Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
హోళీ స్పెషల్ స్వీట్ కలర్స్..తియ్యతియ్యగా...
హోలీ విశ్వవాప్తంగా అద్భుతంగా జరుపుకొనే రంగుల పండుగ. ఈ పండుగా రోజున, తేజం, వివిధ తరంగాలు, విశ్వవ్యాప్తంగా ప్రకాశిస్తాయి. అక్కడ వివిధ రకాల రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ది పొంది మరియు వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇదే ఈ పండుగ విశేషం. పురాణ కథలతో పాటుగా హోళి పండుగ వెనుక మరో పరమార్థం ఉంది. హోళీ పండుగను వసంత బుతువు ఆగమనంగా పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఇది చలికాలం తొలగిపోయి ఎండకాలం ఆరంభానికి నాంది ప్రస్థానం వంటిది.
హోళీ పండుగను సాధారణంగా పాల్గుణ పౌర్ణమి' రోజున జరుపుకుంటారు . ఇలా ఓ రుతుబు వెళ్ళి మరో రుతువు చ్చే సమయంలో ముఖ్యంగా శీతాకాలం‘చలి పోయి' ఎండాకాలం ‘వేడి' వచ్చే సమయంలో ఉష్ణోగ్రతల తేడా వల్ల చర్మం చిట్లుతుంది. రంగులు ఆ చిట్లటం వల్ల కలిగే చికాకును తగ్గిస్తాయని నమ్మకం.
ప్రపంచంలోని రంగులన్నీ ఒకచోట చేర్చారా అన్నంత ఆందంగా, ఆనందంగా, ఆహ్లాదంగా జరిపుకొనే హోళీ అంటే చిన్నా, పెద్దా అందరికీ ప్రియమే...! వయస్సుతో భేదం, ఆడ, మగా అన్న తేడా లేకుండా అందరూ కలిసి ఈ పండుగను జరుపుకుంటారు. మరి ఇటువంటి హోళీ రోజును కలర్ ఫుల్స్ స్వీట్ తోడైతే ఆ ఆనందాలకు అడ్డు ఏమి..వచ్చిన బందువులతో హోళీ రంగు కేళీ..జయహోళీ అవుతుంది. పొట్టాల నిండి రంగులపొడితో బకెట్ల కొద్దీ రంగు నీళ్ళతో గడప వరకూ నిలబడింది హోలీ! ఈ రంగుల హోళీ మీ బుగ్గల్ని, బట్టల్నీ ముద్దాడేందుకు ఇంకా రెండు రోజులే ఉంది కాన..దైర్యంగా వచ్చి వాకిట్లో నిలబడండి ప్రకృతి విరగబడి రంగులను కాస్తోంది. మబ్బుల్లో రంగుల ధూళికణాలై హరివిల్లు కురుస్తోంది. అయినా మన దగ్గర లేని రంగులా?!రండి, రెడీ అవుదాం. ఆప్తుల పెదవులకు తియ్యటి రంగులు అద్దుదాం వెరైటీగా...హోలీ స్వీట్లతో....

గులాబ్ జామూన్స్ : జామూన్స్ పేరు చెపితే, తియ్యగా నోరు ఊరి పోతుంది. తినటానికే కాదు చూసేటందుకు కూడా ఈ పన్నీర్ జామూన్స్ ఎంతో ఇంపుగా వుంటాయి.

కజ్జికాయ/ కోకోనట్ గుజియా: పర్ ఫెక్ట్ ఇండియన్ డిసర్ట్. ఇది ట్రెడిషినల్ స్వీట్. అన్ని శుభకార్యాలకు, పండగలకు ఈ స్వీట్ ను ఇంట్లో తయారు చేసుకోవచ్చు. . ఈ స్పెషల్ స్వీట్ రిసి కొబ్బరి తురుముతో తయారు చేసి షుగర్ సిరఫ్ లో వేయడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది. కోవా బదలుగా పాల పొడిని ఉపయోగించి తయారు చేసుకోవచ్చు.

జిలేబి: చుట్లు, చుట్లుగా అందంగా మెరుస్తూ ఉండే తీపి వస్తువేంటి. అది నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది. ఈ స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్లు చాలా తక్కువేమో..గుర్తొచ్చిందా?? అదేనండి.. జిలేబి. భారతదేశంలోని దాదాపు అన్ని ప్రదేశాలలో తప్పక కనిపించే ఈ జిలేబి ఎలా చేయాలో చూద్దామా...

చూర్మా లడ్డు: పండుగలు వచ్చాయంటే చాలు ఏమేమి పిండి వంటలు వండాలి. దేవుడికి ఏవేవి నైవేద్యం పెట్టాలి. ఇంటికొచ్చే అథితులకు ఏమి ఆతిథ్యం ఇవ్వాలని చాలా మంది కన్ఫూజ్ అవుతుంటారు. ఏవైనా వెరైటీగా చేస్తే బాగుండు అనుకుంటారు.

సో(న్)మ్ పప్పిడి: అథితులకు, కుటుంబ సభ్యలకు అత్యంత ఇష్టమైన స్వీట్ మీ కోసం....

బెంగాలీ పాయసం: పాయసం అందరీకి ఇష్టం. అయితే బెగాళులు వండే పాయం మరింత రుచిగా ఉంటుంది. మరి ఈ హోలీ సందర్భాగా బెంగాళీ పాయసం రుచి చూద్దామా...

రసగుల్లా: ఆహా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా అతి సున్నితంగా ఉండే రసరసగుల్లా వివిధ రకాలుగా వండుతారు. పన్నీర్, ఆపిల్, చీజ్ ఇలా. అయితే వేటికి అవే సాటి. మరీ రంగోళీ హోలీ సందర్భంగా రసగుల్లా రుచిచూసేద్దామా..

పైనాపిల్ స్వీట్: పండ్లతో స్వీట్స్ తయారు చేయడం చాలా అరుదు. అయితే కొన్ని ప్రత్యేకమైన పండ్లు, ఆపిల్, పైనాపిల్ వంటివి రంగు, రుచి, సువాసన మాత్రమేకాదు ఆరోగ్యానికి అద్భుతంగా మేలు చేస్తాయి. మరి పైనాపిల్ స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దామా...

కుబానీకా మీఠా: కుబానీకా మీఠా పంజాబ్, బెంగాల్ వంటి ప్రదేశాల్లో చాల ఫేమస్ మీ కలర్ ఫుల్ స్వీట్ ను హోళీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది. మరి ఎలా తయారు చేయాలో చూడండి..

మ్యాంగో కీర్: మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. కొత్తరుచిని ఆస్వాదించి అథితులకు ఆతిద్యం తియ్యంగా అందించడానికి మ్యాంగో కీర్ రెడీ అంటోంది...



Click it and Unblock the Notifications











