For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యంగా జీవించడానికి 8 డైటరీ ఫైబర్ రిచ్ ఫ్రూట్స్

|

ఆధునిక కాలంలో తిండి దగ్గర నుంచి శారీరక శ్రమ వరకూ మన అలవాట్లన్నీ మారిపోయాయి. గతంలో ముతక ధాన్యాలు, తృణ ధాన్యాలు, రకరకాల పండ్లు, ముడి పప్పుల వంటివన్నీ తినేవారు. వాటితో తగినంత పీచు అందేది. కానీ ఇప్పుడు బాగా పాలీష్‌ పట్టిన ధాన్యాలు, పొట్టు తీసిన పప్పులు, రిఫైన్డ్‌ పదార్ధాలు తీసుకోవటం పెరిగింది. దీంతో ఆహారంలో పీచు మోతాదు తగ్గిపోతూ వస్తోంది. ఇలా ఆహారంలో పీచు మోతాదు తగ్గిపోవటం వల్ల చాలామంది ఆరోగ్య సమస్యలనూ ఎదుర్కొంటున్నారు. అలాగని మళ్లీ పూర్తిగా ముతక ధాన్యాలు, దంపుడు బియ్యం, రొట్టెల్లాంటి వాటికి పూర్తిగా మారిపోవటం కష్టం కాబట్టి.. మనం తినే ఆహారంలోనే 'పీచు' మోతాదు పెంచుకునేదెలా? అన్న అవగాహన పెంచుకుని.. అందుకు తగ్గట్టుగా మంచి అలవాట్లు పెంచుకోవటం ముఖ్యం!

ఫైబర్ రిచ్ ఆహారం మన శరీరంనకు పోషకాలను అందిస్తుంది. దీనిలో యాంటిఆక్సిడెంట్, విటమిన్లు మరియు ఫైటోకెమికల్స్ ఉంటాయి. అందువలన గుండెపోటు,క్యాన్సర్ మరియు మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం మీ జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిది. ఫైబర్ ఫుడ్స్ మలబద్దకాన్ని, హెమరాయిడ్స్ మరియు డివర్టిక్యులోసిస్, వంటి వ్యాదులను తగ్గిస్తాయి. అంతేకాక ఒక ఆరోగ్యకరమైన బరువు నిర్వహించడానికి సహాయపడుతుంది. ఒబేసిటిని కంట్రోల్ చేస్తుంది.

READ MORE: ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకొంటే పొందే గొప్ప ప్రయోజనాలు

మీరు అధిక ప్రయోజనాలు పొందాలంటే మీ ఆహారంలో తప్పనిసరిగా ఫైబర్ రిచ్ ఆహారాలు ఉండాలి. కార్న్,కాయధాన్యాలు,కిడ్నీ బీన్స్,సంపూర్ణ గోధుమ పాస్తా,బ్రౌన్ బియ్యం,సంపూర్ణ గోధుమ రొట్టె మరియు బ్రోకలీ మరియు క్యాబేజీ వంటి కూరగాయలు మరియు అవకాడొలు,బేరి పండ్లు మరియు యాపిల్ వంటి పండ్లలో పీచు అధికంగా ఉంటుంది. ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆహారాలు ఒక రూపం కలిగి మరియు మీకు సరైన పోషకాహారం అందుకోవడానికి సహాయపడతాయి.

READ MORE: అజీర్తి-జీర్ణ సమస్యలా:ఇదిగో టాప్ 10 ఫైబర్ ఫుడ్స్

ఫైబర్ లో జీర్ణం అయ్యే ఫైబర్ మరియు జీర్ణం కానీ ఫైబర్ రెండూ ఉంటాయి . ఈ రెండు రకాల ఫైబర్ అనేక పండ్లలో కనుగొనడం జరిగింది. వీటిని రెగ్యులర్ డైట్ లోచేర్చుకోవడం వల్ల రుచిని సంత్రుప్తిపరచడం మాత్రమే కాదు పొట్ట నిండుగా ఉండేలా చేస్తుంది.కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల మీరు తక్కువ ఆహారం తీసుకుంటారు మరియు బరువు తగ్గడానికి సహాయపడుతాయి. మరియు డైటరీ ఫైబర్ అధికంగా ఉండే ఫ్రూట్స్ ఏంటో ఒక సారి చూద్దాం....

అవొకాడో:

అవొకాడో:

అవెకాడో పండు ఈ పండు ఫైబర్ యొక్క చాలా మంచి వనరుగా చెప్పవచ్చు. మొత్తం పండులో 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ పండులో క్రీమీ ఫ్లెష్ ఉండుట వల్ల కొలెస్టరాల్ తగ్గించటానికి సహాయం మరియు గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తుంది. అంతేకాక మంచి కొవ్వులు కలిగి ఉంటుంది.

జామకాయ:

జామకాయ:

జామకాయను అధిక న్యూట్రీషియన్స్ ఉన్న ఫ్రూట్స్ గా భావిస్తారు . ఒక్క జామ కాయలో 9గ్రాములు ఫైబర్ కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో విటమిన్ కె మరియు విటమిన్ సిలు కూడా ఉన్నాయి . అధిక ఫైబర్ కంటెంట్ ఉండుటం వల్ల డయాబెటిస్ ను నివారించుకోవచ్చు.

కివి ఫ్రూట్:

కివి ఫ్రూట్:

కివి ఫ్రూట్ లో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. కివి ఫ్రూట్ లో 1.7గ్రాముల ఫైబర్ ఉంది. కివి ఫ్రూట్ లో ఉండే సోలబుల్ కంటెంట్ హార్ట్ అటాక్ రిస్క్ ను తగ్గిస్తుంది.

డేట్స్:

డేట్స్:

ఖర్జూరంలో న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇందులో ఇన్ సోలబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది. డేట్స్ లో మెగ్నీషియం, క్యాల్షియం, మరియు విటమిన్ బి6పుష్కలంగా ఉన్నాయి . ప్రతి ఒక్క ఖర్జూరంలో 1.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

 ఆరెంజ్:

ఆరెంజ్:

ఫైబర్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసం. సోలబుల్ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇన్ సోలబుల్ ఫైబర్ ఆరెంజ్ లో ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిక్ పేషంట్స్ కు ఇది చాలా మేలు చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

ఆపిల్స్:

ఆపిల్స్:

మీరు విషయాన్ని ఇదివరుకు వినే ఉంటారు. రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు. ఇది కేవలం ఒక సామెత మాత్రమే కాదు. నిజానికి దీనిలో ఫైబర్ మరియు ప్రయోజనకరమైన ఫైటోకెమికల్స్ ను కలిగి ఉంది. ఒక సాధారణ పరిమాణం గల యాపిల్ లో 4.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

రాస్బెర్రీస్:

రాస్బెర్రీస్:

రాస్బెర్రీస్ లో విటమిన్ సి, మ్యాంగనీస్, మరియు డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంది. ఒక కప్పు రాస్బెర్రీస్ లో 8గ్రాములు డైటరీ ఫైబర్ ఉంటుంది. ఈ హైఫైబర్ ఓబేసిటి మరియు హార్ట్ డిసీజ్ రిస్క్ ను తగ్గిస్తుంది.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

అరటిపండ్లులో ఎక్కువ న్యూట్రీషియన్స్ మరియు ఫైబర్ కంటెంట్ ఉన్నాయి. అరటిపండ్లలోని ఫైబర్ నార్మల్ బౌల్ మూమెంట్ ను కూ సహాయపడుతుంది . క్రోనిక్ క్యాన్సర్ ను నివారిస్తుంది.

English summary

Eight Fruits That Are Rich In Dietary Fibers: Health Tips in Telugu

Fibre is an important component of a healthy diet. It aids in digestion and loss of weight. Hence,intake of fiber is very much essential. It has plethora of health benefits. Intake of fibre helps in preventing constipation, hemorrhoids and diverticulosis. It also aids in controlling obesity.
Story first published: Tuesday, August 25, 2015, 18:25 [IST]
Desktop Bottom Promotion