For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజుకి ఎన్ని నట్స్ తినాలి ? ఏ డ్రై ఫ్రూట్స్ ఎన్ని తినాలి ?

డ్రై ఫ్రూట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే.. షుగర్స్, క్యాలరీలు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని 10 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఏ డ్రై ఫ్రూట్స్ ఎన్ని తింటే ఆరోగ్యకరం ?

By Swathi
|

డ్రై ఫ్రూట్స్ ! ఇవి ఆరోగ్యానికి మంచిదని చాలా మంది సూచిస్తారు. ప్రొటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఇవన్నీ ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి కావాల్సినవి. వీటన్నింటిని పొందడానికి డ్రై ఫ్రూట్స్ ఒక ఆప్షన్. అయితే ఇవి ఆరోగ్యానికి మంచిది కదా అని.. ఇష్టమొచ్చినట్టు తినకూడదు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అయితే ఎంత పరిమాణంలో తినాలి. ఏ డ్రై ఫ్రూట్స్ ఎన్ని తింటే ఆరోగ్యకరం ?

What Is The Exact Number Of Nuts That You Should Be Eating Each Day?

డ్రై ఫ్రూట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే.. షుగర్స్, క్యాలరీలు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని 10 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. అలాగే డైరెక్ట్ గా తినడం కూడా మంచిది కాదు. కాబట్టి.. డ్రై ఫ్రూట్స్ తినే విధానం, ఏ నట్స్ ఎంత పరిమాణంలో తినాలి అనేది ఇప్పుడు చూద్దాం.

నట్స్ మెదడు ఆరోగ్యానికి చాలామంచిది. వాల్ నట్ ఆకారం అచ్చం మనుషుల మెదడులాగే ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల హైకొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది, రీప్రొడక్టివ్ సిస్టమ్ పనితీరుకి సహాయపడతాయి. అలాగే క్యానర్ ని అడ్డుకుంటాయి. మరి రోజుకి ఏ నట్స్ ని ఎంత పరిమాణంలో తీసుకోవాలో చూద్దాం..

10 గ్రాములు

10 గ్రాములు

అధ్యయనాల ప్రకారం రోజుకి 10 గ్రాముల నట్స్ ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను అడ్డుకోవచ్చు.

వాల్ నట్స్

వాల్ నట్స్

వాల్ నట్స్ పైన ఉండే బొప్పి తీయగానే.. ఉండే స్కిన్ ఫ్లేవర్ అంత టేస్టీగా ఉండదు. కానీ.. 90 శాతం యాంటీ ఆక్సిడెంట్స్, ఫెనోలిక్ యాసిడ్స్, టాన్నిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఈ స్కిన్ లోనే ఉంటాయట. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించడంలో ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని 10 గ్రాములు తినవచ్చు. అంటే రోజుకి 5 వాల్ నట్స్ తింటే సరిపోతుంది.

వేరుశనగలు

వేరుశనగలు

వేరుశనగలను చాలా మంది వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే వీటిని ప్రతిరోజూ తినడం వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయి. వీటిని కూడా రోజుకి 10 గ్రాములు అంటే.. 12 వేరుశనగలు తినవచ్చు.

బాదాం

బాదాం

బాదాంపప్పులో మోనో శ్యాచురేటెడ్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్ట్ కి, బ్రెయిన్ కి , స్కిన్ కి మంచిది. అలాగే విటమిన్ ఈ, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇవి బ్లడ్ ప్రెజర్ నార్మల్ గా ఉండటానికి సహాయపడతాయి. రక్త ప్రసరణకు మంచిది. వీటిని కూడా రోజుకి 10 గ్రాములు తినవచ్చు. అంటే. 8 నుంచి 9 బాదాం గింజలు తినాలి.

జీడిపప్పు

జీడిపప్పు

జీడిపప్పు రెగ్యులర్ గా తినడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి వీటిని కూడా రోజుకి 10 గ్రాములు చొప్పున తీసుకోవచ్చు. 10 గ్రాములు అంటే.. 6 జీడిపప్పు గింజలు తీసుకోవాలి. వారానికి 28 జీడిపప్పులు తింటే మంచిది.

ప్రతిరోజూ

ప్రతిరోజూ

ప్రతిరోజూ ఎవరైతే 10 గ్రాముల నట్స్ తింటారో వాళ్లలో 23 శాతం వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది. 21 శాతం క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. 47 శాతం నరాలకు సంబంధించిన వ్యాధుల రిస్క్ తగ్గుతుంది. 30శాతం డయాబెటిస్ రిస్క్, 17శాతం గుండె వ్యాధుల రిస్క్ తగ్గుతుంది.

డైట్

డైట్

ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో డైట్ లో నట్స్ ని చేర్చుకోవాలి. ఒకవేళ ఉదయం తినడం వీలు కాలేదు అంటే.. సాయంత్రం స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు. లేదా సలాడ్స్, స్మూతీలలో మిక్స్ చేసి తీసుకోవచ్చు.

English summary

What Is The Exact Number Of Nuts That You Should Be Eating Each Day?

What Is The Exact Number Of Nuts That You Should Be Eating Each Day. We all know that eating nuts is healthy. But how much of each should we be eating everyday? Read on to know.
Desktop Bottom Promotion