For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రొటీన్ రిచ్ ఫుడ్ తో.. గుండె ఆరోగ్యం పదిలం

By Nutheti
|

మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారంలో పోషక పదార్థాలు సరైన మోతాదులో ఉండాలి. శరీరానికి కావలసిన శక్తినివ్వటంలో, శరీర పెరుగుదలలో తోడ్పడే పదార్థాలే పోషకాలు. కాబట్టి రోజూ తీసుకొనే ఆహారంలో తప్పని సరిగా కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్లు, పోషక పదార్థాలు ఉండాలి. అన్ని పదార్థాలు సమపాళ్లలో ఉంటే ఆరోగ్యంగా ఉంటారు.

READ MORE: ప్రోటీన్ డ్రింక్స్ త్రాగడం వల్ల ఆరోగ్యాని కలిగే ప్రమాదాలు

శరీరంలో చాలా అవసరం అయ్యే వాటిలో ముఖ్యమైనది ప్రోటీన్. ఆరోగ్యవంతమైన ప్రోటీన్ లు పొందటానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం.

చికెన్

చికెన్

గొర్రె లేదా మేక మాంసంతో పోలిస్తే కోడి మాంసంలో కొవ్వు పదార్థాల స్థాయిలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. శక్తివంతమైన ప్రోటీన్ ల కోసం వైట్ మీట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే కోడిమాంసం వండటానికి ముందు దానిపై ఉండే స్కిన్ తొలగించడం మంచిది. ఇందులో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి.. అవి తీసుకోకపోవడం మంచిది.

సీ ఫుడ్

సీ ఫుడ్

తక్కువ ఫ్యాట్ లు ఉండే సీ ఫుడ్ శక్తివంతమైన ప్రోటీన్ లను కలిగి ఉంటుంది. చేపలు, సాల్మన్ వంటి వాటిలో కొవ్వు పదార్థాలు అధిక స్థాయిలో ఉన్నా.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ లు చాలా ఉంటాయి.

చీజ్

చీజ్

చీజ్ లో తక్కువ ఫ్యాట్ లు, ఆరోగ్యకరమైన ప్రొటీన్ లు ఉంటాయి. వీటిని స్నాక్స్ గానో, తాజా కాయగూరలు, ఆకుకూరలతో కలుపుకుని తినడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది.

గుడ్లు

గుడ్లు

గుడ్లు పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. ప్రొటీన్లతో పాటు విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. రోజుకు ఒక గుడ్డు తింటే శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.

బీన్స్

బీన్స్

బీన్స్ లో చాలా రకాలు ఉన్నాయి. అన్ని రకాల బీన్స్ లలో అత్యధిక మోతాదులో ప్రోటీన్స్ ఉంటాయి. అరకప్పు ఉడకబెట్టిన బీన్స్ లో చాలా ప్రోటీన్ లు ఉంటాయి. అంతేకాకుండా ఎక్కువ సమయం ఆకలి అనిపించదు. కాబట్టి రోజువారీ ఆహారంలో అరకప్పు బీన్స్ ఫుడ్ ఉండేలా చూసుకుంటే మంచిది.

సోయా

సోయా

ప్రోటీన్ లను అందించడంలో సోయాకే ఫస్ట్ ప్లేస్. వీటితో చాలా రఆరోగ్య ప్రయోజనాలున్నాయి. శరీరంలో తక్కువ కొవ్వు పదార్థాలను ఉండేలా చేసి, గుండె ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహిస్తుంది. సోయా గింజల నుండి తయారు చేసిన ఆహార పదార్థాలలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ లుంటాయి.

ఆకుకూరలు

ఆకుకూరలు

తాజా ఆకుకూరలను తరచుగా తీసుకోవడం మెరుగైన ఆరోగ్యానికి మార్గం. వీటిలో ఉండే పోషకాలు శరీర ఆరోగ్యానికి చాలా సహకరిస్తాయి.

బాదం

బాదం

నట్స్ శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. వీటిలో బాదం చాలా అవసరం. ఎందుకంటే వీటిలో పుష్కలంగా ప్రొటీన్స్ ఉంటాయి. వాటితో పాటు విటమిన్స్, మినరల్స్, ఫైబర్ కూడా ఉంటాయి.

పీనట్ బటర్

పీనట్ బటర్

వేరుశనగ, వెన్న శరీరానికి కావలసిన ప్రోటీన్స్ ను అందిస్తాయి. ఇవి హృదయం సరిగా పని చేయటానికి, పేగు కదలికలను సరిగా ఉంచి గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండేలా చేస్తాయి. కాబట్టి ఈవెనింగ్ స్నాక్స్ లలో పీనట్ బటర్ ను.. పిల్లలకు అందించడం మంచిది.

English summary

Protein Rich diet will keep your heart healthy in telugu

Proteins are the building blocks of our body. This is important to keep each single cell in its perfect structure and shape to provide excellent functioning. Providing protein through the diet is the best thing that we can do to make the process natural.
Story first published: Saturday, November 7, 2015, 15:59 [IST]
Desktop Bottom Promotion