ఈజీగా 15కేజీల బరువు తగ్గాలంటే.. జీరా డైట్ బెస్ట్

Written By: Nutheti
Subscribe to Boldsky

కొంచెం స్పైసీగా, అమోఘమైన రుచి కలిగిన జీరా లేదా జీలకర్ర ప్రతి ఇంట్లో ఉంటుంది. దీన్ని ప్రతి వంటకానికి పోపుతోపాటు వాడతారు. అలాగే.. ఘుమఘుమల సువాసన కోసం వాడతారు. అయితే అద్భుమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన జీరాలో వెయిట్ లాస్ తగ్గించే పవర్ దాగి ఉంది. బెల్లీ ఫ్యాట్ ని 20 రోజులలోపే తగ్గించుకోవడానికి జీరా చక్కటి పరిష్కారం. బెల్లీ ఫ్యాట్ మాత్రమే కాదు.. శరీర బరువు మొత్తం ఈజీగా తగ్గిపోతుంది.

బరువు తగ్గడానికి చాలా చక్కటి పరిష్కారమని.. అనేక అధ్యయనాలు నిరూపించాయి. 88 మంచి ఒబేసిటీ మహిళలకు జీరా వెయిట్ లాస్ డైట్ మంచి ఫలితాలు ఇచ్చింది. ఈజీగా క్యాలరీలు కరిగించడానికి, మెటబాలిజం పెంచడానికి, జీర్ణక్రియ రేట్ సజావుగా ఉండటానికి జీరా సహాయపడుతుంది.

బరువు తగ్గించే గుణమే కాకుండా.. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు జీరాలో దాగున్నాయి. చెడు కొలెస్ర్టాల్ తగ్గిస్తుంది. హార్ట్ ఎటాక్ ని అరికడుతుంది. మెమరీ పవర్ ని పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అనీమియాతో పోరాడుతుంది. జీర్ణక్రియ పెంచుతుంది. గ్యాస్ర్టిక్ సమస్యలకు చెక్ పెట్టే సత్తా కూడా.. జీరాలో ఉన్నాయి.

బ‌రువు త‌గ్గించే జీరా డ్రింక్

బ‌రువు త‌గ్గించే జీరా డ్రింక్

ఒక గ్లాస్ నీళ్ల‌లో 2 టేబుల్ స్పూన్ల జీల‌క‌ర్ర క‌లిపి రాత్రంతా నాన‌నివ్వాలి. ఉద‌యాన్నే ఆ నీటిని ఉడ‌క‌బెట్టి వ‌డ‌క‌ట్టాలి. అందులో స‌గం నిమ్మ‌కాయ ర‌సం క‌ల‌పాలి. ఖాళీ క‌డుపుతో ఈ నీటిని ప్ర‌తి రోజూ ఉద‌యం రెండువారాల పాటు తాగితే.. సులువుగా, వెంట‌నే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

బ‌రువు త‌గ్గ‌డానికి జీరా, పెరుగు

బ‌రువు త‌గ్గ‌డానికి జీరా, పెరుగు

బ‌రువు త‌గ్గ‌డానికి జీల‌క‌ర్ర‌ను ర‌క‌ర‌కాలుగా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఒక టీ స్పూన్ జీల‌క‌ర్ర పొడిని 5 గ్రాముల పెరుగులో క‌లిపి.. నిత్యం తీసుకుంటూ ఉండాలి.

బ‌రువు త‌గ్గించే జీరా చిట్కా

బ‌రువు త‌గ్గించే జీరా చిట్కా

నీళ్ల‌లో 3గ్రాముల జీల‌క‌ర‌ర్ర పొడి, కొన్ని చుక్క‌ల తేనె క‌లిపి త‌ర్వాత తాగాలి. లేదా వెజిట‌బుల్ సూప్ తయారు చేసుకుని అందులో ఒక స్పూన్ జీరా వేసి ప్లెయిన్ బ్రౌన్ రైస్ లో మిక్స్ చేసి తీసుకుంటే.. రుచితోపాటు బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు.

నిమ్మ‌, అల్లం, జీరాతో బ‌రువు త‌గ్గడం

నిమ్మ‌, అల్లం, జీరాతో బ‌రువు త‌గ్గడం

అల్లం, నిమ్మ‌ర‌సం జీల‌క‌ర్ర‌లో బ‌రువు త‌గ్గించే గుణాల‌ను పెంచుతాయి. అల్లం తురుము, క్యారెట్స్, ఇత‌ర కూర‌గాయ‌ల‌ను క‌లిపి ఉడ‌క‌బెట్టాలి. దాంట్లో కొంచెం జీల‌క‌ర్ర పొడిని రాల్పి రాత్రి భోజ‌నంగా తీసుకోవాలి.

జీల‌క‌ర్ర కొవ్వుని క‌రిగిస్తుంది

జీల‌క‌ర్ర కొవ్వుని క‌రిగిస్తుంది

అధిక క్యాల‌రీల‌ను క‌రిగించ‌డానికి, బెల్లీ ఫ్యాట్ కూడా త‌గ్గించ‌డంలో జీల‌క‌ర్ర బాగా ప‌నిచేస్తుంది. జీల‌క‌ర్ర‌లో ఉండే పోష‌కాలు, యాంటీ ఆక్సిడెంట్స్ మెట‌బాలిజంను అభివృద్ధి చేసి, క్యాల‌రీలు క‌రగ‌డానికి స‌హాయ‌ప‌డ‌తాయి.

జీర్ణ‌క్రియ మెరుగుప‌రిచి, గ్యాస్ సమ‌స్య‌ల‌కు

జీర్ణ‌క్రియ మెరుగుప‌రిచి, గ్యాస్ సమ‌స్య‌ల‌కు

జీర్ణ‌క్రియ స‌జావుగా సాగ‌డానికి జీరా స‌హాయ‌ప‌డుతుంది. అలాగే గ్యాస్ర్టిక్ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెడుతుంది.

హార్ట్ అటాక్

హార్ట్ అటాక్

బ్యాడ్ ఫ్యాట్స్, కొలెస్ర్టాల్ స్థాయిల‌ను జీల‌క‌ర్ర అరిక‌డుతుంది. బ‌రువు త‌గ్గ‌డానికి, హార్ట్ అటాక్ రిస్క్ త‌గ్గించ‌డానికి జీల‌క‌ర్ర ఉప‌యోగ‌ప‌డుతుంది.

English summary

Lose Up To 15 kg With One Teaspoon Of This Spice!: Weight Loss with Zeera Diet

Cumin, also known as jeera, is an earthy, nutty somewhat bitter spice that is available in India and other countries. Do you know that this spice has got a unique weight loss power too? You can lose your belly fat within just 20 days by eating cumin regularly.
Story first published: Tuesday, December 22, 2015, 9:25 [IST]