అలర్ట్ : వ్యాధులతో పోరాడాలంటే ఖచ్చితంగా తినాల్సిన ఇమ్యూనిటి ఫుడ్స్ ..!!

By Sindhu
Subscribe to Boldsky

మన శరీరం ఎలాంటి వ్యాధులకు జబ్బులకు గురికాకుండా ఉండాలంటే అందుకు వ్యాధినిరోధక శక్తి ఎంతో అవసరం. ఈ వ్యాధినిరోధకశక్తి మన శరీరానికి ఎలా అందుతుంటే? మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారం ద్వార వివిధ పోషకాలు, విటమిన్స్, న్యూట్రీషియన్స్ ను శరీరం గ్రహించి, వ్యాధినిరోధక శక్తిగా మారుతుంది . దీన్నే ఇంగ్లీషులో ఇమ్యూనిటి అంటారు. ఈ ఇమ్యూనిటీ వివిధ రకాల వ్యాధులను, సీజనల్ జబ్బులను నివారిస్తుంది . అంతే కాదు వ్యాధులకు కారణం అయ్యే ప్యాథోజన్స్ మరియు బ్యాక్టీరియాను దూరం దూరం చేస్తుంది. ముఖ్యంగా వింటర్ సీజన్లో, మన శరీరం చాలా త్వరగా జలుబు మరియు దగ్గుకు గురి అవుతుంది. అలాంటప్పడు మన శరీరంలో ఇమ్యూనిటి స్ట్రాంగ్ గా ఉంటే ఇలాంటి చిన్న చిన్నసీజనల్ వ్యాధుల నుండి మన శరీరాన్ని రక్షించుకోవచ్చు.

Here Is A List Of Natural Immunity Boosters

మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలన్నా మంచి పౌష్టికాహారంను తీసుకోవాలి. మనం తీసుకొనే ఆహారమే మన ఇమ్యూన్ సిస్టమ్ ను స్ట్రాంగ్ గా ఉంచుతుంది. తాజాగా ఉండే పండ్లు మరియు కూరగాయలతో పాటు మన శరీరానికి అవసరం అయ్యే ఇతర ఆహారాలను కూడా మన రెగ్యురల్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. ఈ పౌష్టికాహారాలే మనల్ని ఆరోగ్యంగా కాపాడుతాయి . కానీ కెఫిన్, ప్రొసెస్డ్ ఫుడ్స్ మరియు షుగర్స్ కు దూరంగా ఉండాలి . ఇవి ఇమ్యూనిటిని పాడు చేస్తాయి . అలాగే రోజూ సరిపడా నిద్ర మరియు కాస్త వ్యాయామం తప్పనిసరి.

ఇమ్యూనిటి తక్కువగా ఉండటం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి, ఇమ్యూనిటీ పెంచే ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. మన ఇమ్యూన్ సిస్టమ్ ను బలోపేతం చేయడానికి కొన్ని స్పైస్ మరియు హేర్బ్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. మరి అవేంటో తెలుసుకొని మన ఆరోగ్యానికి కాపాడుకుందాం...

ప్రొయోటిక్స్ :

ప్రొయోటిక్స్ :

ఎంతో రుచికరంగా ఉండే పెరుగును చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ పెరుగును ప్రతిరోజూ ఒక కప్పు తీసుకోవాలి. ఇది జీర్ణాశయంలో ఉండే బాక్టీరియాను నిర్మూలిస్తుంది.

మష్రుమ్స్ :

మష్రుమ్స్ :

ఇమ్యూనిటి పవర్ పెంచడంలో మష్రుమ్స్ గ్రేట్ అని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో వెల్లడించారు. పుట్టగొడుగుల్లో ఫాలీ శ్యాచురేటెడ్స్, వ్యాధులకు వ్యతిరేఖంగా పోరాడుతాయని కనుగొన్నారు.

గ్రీన్ టీ :

గ్రీన్ టీ :

గ్రీన్ టీలో పోలి ఫేనోల్స్ అని పిలిచే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ముఖ్యంగా కాటెచిన్స్ కూడా ఉంటాయి. కొన్ని అధ్యయనాలలో ఇన్ఫ్లుఎంజా లేదా జలుబు వైరస్ లను నాశనం చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉందని కనుగొన్నారు. అయినప్పటికీ,మీరు గ్రీన్ టీ తీసుకున్నప్పుడు పాలు వదిలివేయటం ముఖ్యమైనది. ఎందుకంటే పాలలో ఉండే ప్రోటీన్లు కాటెచిన్స్ ను బందిస్తుంది.తద్వారా దాని యాంటీ ఆక్సిడెంట్ లక్షణములను కోల్పోవటానికి కారణమౌతుంది. కొద్దిగా నిమ్మ లేదా తేనె కలుపుకొని త్రాగవచ్చు.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

ప్రతి వంటకానికి రుచితో పాటు.. సువాసనను అందించే వెల్లుల్లిని నిత్యం తీసుకోవడం మంచిది. దీనిలో ఉండే మినరల్స్‌ బ్యాక్టీరియా, ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌లపై పోరాడేలా చేస్తాయి. మీ డైట్ లో వెల్లుల్లిని చేర్చుకుంటే.. ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ స్పైసీ ఫుడ్ మీ వంటకు మంచి సువాసన జోడించడం మాత్రమే కాదు, జలుబు, ఫ్లూతో పోరాడే లక్షణాలు ఉన్నాయి. వెల్లుల్లి, వ్యాధినిరోధకతను ఎదుక్కోవడానికి బ్లెడ్ సెల్స్ ను పెంచుతుంది.వీటిలో అలిసిన్, అజోయేన్ మరియు థయోసల్ఫేట్ వంటి అంశాలు అనేక ఇన్ఫెక్షన్స్ తో పోరాడి వివిధ రకాల వైరస్ లను చంపేస్తుంది.

ఆమ్లా :

ఆమ్లా :

ఇండియన్ గూస్బెర్రీ, దీన్నే మనం ఆమ్లా మరియు ఉసిరికాయ అని పిలుస్తాము. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంది. ఇంకా క్యాల్సియం, ఐరన్, ఫాస్పర్స్, మరియు ఫైబర్లు పుష్కలంగా ఉన్నాయి. ఉసిరికాలో శరీరంకు అవసరం అయ్యే శక్తిని అందించడంతో పాటు ఇమ్యూనిటి పవర్ ను పెంచుతుంది. వివిధ వ్యాధులతో పోరాడే బాడీ సామర్థ్యాన్ని పెంచుతుంది . రెగ్యులర్ గా ఉసిరికాయను తినడం వల్ల మానసిక మరియు శారీరక అలసటను తగ్గిస్తుంది.

పసుపు:

పసుపు:

పసుపులో ఉండే మెడిసినల్ వాల్యూస్ గురించి మీకు తెలిసినదే. విటమిన్ B6 మరియు పోటాషియం,మాంగనీస్ మరియు ఇనుము వంటి ఖనిజాలు సమృద్దిగా ఉన్నాయి. ఇవి బిన్నమైన శరీర పనితీరులో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అంతేకాకుండా కుర్కుమిన్ అనే విలువైన అనామ్లజనిచర్య ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ యొక్క పనితీరును పెంచుతుంది.జాయింట్ పెయిన్, కామన్ కోల్డ్ మరియు వాపులను తగ్గిస్తుంది.

క్యారెట్స్ :

క్యారెట్స్ :

క్యారెట్ కంటికే కాదు.. రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. నిత్యం అరకప్పు తాజా క్యారెట్‌ను తీసుకోవడం వల్ల ఇందులో ఉండే బీటా కెరోటిన్‌, విటమిన్‌ బి6లు యాంటీ ఆక్సిడెంట్లను ఉత్తేజపరుస్తాయి.

అల్లం:

అల్లం:

అల్లం అనేక ఇన్ఫెక్షన్స్ తగ్గించడంతో పాటు ఇమ్యూనిటి లెవల్స్ ను పెంచుతుంది. ముఖ్యంగా రెస్పరేటరీ డిజార్డర్స్ జలుబు మరియు దగ్గు, ఆస్త్మా నివారించడానికి అల్లం ఒక ఉత్తమ హోం హేర్బల్ రెమడీ. వింటర్ సీజన్ లో మీరు తయారుచేసే వంటకాల్లో కొద్దిగా అల్లం చేర్చడం వల్ల మీలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఒక కప్పు అల్లం టీ ప్రతి రోజూ త్రాగడం వల్ల ఇమ్యూనిటి పవర్ పెంచుకోవచ్చు.

తులసి:

తులసి:

తులసిలోని ఔషధగుణాలు మీకు తెలిసినదే. తులసిలో యాంటీ ఆస్త్మాటిక్ మరియు యాంటీ ఇన్ఫెక్టివ్ ప్రొపర్టీస్ పుష్కలంగా ఉన్నాయి . తులసిటీ తీసుకోవడం వల్ల రెస్పరేటరీ వ్యాధులను నివారించుకవోచ్చు. కొన్ని ఫ్రెష్ తులసి ఆకులను నమడం వల్ల రెసిస్టెన్స్ ను పెంచుతుంది.

బ్లాక్ పెప్పర్:

బ్లాక్ పెప్పర్:

వింటర్ లో సాధారణంగా వచ్చే జలుబు మరియు ఫ్లూ మరియు వింటర్ సీజన్ లో వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి బ్లాక్ పెప్పర్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది. బ్లాక్ పెప్పర్ శరీరంలో వేడి మాత్రమే పెంచడం కాదు, వ్యాధినిరోధకతకు సపోర్టో చేసి న్యూట్రీషియన్ ను ఇది ఉత్పత్తి చేస్తుంది.

ఖర్జూరం:

ఖర్జూరం:

ఐరన్ ఐరన్ శరీరానికి చాలా అవసరం. ఇది బెల్లంలో ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి స్వీట్లు ఇష్టపడే వాళ్లు చక్కెరకు బదులు బెళ్లంతో చేసిన తీపి పదార్థాలు తినడం మంచిది. లేదా.. రోజూ నాలుగు లేదా ఐదు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా ఐరన్‌ అందుతుంది.

ఏసికా బెర్రీస్:

ఏసికా బెర్రీస్:

ఏసికా బెర్రీస్ యాంథోసైనిన్స్ అనే యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి వ్యాధినిరోధక శక్తి పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Here Is A List Of Natural Immunity Boosters

    In order to protect ourselves from diseases we need to have a strong immune system. Apart from exercising properly, getting good quality sleep and staying positive all the time, we must focus on the food we eat to boost our immunity levels.
    Story first published: Saturday, February 4, 2017, 17:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more