For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓవర్ వెయిట్ తగ్గించడానికి సురక్షితమైన హోం రెమెడీస్..!

By Sindhu
|

మెడికల్ ఎక్సపర్ట్స్ మరియు న్యూట్రీషియన్స్ ప్రకారం బరువు కంట్రోల్లో ఉండాలని హెచ్చరిస్తుంటారు. ముఖ్యంగా బరువుకు తగ్గ పొడవు ఉండాలని కోరుకుంటారు. శరీరంలో ఫ్యాట్ కంటెంట్ పెరగిన వెంటనే శరీరంలో నార్మల్ వాల్యూస్ పెరుగుతాయి. అది ఓవెర్ వెయిట్ పెరగడానికి దారితీస్తుంది. ఇటువంటి పరిస్థితిలో వ్యాయామనేదే లేకుండా ఎక్కువ ఫుడ్స్ తినడం వల్ల ఇంకాస్త బరువు పెరుగుతారు.

ప్రస్తుత రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మిలియన్ల ప్రజలు ఓబేసిటితో బాధపడుతున్నారు. ఓవర్ వెయిట్ ఉండటం వల్ల శరీరంలో ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి ఎదుర్కోకుండా కొన్ని హోం రెమెడీస్ ను ఎంపిక చేసుకోవడం మంచిది.

15 Safe Home Remedies for Weight Loss

ఓవర్ వెయిట్ కు కారణాలు: ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం. జెనిటిక్ డిజార్డరస్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్, ఓవర్ ఈటింగ్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, హార్మోనుల ప్రభావం, హైపోథైరాయిడిజం, నిద్రలేమి, మెడికేషన్స్, ప్రెగ్నెన్సీ, వ్యాయామ లోపం.

ఓవర్ వెయిట్ లక్షణాలు: ఓవర్ వెయిట్ లక్షణాలను పర్టికులర్ గా ఇవీ అని చెప్పలేము కానీ, ఓవర్ వెయిట్ వల్ల ఈ క్రింది సమస్యలను ఎదుర్కుంటారు. ఎక్కువ చెమటలు పట్టడం, బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం, జాయింట్ మరియు బ్యాక్ పెయిన్ . ఫిజికల్ వర్క్ చేయడంలో టయర్డ్ నెస్, గురక, నిద్రలేమి సమస్యలు, బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటం. హై కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్, అక్యుట్ హార్ట్ డిసీజ్, బాడీపార్ట్స్ ఎన్ లార్జ్ అవ్వడం, నడుము చుట్టుకొలత పెరగడం , బ్రెస్ట్ సాగడం వంటి లక్షణాలు కనబడుతాయి.

బరువు తగ్గించుకోవడానికి ఉపయోగపడే కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..

 తేనె, నిమ్మరసం:

తేనె, నిమ్మరసం:

ఓవర్ వెయిట్ ను కంట్రోల్ చేయడంలో తేనె,నిమ్మరసం గ్రేట్ రెమెడీ. ఒక గ్లాసు గోరువెచ్చనీ నీళ్ళు తీసుకుని అందులో తేనె, మరియు నిమ్మరసం మిక్స్ చేయాలి. అందులోనే చిటికెడు బ్లాక్ పెప్పర్ కూడా మిక్స్ చేయవచ్చు. బాగా మిక్స్ చేసి, పరడుపున తాగడం వల్ల నేచురల్ వెయిట్ లాస్ డ్రింక్ గా పనిచేస్తుంది.

 గ్రీన్ టీ :

గ్రీన్ టీ :

గ్రీన్ టీలో పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇది మెండిగా మారిన ఫ్యాట్స్ ను విఛ్ఛిన్నం చేసి, ఫ్యాట్ ను కరిగిస్తుంది. రెగ్యులర్ గా గ్రీన్ టీ తాగడం వల్ల రియల్ బెనిఫిట్స్ పొందవచ్చు. పంచదార లేకుండా తాగితే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

సొరకాయ :

సొరకాయ :

రెగ్యులర్ డైట్ లో సొరకాయ చేర్చుకోవడం వల్ల ఓవర్ వెయిట్ తగ్గించుకోవచ్చు. బాటిల్ గార్డ్ లో ఉండే ఫైబర్ అందుకు గ్రేట్ గా సహాయపడుతుంది. మరియు సొరకాయలో ఎలాంటి ఫ్యాట్ ఉండదు. పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలిగిస్తుంది. కొన్ని గంటల పాటు స్మూత్ గా ఉంచుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్:

యాపిల్ సైడర్ వెనిగర్:

బరువు తగ్గించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాసునీటిలో మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఇది బాడీలో అన్ వాంటెండ్ ఫ్యాట్ ను కరిగిస్తుంది.

క్రాన్ బెర్రీస్ :

క్రాన్ బెర్రీస్ :

క్రాన్ బెర్రీస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది గ్రేట్ యాంటీఆక్సిడెంట్, ఇది ఫ్రీరాడికల్ ఫార్మేషన్ ను నివారించడం మాత్రమే కాదు, బరువును కంట్రోల్ చేస్తుంది. రెగ్యులర్ గా క్రాన్ బెర్రీ జ్యూస్ ను తాగాలి.

పార్ల్సే :

పార్ల్సే :

పార్ల్సే కిడ్నీ స్టోన్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే పొట్టను కూడా శాంతంగా ఉంచుతుంది. పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలిగిస్తుంది. క్యాలరీలను , బాడీలోని ఎక్సెస్ ప్యాట్ కరిగించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

క్యాబేజ్ :

క్యాబేజ్ :

క్యాబేజ్ లో ఉండే టార్టరిక్ యాసిడ్, బాడిలో షుగర్ మరియు కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ గా మారకుండా నివారిస్తుంది. ఒక బౌల్ ఉడికించిన క్యాబేజ్ తినడం వల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది.

క్యాప్ససిన్ :

క్యాప్ససిన్ :

చిల్లీపెప్పర్ లో ఉండే నేచురల్ పదార్థం మెటబాలిజం రేటును పెంచుతుంది. ఫ్యాట్ టిష్యుల కరిగిస్తుంది. అదే విధంగా, ఆకలిని తగ్గిస్తుంది. దాంతో ఫ్యాట్ బర్న్ అవుతుంది.

యోగ:

యోగ:

యోగ పాత పద్దతే అయినా, ఫ్యాట్ బర్న్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది చాలా వరకూ శరీరంలో ఫ్యాట్ బర్న్ చేయడంలో యోగ గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి, అధిక బరువు తగ్గించుకోవడానికి సహాయపడే యోగాసనాలను ఎంపిక చేసుకోవాలి.

రాగి:

రాగి:

రాగుల్లో ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్, విటమిన్ బి1, బి2 లు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి, రాగిపిండితో తయారుచేసిన వంటలను, రాగి జావాను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుని బరువు తగ్గించుకోవాలి.

వాటర్ :

వాటర్ :

రోజుకు తప్పనిసరిగా 8 గ్లాసుల నీళ్ళు తాగాలి. నీళ్ళలో ఉండే ఎలక్ట్రోలైట్స్ బాడీ వెయిట్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

టమోటోలు:

టమోటోలు:

బ్రేక్ ఫాస్ట్ లో ఒకటి రెండు టమోటోలను తినడం మంచిది. బాడీ వెయిట్ ను కంట్రోల్ చేయడం చేయడంలో టమోటోలు కూడా గ్రేట్ గా సహాయపడుతాయి.

కీరదోస:

కీరదోస:

కీరదోసకాయలో 90శాతం నీళ్ళు ఉండటం వల్ల ఫ్యాట్ సెల్స్ ను విచ్ఛిన్నం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి, కీరదోసకాయను ఎక్కువగా తీసుకోవడంమంచిది.

క్యారెట్స్ :

క్యారెట్స్ :

ఎక్స్ ట్రా ఫ్యాట్ కరిగించడంలో క్యారెట్స్ గ్రేట్ అండ్ హెల్తీ రెమెడీ. రోజూ ఉదయం ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగవచ్చు. అలాగే క్యారెట్ ను ముక్కలుగా కట్ చేసి సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. పచ్చిక్యారెట్స్ తినడం వల్ల ఖచ్చితంగా అదనపు బరువు తగ్గించుకోవచ్చు.

 బొప్పాయి:

బొప్పాయి:

బరువు తగ్గించడంలో బొప్పాయి గ్రేట్ రెమెడీ. బొప్పాయిని పరగడపున తినవచ్చు, ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు. ఇది బరువును కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తుంది

English summary

15 Safe Home Remedies for Weight Loss

According to medical experts and nutritionists, there is an optimum weight condition, which is in proportion to your height. When the fat content of your body exceeds the normal values, it tends to make you overweight.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more