For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేగంగా బరువు తగ్గించుకోవాలంటే నిద్రించే ముందు వీటిని తప్పక పాటించాలి...

|

సహజంగా నిద్రలేకపోతే అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, మంచి ఆరోగ్యం పొందాలంటే రోజూ సరైన నిద్ర చాలా అవసరం. రోజూ సరిపడా నిద్రపోవడం లేదంటే బాడీలో ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్ లిప్టిన్ క్రమంగా తగ్గిపోతుంది. దాంతో శరీరంలో కొవ్వు , ఆకలిని పెంచే హార్మోనులు, పెరుగుతాయి. గ్రెలిన్ క్రమంగా పెరుగుతుంది.

ఇది క్రమంగా వేగంగా బరువు పెరగడానికి మరియు బెల్లీ ఫ్యాట్ కు కారణం అవుతుంది. ప్రొపర్ బాడీ వెయిట్ ను మెయింటైన్ చేయడానికి బెడ్ టైమ్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గాలంటే నిద్రించడానికి ముందు కొన్ని చిన్న చిన్న విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవడం వల్ల నిద్రకు సహాయపడుతాయి. మెటబాలిజం రేటు పెరుగుతుంది మరియు ఒత్తిడి తగ్గించుకోవచ్చు. రాత్రుల్లో తీసుకొనే ఈ ఆహారాల్లో అమినో యాసిడ్స్ అధికంగా ఉంటాయి. దీన్నే ట్రైప్టోఫోన్ అని పిలుస్తారు. ఇది బాడీ రిలాక్సేషన్ కు సహాయపడుతుంది . లెప్టిన్ అనే ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్ ను పెంచుతుంది.

అలాగే రాత్రుల్లో డిన్నర్ చేయకపోవడం వల్ల బరువు తగ్గడానికి బదులు, బరువు పెరగడానికి కారణం అవుతుంది . మీరు సరిగా నిద్రపోలేరు. అంతే కాదు రాత్రంతా ఆకలి పెడుతుంటుంది. ఫలితంగా నిద్రసరిగా పట్టదు. దాంతో స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతాయి మరియు బరువు పెరుగుతారు. కాబట్టి, బరువు తగ్గడానికి నిద్రించే ముందు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఈ క్రింది విధంగా...

ట్రిప్టోఫాన్ అధికంగా ఉండే ఆహారాలను అధికంగా తీసుకోవాలి:

ట్రిప్టోఫాన్ అధికంగా ఉండే ఆహారాలను అధికంగా తీసుకోవాలి:

అమినోయాసిడ్ ట్రిప్టోఫాన్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల బాగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది. నిద్రకు అంతరాయం కలగదు. ఇది స్ట్రెస్ హార్మోన్స్ మరియు బాడీ వెయిట్ పెంచే గ్రెలిన్ లెవల్స్ ను తగ్గిస్తుంది . గ్రిల్డ్ చికెన్, టర్కీ లేదా మేక వంటివి నిద్రించడానికి ముందు తీసుకోవడం మంచిది.

రూయ్ బోస టీ ఒక కప్పు త్రాగాలి:

రూయ్ బోస టీ ఒక కప్పు త్రాగాలి:

నిద్రించడానికి ముందు రూయ్ బోస్ టీని ఒక కప్పు త్రాగాలి . ఇందులో పవర్ ఫుల్ ఫ్లెవనాయిడ్స్ ఆస్పథాలిన్ ఉండటం వల్ల ఇది బెల్లీ ఫ్యాట్ కరగడానికి సహాయపడుతుంది. ఈ టీ స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిస్తుంది మరియు ఆకలిని తగ్గిస్తుంది . బెల్లీ ఫ్యాట్ కరిగిస్తుంది.

ప్రోటీన్ షేక్ తీసుకోవాలి:

ప్రోటీన్ షేక్ తీసుకోవాలి:

నిద్రించడానికి ముందు ప్రోటీన్ షేక్ తీసుకోవడం వల్ల బాడీ మెటబాలిజం రేటును పెంచుతుంది మరియు మిమ్మల్ని స్లిమ్ గా మార్చుతుంది . ఇది రాత్రుల్లో బాడీ ఫ్యాట్ మరియు క్యాలరీలు కరిగించడానికి సహాయపడుతుంది.

చీజ్ తినాలి:

చీజ్ తినాలి:

బెడ్ టైమ్ లో భోజనం చేయకుండుట వల్ల బరువు పెరగడానికి కారణం అవుతుంది . ఆకలితో పడుకొన్నప్పుడు నిద్రించడానికి కష్టం అవుతుంది. అదే విధంగా ఉదయాన్నే ఆకలితో నిద్రలేవడం వల్ల హైక్యాలరీ కార్బోహైడ్రేట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవల్సి వస్తుంది. నిద్రించడానికి ముందుగా కొద్దిగా కాటేజ్ చీజ్ తీసుకోవడం వల్ల ఇందులో ప్రోటీన్ మరియు ట్రైప్టోఫోన్ అధికంగా ఉంటుంది.

విశ్రాంతిగా మరియు రిలాక్స్డ్ గా ఉండాలి:

విశ్రాంతిగా మరియు రిలాక్స్డ్ గా ఉండాలి:

త్వరగా నిద్రపోవాలన్న ఉద్దేశ్యంతో మనస్సు మీద ఫోర్స్ పెడుతూ నిద్రించడం ఇది ఏమాత్రం సహాయపడదు. మీరు ఎప్పటికీ నిద్రమేల్కొనే ఉంటారు. కాబట్టి రిలాక్స్ గా ఉండాలి. కొద్దిసేపు ఎంటర్టైన్ గా గడిపి తర్వాత బెడ్ మీదకు చేరాలి.

బాడీ వెయిట్ ఎక్సర్ సైజ్:

బాడీ వెయిట్ ఎక్సర్ సైజ్:

నిద్రించే ముందు కొంచెం వ్యాయామం చేయడం వల్ల బరువు వేగంగా తగ్గించుకోవచ్చు. కార్డియో వ్యాయామం పుషప్ అండ్ పుల్ అప్స్ , పుల్ అప్స్ మరియు బాడీ వెయిట్ క్వాట్స్ చేయాలి. ఈ వ్యాయామాలు బాడీ ఫ్యాట్ ను టార్గెట్ చేస్తాయి.

నోట్ చేసుకోవాలి:

నోట్ చేసుకోవాలి:

నిద్రించడానికి ముందు ఏం చేయాలనుకుంటున్నారో ప్లాన్ ప్రకారం రాసుకోవాలి .దాని వల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చు మరియు బెటర్ గా నిద్రపడుతుంది. స్ట్రెహార్మోన్స్ విడుదలవడ్డం వల్ల ఫ్యాట్ పెరుగుతారు.

English summary

Things That You Can Do Before Bedtime To Lose Weight

A proper sleep is very important for weight loss and for better health as well. If we don't get a good night sleep then the fat burning hormone known as leptin will get decreased in the body and fat building and hunger hormone, ghrelin will get stimulated.
Story first published: Wednesday, February 10, 2016, 18:01 [IST]
Desktop Bottom Promotion