For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జామ ఆకులో ఆశ్చర్యం కలిగించి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

|

బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుండే జామకాయలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి . రుచిగా ఉండే జామపండును లేదా జామకాయను తింటాం. కానీ జామ ఆకు గురించి ఎప్పుడయినా ఆలోచించారా? వాటిల్లో ఉండే పోషకాల గురించి విన్నారా? ఈ ఆకుల్లో పలు ఆరోగ్య సమస్యలు రాకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. నిజానికి జామకాయలో కంటే జామ ఆకుల్లోనే ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలున్నాయంటున్నారు పోషకాహార నిపుణులు.

ముఖంగా జామఆకుల్లో ఆరోగ్య ప్రయోజనాలను చూసినట్లైతే జామఆకుల్లో నొప్పులూ, వాపులను నివారించే గుణాలూ అధికమే! జామాకు టీని తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. జలుబూ, దగ్గూ నెమ్మదిస్తాయి. శుభ్రంగా కడిగిన జామాకులను నమలడం వల్ల పంటి నొప్పులు దూరమవుతాయి. చిగుళ్ల నొప్పీ, నోటిపూతా తగ్గుతాయి. వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. ఇన్ని ఆరోగ్యప్రయోజనాలకు ప్రధాణ కారణం జామ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరయు విటమిన్ సి. అంతే కాదు ఈ ఆకుల్లో క్వర్సిటిన్, ఫ్లవనోల్ అనే శరీరానికి అవసరం అయ్యే మంచి ఫ్లెవనాయిడ్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

READ MORE: జామకాయ పవర్ ఏంటో తెలుసా మీకు.....!?

జామ ఆకులు, బెరడు నుంచి తయారు చేసిన పదార్థాలు కేన్సర్‌, బాక్టీరియా ద్వారా వచ్చే అంటు వ్యాధులు, వాపులు మరియు నొప్పి నివారణలో వైద్యంగా వాడుతున్నారు. ఈ జామాకుల నుంచి తయారు చేసిన నూనెలు కేర్సర్‌లు విరుద్ధంగా పనిచేస్తున్నాయి. ఈ జామ ఆకులను నాటు వైద్యంగా డయేరియాకి మందుగా ఉపయోగిస్తారు. బెరడు ఏంటీ మైక్రోబియల్‌, ఏస్ట్రింజంట్‌ లక్షణాన్ని కలిగి ఉంటుంది. వీటిని చక్కెర వ్యాధి తగ్గించడంలో కూడా ఉపయోగిస్తారు. కొన్ని దేశాల్లో జామ పండు పై తొక్క తొలగించి పంచదార పాకం పట్టి ఎరుపు రంగు కలిపి రెడ్ గోవా అనే పేరుతో విక్రయిస్తారు.

READ MORE: వేసవికాలంలో ఆరోగ్యానికి మేలుచేసే మరియు హానికలిగించే ఆహారాలు

ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలున్న జామఆకులు ఏవిధంగా ఉపయోగించాలంటే టీ రూపంలో తీసుకుంటే మరింత ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. మరి జామ ఆకు టీ ఎలా తయారుచేయాలో చూద్దాం...నీటిని మరిగించి, శుభ్రంగా కడిగిన జామ ఆకులను అందులో వేసి చల్లారిస్తే, జామాకుల టీ తయారవుతుంది. ఇలా తయారుచేసిన టీకి పంచదార లేదా తేనె మిక్స్ చేసి తీసుకోవచ్చు. అయితే పాలను చేర్చకూడదు. ఈ టీతో ఎన్నో రకాల ఫలితాలను పొందొచ్చు. ఈ టీ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు అదుపులో ఉంటాయి. దీన్లోని పోషకాలకు బరువు తగ్గించే గుణం కూడా ఉంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగి బాధపడే వారు ఈ టీని నెలకోసారి తాగినా ఫలితం కనిపిస్తుంది. అజీర్ణ సమస్యలూ తగ్గుతాయి. ఇవే కాకుండా మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఈ క్రింది విధంగా...

1.బరువు తగ్గిస్తుంది:

1.బరువు తగ్గిస్తుంది:

జామ ఆకులో కొవ్వు , క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఔషదం వంటిది. జామాకుతో తయారుచేసిన రసాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. జామఆకులో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం ఆరగించవచ్చు.

2. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

2. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

జామకాయ జ్యూస్ కాలేయానికి ఒక మంచి లివర్ టానిక్ వంటిది. ఈ జ్యూస్ ను తీసుకొన్నప్పుడు. ఎలాంటి దుష్ర్పభాలు లేకుండా ఇది బ్లడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

3. డయాబెటిస్ ను నివారిస్తుంది:

3. డయాబెటిస్ ను నివారిస్తుంది:

మీ కుంటుంబంలో కనుక ఎవరికైన డయాబెటిస్ ఉన్నట్లైతే జామకు టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల షుగర్ ను తగ్గించుకోవచ్చు . ఈ టీ బ్లడ్ లోని గ్లూకోజ్ లెవల్స్ ను చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది . ముఖ్యంగా ఇన్సులిన్ ఉత్పత్తి కానివ్వకుండా బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

4. డయోరియా నివారిస్తుంది:

4. డయోరియా నివారిస్తుంది:

జామఆకు వల్ల మరో ఆరోగ్య ప్రయోజనం డయోరియా సమస్యలను నివారిస్తుంది . అంతే కాదు, ఇతర పొట్ట సమస్యలను కూడా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. జామ వేర్లు ఒక కప్పు నీటిలో వేసి బాగా మరిగించి వడగట్టి కాలీ పొట్టతో తీసుకుంటే తక్షణ ఉపశమనం కలుగుతుంది.

5.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

5.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

జామఆకులతో తయారుచేసిన టీని రెగ్యులర్ గా తీసుకుంటుంటే ఇది జీర్ణక్రియకు అవసరం అయ్యే జీర్ణ రసాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది . ఈ హెల్తీ లీఫ్ టీ లేదా జ్యూస్ తీసుకొన్నప్పుడు ఫుడ్ పాయిజన్ ను నివారించుకోవచ్చు.

6. దంత సమస్యలు:

6. దంత సమస్యలు:

అలాగే, జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. దంతాల నొప్పి, గొంతు నొప్పి, చిగుళ్ళ వ్యాధులను నివారించడంలో జామఆకులు గ్రేట్ గా సహాయపడుతాయి . జామఆకులను పేస్ట్ గా తయారుచేసి, దంతాలు మరియు చిగుళ్ళమీద అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

7. డేంగ్యూ ఫీవర్ నుండి రక్షణ కల్పిస్తుంది:

7. డేంగ్యూ ఫీవర్ నుండి రక్షణ కల్పిస్తుంది:

జామఆకుల వల్ల మరో గ్రేట్ హెల్త్ బెనిఫిట్, డేంగ్యూతో బాధపడే వారికి ఈ లీఫ్ జ్యూస్ ఔషధం వంటిది . శరీరంలో ఎలాంటి క్రిములనైనా నాశనం చేస్తుంది.

8. ప్రొస్టేట్ క్యాన్సర్:

8. ప్రొస్టేట్ క్యాన్సర్:

జామఆకుల జ్యూస్ త్రాగడం వల్ల ఇది ప్రొస్టేట్ క్యాన్సర్ మరియు ప్రొస్టేట్ ఎన్ లార్జ్ మెంట్ ను నివారిస్తుంది . పురుషుల్లో ఇలాంటి క్యాన్సర్స్ కు ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ.

9. స్పెర్మ్ ఫ్రొడక్షన్ కు చాలా మంచిది:

9. స్పెర్మ్ ఫ్రొడక్షన్ కు చాలా మంచిది:

జామఆకులతో తయారుచేసిన టీని రెగ్యులర్ గా తీసుకుంటుంటే వీరకణాల ఉత్పత్తి పెరుగుతుంది .

10. అలర్జీలను నివారిస్తుంది:

10. అలర్జీలను నివారిస్తుంది:

మరో హెల్త్ బినిఫిట్ పుల్లల్లో సాధారణంగా వచ్చే ఎలాంటి ఎనర్జీలైన చాలా గ్రేట్ గా నివారిస్తుంది.

11. మలబద్దకం:

11. మలబద్దకం:

జామ ఆకులో ఉండే పీచు పదార్ధం వల్ల మలబద్ధకం నివారించబడుతుంది. బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్ధం ఎక్కువగా ఉండటంతో ఇది సుగర్ వ్యాధికి చక్కటి ఔషధం .

12. చర్మఆరోగ్యానికి :

12. చర్మఆరోగ్యానికి :

చర్మాన్ని ఆరోగ్యం గా ఉంచేందుకు అవసరమయ్యే " కొల్లాజన్ " ఉత్పత్తికి ఇది కీలకము . నీటిలో కరిగే బి. సి. విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఎ జామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు. ఇక జామపండు పై చర్మంలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. దాని వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

English summary

10 Health Benefits Of Guava Leaves

Guava has a lot of health benefits and many of us are aware of how this little green fruit can keep you healthy. But, did you know the guava leaves are much more healthier to consume than the fruit itself?
Desktop Bottom Promotion