For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నైట్ డిన్నర్ తర్వాత అరటి పండ్లు ఖచ్చితంగా తినడానికి టాప్ 5 రీజన్స్ ..!

అరటి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి, ఎందుకంటే వీటిలో వివిధ రకాల న్యూట్రీషియన్స్, విటమిన్స్, మినిరిల్స్ అత్యధికంగా ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వయస్సును బట్టి ఒక్క రోజులో ఒకటిన్నర కప్పు నుండి రె

|

రోజుకొక్క అరటిపండు తింటే ఆరోగ్యానికి ఏంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అరటిపండ్లు పొటాషియం ఇతర మినిరల్స్, విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఒక్క అరటిపండు తినడం వల్ల ఇన్ స్టాంట్ ఎనర్జీ పొందుతారు. అయితే అరపండును రోజులో ఎప్పుడైనా తినవచ్చు. కానీ, రోజులో కొన్నిప్రత్యేకమైన సమయాల్లో తినడం వల్ల ప్రత్యేకమైన బెనిఫిట్స్ ను పొందుతారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేదా బానాన డైట్ తో బరువు తగ్గుతారు, అదే విధంగా మధ్యహ్నాన భోజనం తర్వాత తింటే క్యాలరీలు పెరుగుతాయి. ఇక రాత్రి డిన్న తర్వాత తింటే ?

కొన్ని పరిశోధనల ప్రకారం, రాత్రుల్లో అరటిపండ్లు తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని అంటున్నారు. కానీ, వాస్తవానికి ఆరోజులో చివరి భోజనమైన డిన్నర్ తర్వాత అరటిపండ్లు తినడం మంచిదే అంటున్నారు మరికొంత మంది నిపుణులు.

అరటి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి, ఎందుకంటే వీటిలో వివిధ రకాల న్యూట్రీషియన్స్, విటమిన్స్, మినిరిల్స్ అత్యధికంగా ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వయస్సును బట్టి ఒక్క రోజులో ఒకటిన్నర కప్పు నుండి రెండు కప్పులు పండ్లు తినవచ్చని సూచిస్తున్నారు. అరటిపండ్లు తినడం వల్ల పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. హెల్తీగా అనిపిస్తుంది.

రాత్రుల్లో అరటిపండ్లు తినడం తినడానికి గల ఖచ్చితమైన ..విలువైన కారణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

నిద్రను మెరుగుపరుస్తుంది:

నిద్రను మెరుగుపరుస్తుంది:

డిన్నర్ తర్వాత అరటిపండ్లు తినడం వల్ల ఒక గొప్ప ప్రయోజనం పొందవచ్చు. మంచి నిద్రపొందడానికి మెలటోనిన్ అనే హార్మోన్ తప్పనిసరిగా అవసరం అవుతుంది. కాబట్టి, రాత్రుల్లో అరటిపండు తినడం వల్ల మెలటోనిన్ హార్మోన్ లెవల్ పెరుగుతుంది. గాఢనిద్రపట్టడానికి ఇంతకంటే మరో విలువైన ఆహార పదార్థం లేదు. అరటిపండ్లలో ట్రైఫ్టాపన్, అమినో యాసిడ్స్, వంటివి మెలటోనిన్ లెవల్స్ పెంచుతాయి. దాంతో నిద్రలేమి సమస్యలను తగ్గుతాయి.

న్యూట్రీషిన్స్ ను పెంచుతుంది:

న్యూట్రీషిన్స్ ను పెంచుతుంది:

డైలీ బేసిస్ లో మన శరీరానికి న్యూట్రీషియన్స్ అత్యవసరం అవుతాయి. ఇది హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. పెద్దవారు రోజుకు 4700 మిల్లీగ్రాముల పొటాషియంను తీసుకోవాలి. అయితే పరిమితికి మిచి తీసుకోకూడదు. ఒక రోజులో చివరి భోజనంలో అరటిపండు తినడం వల్ల పొటాషియం లోపం లేకుండా బ్యాలెన్స్ చేస్తుంది. అదే విధంగా రాత్రుల్లో అరటిపండు తినడంవల్ల ఆరోజకు సరిపడా పొటాసియం మరియు ఇతన న్యూట్రీషియన్స్ శరీరం గ్రహిస్తుంది.

షుగర్ తినాలనే కోరిక తగ్గిస్తుంది:

షుగర్ తినాలనే కోరిక తగ్గిస్తుంది:

కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా రాత్రుల్లో నిద్రపట్టనప్పుడు, స్వీట్ మీద మనస్సు మళ్లుతుంది, అటువంటి సమయంలో స్వీట్ ఫుడ్స్ కు ప్రత్యామ్నాయంగా అరటి పండు తినడం వల్ల స్వీట్స్ తినాలనే కోరిక తగ్గిస్తుంది. మరియు ఆగ్యానికి మంచిది. శరీరానికి ఎక్కువగా న్యూట్రీషియన్స్ అందుతాయి.

మజిల్ క్రాంప్స్ తగ్గిస్తుంది:

మజిల్ క్రాంప్స్ తగ్గిస్తుంది:

కొంతమంది రాత్రుల్లో మజిల్ క్రాంప్ తో బాధపడుతుంటారు, ఈ సమస్య నుండి భయటపడాలంటే రోజుకొక్క అరటిపండు తినాలి. అరటిపండ్లలో ఎలక్ట్రోలైట్స్, పొటాషియం మరియు మెగ్నీషియంలు శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ను పెంచుతుంది. ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యత వల్ల మజిల్ క్రాంప్స్ పెరగకుండా ఉండాలంటే రోజూ రాత్రుల్లో ఒక అరటిపండు తినాలి.

ఫైబర్ ను పెంచుతుంది:

ఫైబర్ ను పెంచుతుంది:

ఫైబర్ జీర్ణ శక్తిని పెంచడానికి అత్యవసరమైనది. అంతే కాదు హార్ట్ హెల్త్ కు, డయాబెటెటిస్ వచ్చే అవకాశాలు తగ్గించడానికి సహాయపడుతాయి. రాత్రుల్లో అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే ఫైబర్ పుష్కలంగా అందుతుంది.

English summary

Why We Should Have Bananas In The Night: Top 5 Reasons

Why We Should Have Bananas In The Night: Top 5 Reasons, Is it good to have a banana in the night, particularly after dinner, which is the last meal you are having for the day? According to some, it is not good, as it can cause digestive disorders.
Story first published: Friday, November 18, 2016, 13:52 [IST]
Desktop Bottom Promotion