్తహీనతను కూడా సృష్టించగలదని కొన్ని వర్గాలు చెపుతున్నాయి!

పాలు + నారింజ :

పాలు + నారింజ :

పాలు, నారింజ రసం మరియు తృణధాన్యాలను కలిపిన తీసుకోవడం వల్ల వాటన్నింటినీ మీ శరీరం ఒక్కసారిగా జీర్ణం చేయలేని సమస్యను ఎదుర్కొంటుంది.

కూరగాయలు + పండ్లు :

కూరగాయలు + పండ్లు :

పండ్లు మరియు కూరగాయలు మీ ఆరోగ్యానికి చాలా మంచివిగా ఉంటాయి. కానీ మీరు వాటిని కలిపి ఒక్కసారిగా తినమని, దాని అర్థం కాదు.

పండ్లలో చక్కెరను కలిగి ఉంటాయి మరియు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. మీరు వాటితోపాటు కూరగాయలు తినేటప్పుడు, జీర్ణ వ్యవస్థ యొక్క వేగాన్ని మందగించేలా చేయవచ్చు మరియు గ్యాస్-సమస్యలు, విరోచనాలు మరియు తలనొప్పి ఏర్పడటానికి కూడా కారణమవుతుంది.

English summary

Never Mix Carrot And Orange Juice

Not all food combinations are safe. Some may have side effects too. Yes, it applies to certain fruits and vegetables. For example, oranges and carrots should not be consumed together. Read this!
Story first published: Friday, March 9, 2018, 16:34 [IST]