పాప్-కార్న్ ను తినడంవల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు!!!

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మనము థియేటర్లలో (లేదా) ఇంటి దగ్గర సినిమాలను చూసేటప్పుడు మనము ఎక్కువగా తీసుకునే స్నాక్స్ "పాప్-కార్న్". ఒక గిన్నెడు తాజా పాప్ కార్న్ అనేది మీ రోజును చాలా హ్యాపీ చేస్తుంది. కానీ, ఇంట్లో మొక్కజొన్న నుండి తయారైన సేంద్రీయ పాప్-కార్న్ ను, బయట నుండి కొనుగోలు చేయబడిన దానికి బదులుగా తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది.

మొక్కజొన్న అనేది కూరగాయ మరియు ధాన్యం లాంటి రెండింటి మిళితం (సమ్మేళనం) గా పరిగణించబడుతుంది మరియు ఇది పురాతన కాలం నాటి నుండి మనకు అందుబాటులో ఉన్నది. నూనెలో మొక్కజొన్న కెర్నల్ (గుజ్జు) ను వేడి చేసినప్పుడు, అది పాప్కార్న్ గా మారుతుంది. పాప్కార్న్ ను దాని రుచి కోసం మాత్రమే కాకుండా, దాని పోషక విలువ కోసం కూడా ఆస్వాదించాలి.

ప్రపంచవ్యాప్తంగా పజలందరూ పాప్కార్న్ ను సంతోషంతో ఆస్వాదిస్తున్నారు మరియు పాప్కార్న్ పై ఉప్పును, వెన్నను మరియు పంచదార పాకాన్ని వేదజల్లాడమనే పలు రకాలుగా తయారీ పద్ధతలతో రుచికరంగా తయారుచేస్తారు. ఇలా తినడం వల్ల మనకు అనారోగ్యాన్ని కలుగజేస్తుంది. ఎలాంటి రుచులను కలపకుండానే నేరుగా తినడమే ఉత్తమమైన మార్గం.

ఈ పాప్-కార్న్ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ B కాంప్లెక్స్, మాంగనీస్ మరియు మెగ్నీషియం ఉన్నాయి. పాప్కార్న్ తినడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు గురించి మరింత తెలుసుకోవడానికి ఈ క్రింది విషయాలను జాగ్రత్తగా చదవండి.

1. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది :

1. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది :

పాప్-కార్న్ ఫైబర్ను కలిగి ఉంది, ఇది రక్త నాళాలు మరియు ధమనుల గోడల మీద పేరుకుపోయిన అదనపు కొలెస్ట్రాల్ ను తొలగించగలదు, అలా మీ శరీర మొత్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను బాగా తగ్గిస్తుంది. ఇది హృదయ రుగ్మతలను అనగా, గుండె పోటును మరియు స్ట్రోక్ వంటి హృదయనాళము యొక్క విషమ పరిస్థితుల అవకాశాలను బాగా తగ్గిస్తుంది.

2. జీర్ణం మెరుగుపరుస్తుంది :

2. జీర్ణం మెరుగుపరుస్తుంది :

పాప్కార్న్ అనేది ధాన్యమనే సంతతికి చెందినందున అందులో ఎండోస్పెర్మ్, జెర్మ్ మరియు బ్రాన్ అనే విశేష అంశాలను కలిగి ఉంటుంది మరియు సహజమైన ధాన్యంగా ఉండటం వల్ల, జీర్ణక్రియకు సహాయపడే అన్ని రకాల ఫైబర్లను కలిగి ఉంటుంది. ఇది ప్రేగు కదలికలకు సరైన రీతిలో సహాయపడుతుంది మరియు మలబద్ధకాన్ని కూడా నిరోధిస్తుంది.

3. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది :

3. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది :

పాప్కార్న్లో ఫైబర్ అనేది పుష్కలంగా దొరుకుతుంది, అది రక్తంలో విడుదల కాబడిన ఇన్సులిన్ స్థాయిలను బాగా నియంత్రిస్తుంది. ఇది రక్తంలోని చక్కెరను ఎల్లప్పుడూ ఒకే ఒక స్థాయిలో ఉంచడం వల్ల మధుమేహాన్ని నిరోధించేదిగా ఉంటుంది. కాబట్టి సహజసిద్ధమైన సేంద్రీయ పద్ధతిలో తయారుచేయబడిన పాలను తీసుకోవడం వల్ల డయాబెటిస్ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

4. క్యాన్సర్ను నిరోధిస్తుంది :

4. క్యాన్సర్ను నిరోధిస్తుంది :

పాప్కార్న్లో పాలీ-ఫినోలిక్ సమ్మేళనాలను చాలా అధిక మొత్తంలో కలిగి ఉన్నాయి, ఇది మీ శరీరంలో సంచరించగల మరింత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లలో ఇది కూడా ఒకటి. ఈ రకమైన యాంటీ ఆక్సిడెంట్లు, మన శరీరంలో స్వేచ్ఛగా తిరిగే హానికరమైన సూక్ష్మ రాశులను తొలగించగల శక్తివంతమైన రక్షణ ఏజెంట్లుగా పనిచేస్తున్నాయి.

5. వృద్ధాప్య ఛాయలను నిరోధిస్తుంది :

5. వృద్ధాప్య ఛాయలను నిరోధిస్తుంది :

పాప్కార్న్ వయస్సు పెరగడం వల్ల వచ్చే ముడుతలను, వయసు మచ్చలను, మాక్యులార్ డిజెనరేషన్ వల్ల వచ్చే అంధత్వమును, కండరాల బలహీనత మరియు జుట్టు ఊడిపోవడం వంటి వయస్సు-ఆధారిత లక్షణాలకు చికిత్సను చేయవచ్చు. పాప్-కార్న్లో ఉన్న శక్తివంతమైన అనామ్లజనకాలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

6. బరువు తగ్గటం :

6. బరువు తగ్గటం :

సాధారణంగా పాప్-కార్న్లో కేవలం 30 కేలరీలు మాత్రమే ఉన్నాయని మీకు తెలుసా? బంగాళాదుంప చిప్స్ కంటే 5 రెట్లు తక్కువగా క్యాలరీలను ఇంది కలిగి ఉందా ? పాప్కార్న్లో ఉన్న ఫైబర్ కంటెంట్ మీ కడుపు పూర్తిగా నిండిన అనుభూతిని కలిగిస్తుంది మరియు ఆకలిని కలిగించే హార్మోన్ల విడుదలను నిరోధిస్తుంది. "సంతృప్త కొవ్వు ఆమ్లాలలో" ఇది చాలా తక్కువగా ఉంటుంది.

7. ఎముకలు ఆరోగ్యంగా వృద్ధి చెందడానికి :

7. ఎముకలు ఆరోగ్యంగా వృద్ధి చెందడానికి :

పాప్కార్న్లో అధిక మోతాదులో మాంగనీస్ ఉంది, ఇది బలమైన మరియు ఆరోగ్యకరమైన ఎముకలను నిర్మించి, అదే స్థాయిలో వాటి దృఢత్వాన్ని కొనసాగేలా ఉంచడానికి సహాయపడుతుంది. మాంగనీస్ అనేది ఎముకల నిర్మాణానికి సహాయపడుతుంది మరియు ఆస్టియోపోరోసిస్ (బోలు ఎముకల వ్యాధి), ఆర్థరైటిస్ (కీళ్ల నొప్పులు) మరియు ఆస్టియో ఆర్థరైటిస్ వంటి వ్యాధుల నుండి రక్షిస్తుంది.

8. ఇది తృణధాన్యము వంటి సంపూర్ణమైన ఆహారం :

8. ఇది తృణధాన్యము వంటి సంపూర్ణమైన ఆహారం :

పాప్ కార్న్ అనేది ప్రాసెస్ చేయబడని, 100 శాతం సహజసిద్ధమైన తృణధాన్యముగా చెప్పవచ్చు. మన రోజువారీ సేవలను అందించేందుకు గానూ పాప్కార్న్ ను 70 శాతం కంటే ఎక్కువగా తీసుకోవడం మంచిది. మీరు ఓట్మీల్ తినడం వల్ల బాగా విసుగు చెందితే, పాప్కార్న్ ను ఒకసారి ప్రయత్నించి చూడండి.

9. పాప్-కార్న్ లో ఐరన్ ఉంది :

9. పాప్-కార్న్ లో ఐరన్ ఉంది :

USDA ప్రకారం, 28 గ్రాముల పాప్-కార్న్ లో 0.9 mg ఐరన్ ఉంటుంది. మగవారికి మాత్రమే రోజుకు 8 mg ఐరన్ వారికి అవసరం మరియు మహిళలకు రోజుకు 18 mg ఐరన్ అవసరమవుతుంది. కాబట్టి, తాజా మరియు సేంద్రీయ పాప్కార్న్ తినటం ద్వారా మీలో ఐరన్ స్థాయిలను పెంచుకోవడానికి అనువుగా ఉంటుంది.

10. ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ :

10. ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ :

అధిక-ఫైబర్ కలిగిన ఈ ఆహారం మధుమేహ రోగులకు ఆరోగ్యకరమైనది మరియు పాప్కార్న్ ఆ వర్గం వారికి సరిగ్గా సరిపోతుంది. పాప్-కార్న్ అధిక ఫైబర్తో నిండి ఉంది, కావున అది సులభంగా జీర్ణమవుతుంది మరియు ఇది రక్తంలోని చక్కెరను ఆకస్మికంగా పెంచేదిగా చేసేది మాత్రం కాదు. కాబట్టి, మీరు మధుమేహంతో బాధపడుతుంటే, పాప్కార్న్ ను సురక్షితంగా తినవచ్చు.

English summary

10 Health Benefits Of Eating Popcorn

Popcorn is enjoyed around the world and it is made in various ways by pouring salt, butter and caramel for flavouring. This makes it unhealthy to consume and the best way to eat it is without adding any flavours. Popcorn contains fibre, antioxidant, vitamin B complex, manganese and magnesium. Organic popcorn made from corn at home is the healthiest way.
Subscribe Newsletter