Just In
Don't Miss
- News
హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో భారీ వర్షాలు: చల్లబడ్డ వాతావరణం, పిడుగుపాటుకు ముగ్గురు మృతి
- Sports
RR vs PBKS: సంజూ శాంసన్ సెంచరీ పోరాటం వృథా.. పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ.!
- Finance
Gold prices today: తగ్గిన బంగారం, వెండి ధరలు: ఐనా ఆ మార్కుకు పైనే
- Movies
ఉప్పెన తరువాత మొదటిసారి సరికొత్తగా దర్శనమిచ్చిన వైష్ణవ్ తేజ్.. న్యూ స్టైలిష్ లుక్!
- Automobiles
నైట్ కర్ఫ్యూ; ఒక్కరోజులో 68 వాహనాల స్వాధీనం.. ఎక్కడో తెలుసా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీరు ఊహించని ఈ 10 విషయాలు, మీ నిద్రను ప్రభావితం చేయగలవు !
మానవ మెదడు అభివృద్ధి చెందే సమయంలో - దాని నిర్మాణము, పనితీరులో వచ్చే మార్పులు నిద్రపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. మీ వయసు పెరిగేకొద్దీ నిద్ర బాగా తగ్గిపోతుంది. మీరు యుక్త వయసులో ఉన్నప్పుడు పొందే నిద్రకి ఇది ఏమాత్రం సరికాదు.
ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారము, వ్యాయామాలతో పాటు - శరీరానికి నిద్ర అనేది కూడా చాలా అవసరం. నిర్దిష్ట వయస్సు గల సగటు వ్యక్తికి 7-8 గంటలు నిద్ర అనేది చాలా అవసరం.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ ప్రకారం, నిద్రకు ఎదురయ్యే ఆటంకాలు అనేవి, మీ శారీరక - మానసిక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. సరైన నిద్ర లేని కారణంగా, మీ రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది అలానే, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మీ సామర్థ్యంపై కూడా ప్రభావితం చేస్తుంది.
కాబట్టి, ఈ వ్యాసమును మీరు చదవటం వల్ల మీ నిద్రను ప్రభావితం చేసే మరిన్ని విషయాలను గూర్చి తెలుసుకోవచ్చు.

1. రాత్రి భోజనము ఆలస్యంగా చేయడం :
మీరు రాత్రి 10 గంటల తర్వాత భోజనాన్ని చేస్తున్నట్లయితే, ఇది మీ నిద్రను ప్రభావితం చేస్తుంది. అయితే కొన్నిసార్లు, మీ పని ఒత్తిడి కారణంగా రాత్రి 10 గంటల కన్నా ముందుగా భోంచెయ్యటం చాలా కష్టమైనది కావచ్చు. అయినప్పటికీ కూడా మీరు మీ రాత్రి భోజనాన్ని 9-10 గంటల మధ్యలో చేసేందుకు ప్రయత్నించండి.

2. రాత్రిపూట పుల్లని పండ్లను తినడం :
మీరు రాత్రిపూట నారింజను (లేదా) ద్రాక్షపండును తినడమనేది, మంచి ఆలోచన కాదు. మీరు పడుకునే ముందు సిట్రస్ పండ్లను తినడం వల్ల ఛాతీమంట ఏర్పడటానికి కారణం కావచ్చు, ఇది మీరు "విరామం లేని" రాత్రి నిద్రను కలగజేస్తుంది.

3. ఖాళీ కడుపుతో పడుకోవడం :
రాత్రి ఖాళీ కడుపుతో పడుకోవడం (లేదా) పూర్తిగా నిండిన కడుపుతో పడుకోవడం వల్ల మీ నిద్రకు భంగం కలిగించగలదు. రాత్రి భోజనాన్ని పుష్టిగా ఆరగించడం వల్ల, నిద్రపోయే సమయంలో మీకు ఇబ్బందులు తలెత్తుతాయి. దానికి బదులుగా, పడుకోవడానికి కనీసం 2 లేదా 3 గంటల ముందుగా భోజనాన్ని ఆరగించండి.

4. నిద్రించే సమయంలో మొబైల్ ఫోన్లను వాడటం :
ఆధునిక టెక్నాలజీ రావడంతో, ప్రతి ఒక్కరూ వారి మొబైల్ ఫోన్లకు బాగా అతుక్కుపోయారు, ఇది మీ ఆరోగ్యానికి హానికరం. మీ సెల్-ఫోన్ నుండి వచ్చే కాంతి మీ శరీరం యొక్క సిర్కాడియన్ రిథమ్ను (రోజువారీ దినచర్యను) ప్రభావితం చేస్తుంది, అలాగే ఇది చురుకుదనాన్ని పెంచే హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అలా ఇది మీ నిద్రలో ఆటంకం కలిగించేదిగా మారుతుంది.

5. పడుకొనే ముందు వ్యాయామం చేయడం :
కొన్ని అధ్యయనాల ప్రకారం, వ్యాయామం అనేది మిమ్మల్ని తక్షణమే నిద్రలోకి జారుకొనేటట్లుగా చేయవచ్చని నిరూపించాయి. కానీ, పడుకోవడానికి వెళ్ళే ముందు మీరు వ్యాయామం చేస్తే, అది మీ నిద్రను ప్రభావితం చేస్తుంది, అలాగే మీకు మంచి రాత్రి-నిద్రావకాన్ని పొందకుండా చేస్తుంది. మీరు ప్రతిరోజూ ఉదయం పూట వ్యాయామం చేయడానికి చాలా ఉత్తమం.

6. సరైన ప్లానింగ్ లేకపోవడం :
మీరు ఒక కొత్తపని కార్యక్రమ-షెడ్యూల్ను (లేదా) ఒక అనిశ్చయమైన షెడ్యూల్ను గానీ కలిగి ఉంటే, మీరు ఆఫీసు పనిని చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు, అలా ఇది మీ నిద్రను భంగపరుస్తుంది. ఎందుకంటే ఇది మీ నిద్ర క్రమంలో మార్పును కలుగచేస్తుంది. మీ శరీర "సిర్కాడియన్ రిథం" అనేది మీ శరీర "అంతర్గత గడియారం" వంటిది, మీ నిద్ర క్రమంలో మార్పు ఉన్నట్లయితే, అది మీ అంతర్గత గడియారాన్ని చిందర వందర చేస్తుంది.

7. చాలా ఎక్కువ వ్యత్యాసాలు :
నిద్రపోవడానికి మీ ఇంట్లో అనువైన ప్రదేశం బెడ్ రూమ్ మాత్రమే, అది నిద్రవేళలో ఉన్న టీవిని చూడటం కోసం మాత్రం కాదు. టెలివిజన్ చూడటం (లేదా) మీరు కంప్యూటర్లో మునిగి ఉన్నట్లయితే, అవి మీ మెదడు పనితనాన్ని తికమకపెట్టడమే కాకుండా, మీ నిద్రా-భంగానికి కూడా కారణమవుతుంది.

8. రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ :
రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్లో, మీరు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు (లేదా) నిద్రిస్తున్నప్పుడు మీ కాళ్ళను కదపాలనే కోరికను కలిగి ఉంటారు. ఈ సిండ్రోమ్తో బాధపడుతున్న వ్యక్తులు త్వరగా నిద్రాపోవటానికి బాగా కష్టపడతారు. ఇది 5-10 శాతం మంది ప్రజలను ప్రభావితం చేసే ఒక సాధారణమైన స్థితి అని చెప్పవచ్చు.

9. చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవడం :
రాత్రి నిద్రించడానికి ముందు, మీ ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవడం కూడా మీ నిద్రను ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే, చల్లటి నీరు శరీరము మేల్కొని ఉండేలా చేసే అనువైన శక్తిని విడుదల చెయ్యడాన్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి, మీరు నిద్రించే ముందు కాస్త గోరు వెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి.

10. కాఫీ తాగడం :
నిద్రపోయే ముందు కాఫీని తాగడం వల్ల కూడా మీ నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. కాఫీలోని కెఫిన్ కంటెంట్ మీ నిద్రను భంగపరచగల చురుకుదనాన్ని పెంచేలా ప్రేరేపిస్తుంది. కాబట్టి, మీరు కాఫీని తాగడానికి బదులుగా, చాక్లెట్ ముక్కను తినండి.